చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవిస్తూ, ప్రకృతితో మమేకమై మనుగడ సాగిస్తున్న ముదిరాజ్ లు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం గాంధీ పార్కులో పెద్దమ్మ తల్లి, భీమన్న దేవుని ప్రతిష్టాపనను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు బస్టాండ్ ఎదుట పండుగ సాయన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే పాయల శంకర్ ఆవిష్కరించారు. తొలుత పూజలు చేసి సంఘం జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..ముదిరాజ్లు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెద్దమ్మ తల్లి, భీమన్న దేవుడి కృపాకటాక్షాలు ముదిరాజ్ సమాజంపై ఎళ్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ముదిరాజుల కోసం ఎల్లవేళలా తను ముందుండి పోరాడతానన్నారు.
