గణేష్ పూర్ లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన రూపేష్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని గణేష్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవనాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ నాగరావ్ తో కలిసి యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్ రావు, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్ లు హాజయ్యారు. గ్రామ సర్పంచ్ టేకం నాగరావు, యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఉన్నప్పుడే జరుగుతాయని అన్నారు.ప్రతి గ్రామానికి గ్రామపంచాయతీ భవనం ఎంతో అవసరమని తెలిపారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామపంచాయతీకి వచ్చి సంబంధిత అధికారులకు తెలియజేసే అవకాశం కూడా ఉంటుందని తెలియజేశారు.అదేవిధంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకొని ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మడావి జంగు, గ్రామపంచాయతీ కార్యదర్శి వామన్, బేల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్ రావు, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, మాజీ జడ్పీటీసీ రాందాస్, బేల మండల సర్పంచుల సంఘం అశోక్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్,, INTUC మండల అధ్యక్షుడు కన్య రాజు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు ఆడే శంకర్, కోలాం సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్, సర్పంచులు జనార్ధన్, దౌలత్ రావు, ఉప సర్పంచుల మండల అధ్యక్షుడు సాగర్, మాజీ సర్పంచ్ జంగుశావ్, విజయ్, జీవన్, నవీన్ తదితరులు ఉన్నారు.
