బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) బాసర ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. క్యాంపస్ లోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో, డా.రెవెల్లి అజయ్ అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, వివిధ విభాగాల డీన్స్ హాజరై, డా.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు ప్రసంగిస్తూ.. డా.బీ.ఆర్. అంబేద్కర్ జాతికి చేసిన విశేష సేవలను, ఆదర్శాలను, సమాజ సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ జయంతి ఉత్సవాలలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.




