-Advertisement-

బాసరలో బీజేపి దళిత మోర్చా ధర్నా: BRS ఎమ్మెల్సీలపై చర్యలకు డిమాండ్

బాసరలో బీజేపి దళిత మోర్చా ధర్నా: BRS ఎమ్మెల్సీలపై చర్యలకు డిమాండ్

చిత్రం న్యూస్, బాసర : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై BRS ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా బాసర మండలంలో భారతీయ జనతా పార్టీ (బీజేపి) దళిత మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ​స్థానిక బస్టాండ్ ఆవరణలో బహుజన, దళిత నాయకులతో కలిసి బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేతపై అహంకారపూరితంగా, అనుచిత వ్యాఖ్యలు చేయడం BRS నాయకుల దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు.

​ఈ సందర్భంగా బాసర మండల బీజేపి నాయకులు మాట్లాడుతూ..కేవలం పోలీసు అరెస్టులతో ఈ అంశాన్ని ముగించకుండా, రాజ్యాంగ స్థానాన్ని కించపరిచిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను BRS పార్టీ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులను అవమానించేలా మాట్లాడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాసర మండల బీజేపి అధ్యక్షులు పుట్నాల సాయినాథ్, సతీష్ రావు, పోగుల రాజేశ్వర్, బీద్ధుర్ రమేష్, సాకలి సాయినాథ్, దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments