కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు
చిత్రం న్యూస్, జైనథ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పోరుబాట కార్యక్రమం చేపట్టారు. జైనథ్ మండలం ఖాప్రి ఎక్స్ రోడ్డు జాతీయ రహదారిపై వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సాంప్రదాయ, సాంస్కృతిక భజన కార్యక్రమాలను రోడ్లపై ప్రదర్శించగా మాజీ మంత్రి జోగు రామన్న వారితో కలిసి ఉత్సహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి గత brs ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కనికరం లేకుండా ప్రతి ఇంటిని సంక్షోభానికి గురి చేసిందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు అండగా ఉన్న పథకాలను సైతం నీర్వేర్యం చేసే కుట్రలు పన్నడం సరికాదన్నారు. గత ప్రభుత్వంపై ఉన్న అక్కసును తెలంగాణ ప్రజలపై రుద్దడం సమంజసం కాదని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో విద్యార్థులు, మహిళలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మితోపాటు విద్యార్థిని విద్యార్థుల ఉన్నత విద్యా విధానాన్ని పెంపొందిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కడుపులో పుట్టిన బిడ్డనుండి వృద్ధుల వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు ఇలా 420 దొంగ హామీలు ఇచ్చి అధికారం రాగానే రేవంత్ రెడ్డికి ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తు రావడంలేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, హామీల అమలు కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యాసం నర్సింగ్ రావు, కళ్లెం ప్రమోద్ రెడ్డి, సతీష్ పవార్, గోవర్ధన్, గంభీర్ టాక్రీ,గణేష్ యాదవ్, జక్కుల మధుకర్, కిషన్ వైద్య, తన్విర్, దేవన్న, వెంకన్న, రవి కాంత్ రెడ్డి, పురుషోత్తం, కోరెడ్డి నర్సింగ్, నితిన్ రెడ్డి, అడప తిరుపతి, ఊశన్న,తదితరులు పాల్గొన్నారు.
