చిరుధాన్యాలపై అవగాహన సదస్సు
చిత్రం న్యూస్, జైనథ్: పోషణ మాసోత్సవాల్లో భాగంగా జైనథ్ మండలం బెల్లూరి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థినులకు చిరుధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భూమాబాయి మాట్లాడుతూ.. పిల్లలు పోషకాహారం, ముఖ్యంగా చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను, రోగ నిరోధక శక్తి పెరుగుదల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాడె రవి, వార్డు సభ్యురాలు సురేఖ, ఆశా వర్కర్ వనజ, అంగన్వాడీ హెల్పర్ దేవుబాయి, విద్యార్థులు, చిన్నారులు, తల్లులు, తదితరులు పాల్గొన్నారు.
