చిత్రం న్యూస్’ కు స్పందన 🙏
ఉపాధి హామీ కూలీలకు పని
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఉప్పుకుంట గల్లీ, దోబి గల్లీ కాలనీవాసులకు ఎట్టకేలకు ఉపాధి హామీ కూలీ పని దొరికింది. ఉపాధి పని లేక బిక్కు బిక్కు మంటున్న ప్రజలు అని ‘చిత్రం న్యూస్‘ లో వార్త ప్రచురితమైంది. స్పందించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వాజిద్ శుక్రవారం కాలనీవాసుల దగ్గరకు వెళ్లారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పని ఉంటుందని, సోమవారం నుండి అందరూ పనికిరావాలని వాజిద్ తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చిత్రం న్యూస్ కు ఈ సందర్భంగా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

