విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి
చిత్రం న్యూస్, జైనథ్ : విద్యార్థులు విద్యార్జన పూర్తి అయ్యే వరకు సోషల్ మీడియా దుష్ప్రభావానికి గురికాకుండా ఏకాగ్రతతో చదువు కోవాలని, తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆశయాలకు అనుగుణంగా, కష్టపడి అధ్యయనం చేయాలని సామాజిక సమరసత వేదిక అఖిల భారత కళా విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘యూత్ ఫర్ సేవా ప్రాయోజకంతో’,సమరసత వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జైనథ్ మండలంలోని 22 సమీప గ్రామాల విద్యార్థులకు నోట్ బుక్స్ (5), పెన్సిల్ పౌచ్,కంపాస్ / జామెట్రీ బాక్స్, స్కేల్, పెన్సిల్, పెన్ను, ఎరేజర్, షార్పనర్, DOMS వాటర్ కలర్ పెన్స్, లేబుల్స్ / స్టిక్కర్లతో కూడిన బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ZPSS జైనథ్ ప్రధానోపాధ్యాయులు మద్ది లస్మన్న, ఉపాధ్యాయులు రావుత్ రవీందర్, పోరెడ్డి అశోక్, సమరసత వేదిక నిర్వాహకులు మెస్రం రాజేశ్వర్, సామ రమేశ్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
