జనాభా గణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జాతీయ జనాభా గణన సర్వేలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్లో ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియను పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని మొబైల్, ఆన్లైన్ పోర్టల్ ద్వారా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రజలంతా సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో సెన్సెస్ నోడల్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
