-Advertisement-

ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ సుద్ధ సాయిబాబాని సన్మానించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

 ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ సుద్ధ సాయిబాబాని సన్మానించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

చిత్రం న్యూస్, బాసర : భారతీయ జనతా పార్టీ బాసర మండల సీనియర్ నాయకులు సుద్ధ సాయిబాబాని, నిర్మల్ జిల్లా ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా ముథోల్ నియోజకవర్గ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ సాయిబాబాని శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పార్టీని నమ్ముకుని, ఎన్నో ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని, సుద్ధ సాయిబాబాకి ఈ బాధ్యత దక్కడం హర్షణీయమని” పేర్కొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పోగుల రాజేశ్వర్, సాకలి సాయినాథ్, సిద్దు , గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments