టీపీసీసీ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్టుమెంటు వైస్ ఛైర్మన్ దుర్గం శేఖర్
చిత్రం న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ నాయకులు సచిన్ సావంత్ లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. వేడుకల్లో టీపీసీసీ ఎస్సీ డిపార్టుమెంటు వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి వేడుకల్లో పాల్గొని… టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. సచిన్ సావంత్. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఆరెపల్లి రాజేందర్, వినోద్ సింగ్, విజయ్ తదితరులకు దుర్గం శేఖర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
