Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Adilabad జైనథ్ మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు – నివాళులర్పించిన బీజేపీ నాయకులు

జైనథ్ మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు – నివాళులర్పించిన బీజేపీ నాయకులు

0
6

జైనథ్ మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు – నివాళులర్పించిన బీజేపీ నాయకులు

చిత్రం న్యూస్, జైనథ్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను జైనథ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలjని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అంబేద్కర్ ప్రవచించిన సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పాలన సాగిస్తోందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ గ్రామ బీజేపి పార్టీ అధ్యక్షుడు లింగా రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, స్థానిక నాయకులు అన్నెల అశోక్, సూర్య రెడ్డి, శరత్, పొచ్చన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం
WhatsApp