కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్యకు బీజేపీ శ్రేణుల ఘన సన్మానం
చిత్రం న్యూస్, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య ను బీజేపీ కిసాన్ మోర్చా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీష్ చంద్ర, సోషల్ మీడియా రాష్ట్ర కో-కన్వీనర్ సాయి తేజ కలిసి ఘనంగా సన్మానించారు. కిసాన్ మోర్చా అభివృద్ధికి, రైతు సమస్యల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం కిసాన్ మోర్చా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
