-Advertisement-

సాత్నాల ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

సాత్నాల ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్


చిత్రం న్యూస్,సాత్నాల:  రైతుల పంటల సాగు కోసం సాత్నాల ప్రాజెక్ట్ కాలువల ద్వారా సాగునీటిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. సాత్నాల ప్రాజెక్ట్ పరిధిలోని 21 వేల ఎకరాల ఆయకట్టు పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉండటం రైతులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. మొత్తం 35 రోజుల ప్రణాళికతో మూడు విడతలుగా సాగునీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే వేసవిలో ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులో కొంత నీటిని నిల్వ ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి ఎకరాకు సాధ్యమైనంత మేర నీరు అందేలా సహకరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. రైతుల పంటలకు సాగునీరు అందించడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అస్తక్ సుభాష్, రమేష్, శ్యామ్, దారట్ల జీవన్, రోహిదాస్, దినేష్, లక్ష్మీ బాయి, ఎల్టి అశోక్ రెడ్డి, శైలందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments