Home Blog Page 6

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు: రిమ్స్ ఆసుపత్రిలో ‘నేస్తం ఫౌండేషన్’ అన్నదానం

0

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు: రిమ్స్ ఆసుపత్రిలో ‘నేస్తం ఫౌండేషన్’ అన్నదానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో పేదలకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేస్తం ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్, వంశీ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు, నిరుపేదలకు భోజనాలు వడ్డించి వారి ఆకలి తీర్చారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో, సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేస్తం ఫౌండేషన్ సామాజిక సేవలను అభినందించారు.

.

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన జైనథ్ బ్లూకోట్స్ సిబ్బంది 

0

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన జైనథ్ బ్లూకోట్స్ సిబ్బంది 

* ప్రాణాలు కాపాడిన జైనథ్ బ్లూకోట్స్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సాత్నాల మండల కేంద్రంలోని బ్రిడ్జి సమీపంలో మంగళవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో  ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్-100 సిబ్బందికి సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే జైనథ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూకోట్స్ సిబ్బంది కానిస్టేబుల్ చౌహన్ సందీప్, హోంగార్డు మాధవ్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని గుర్తించి సత్వరమే స్పందించారు.

బజార్ హత్నూర్ మండలం గులాబ్ తండాకు చెందిన రాథోడ్ వికాస్ అనారోగ్య సమస్యల కారణంగా తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతనికి భరోసా కల్పిస్తూ సురక్షితంగా రక్షించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే క్షణాల్లో స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన జైనథ్ బ్లూకోట్స్ సిబ్బంది కానిస్టేబుల్ చౌహన్ సందీప్, హోంగార్డు మాధవ్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100ను సంప్రదించాలని జిల్లా పోలీసులు సూచించారు.

ఆదిలాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా హుస్సేన్  బాధ్యతల స్వీకరణ

0

 ఆదిలాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా హుస్సేన్  బాధ్యతల స్వీకరణ

చిత్రం న్యూస్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హుస్సేన్ ను  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా సేవలందించి పదోన్నతిపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా వచ్చిన హుస్సేన్ కు పూల మొక్క అందజేసి మర్యాద పూర్యకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయన్ను కలిసిన వారిలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారం, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్,చంద్రకాంత్,అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే,రూపేష్,తిలోత్తమ ఉన్నారు.

టాక్లీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల క్యాప్చర్, సర్వే పూర్తి

0

టాక్లీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల క్యాప్చర్, సర్వే పూర్తి

చిత్రం న్యూస్,బేల: ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మంగళవారం టాక్లీ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ రాహుల్, గ్రామ సర్పంచ్ రాము గేడం ఇందిరమ్మ ఇళ్ల క్యాప్చర్ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాకేష్, వికాష్, ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు – మాజీ ఎంపీ సోయం బాపురావు

0

ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు – మాజీ ఎంపీ సోయం బాపురావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజా ప్రభుత్వం వేయి రోజుల పాలన అద్భుతమని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో BRS ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వేయి రోజుల్లోనే 72 వేలకు పైగా నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు అందజేసిందన్నారు. పేదల ఇంట్లో వెలుగులు నింపుతూ 200 యూనిట్ల ఉచిత కరెంటు, పేదలు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఉచిత సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.1200 ఉన్న గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీతో రూ.500కే అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల 50 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి చరిత్ర సృష్టించిందని, ఏక కాలంలో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమే అని అన్నారు.

BRS, BJP పార్టీలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇంకో రెండు సార్లు 10 ఏళ్ల పాటు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో బోథ్ ఇంచార్జ్ ఆడే గజేందర్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ పరమేశ్వర్, మునిగెల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం, అన్నదానం

0

పవిత్ర శ్రావణ మాసంలో ఆకుర్ల గ్రామంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం, అన్నదానం

చిత్రం న్యూస్, జైనథ్: పవిత్రమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆకుర్ల గ్రామ సర్పంచ్ వైద్య సాయి ఆంజనేయ స్వామికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి, అనంతరం భక్తులకు గ్రామంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెల్లూరి సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, పిప్పల్గావ్ సర్పంచ్ సంజీవ్, పిప్పల్గావ్ ఉప సర్పంచ్ ఊరాడే లక్ష్మణ్, బాలాపూర్ శంకర్, కరంజి ఉప సర్పంచ్ సూర్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి

0

ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి

* జిల్లా ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్

చిత్రం న్యూస్, బేల: సాంప్రదాయ పంటలకు భిన్నంగా జిల్లా రైతాంగం వాణిజ్య ఉద్యాన పంటలవైపు మొగ్గు చూపాలని, ఉద్యాన పంటల సాగు కొరకు ప్రభుత్వం అందజేస్తున్న అనేక రకాల రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం బేల మండలంలోని మంగ్రూడ్ గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ.. సమగ్ర ఉద్యాన మిషన్లో భాగంగా ప్రభుత్వము వివిధ రకాల పండ్ల తోటలకు రాయితీ కల్పిస్తుందని, బిందు సేద్య పరికరాలు రాయితీలో కల్పిస్తుందని తెలిపారు. మామిడి, జామ, నిమ్మ, సీతాఫలం, అంజీర్, పసుపు మొదలైన ఉద్యాన పంటల తోటల సాగు చేసే రైతులకు రాయితీ లభిస్తుందని తెలిపారు.

ఎల్ నినో ప్రభావంతో ఇబ్బంది పడే రైతులు ప్లాస్టిక్ మల్చింగ్, కూరగాయలు, పూల తోటల సాగు ద్వారా మెరుగైన ఆదాయం పొందడానికి అవకాశం ఉందని తెలిపారు. మంగ్రూడ్ గ్రామంలో సాగు చేస్తున్న పామాయిల్ తోటను పరిశీలించి పామాయిల్ సాగుపై అవసరమైన సలహాలు సూచనలు సిబ్బందికి రైతులకు అందించారు. నలభై సంవత్సరాల పాటు ఆదాయం ఇచ్చే పామాయిల్ పంట సాగు చేయటానికి రైతులు ముందుకు రావాలని కోరారు. తర్వాత చాంద్ పల్లి గ్రామంలో జాతీయ వెదురు పథకంలో భాగంగా వెదురు సాగు కొరకు ఎంపిక చేసిన రైతులకు నాణ్యమైన హైబ్రిడ్ వెదురు మొక్కలను రైతులకు సరఫరా చేశారు. అదే గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పసుపు, మునగ, వంగ, టమాటో, మిర్చి పంటల ను పరిశీలించి రైతులకు సమగ్ర యాజమాన్యం పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి అలేఖ్య, సిబ్బంది సతీష్, జగదీష్, ఉద్యాన శాస్త్రవేత్త మల్లేష్, మండల వ్యవసాయ అధికారి సాయి తేజ, సీపీఎఫ్ స్వచ్ఛంద సంస్థ అధికారి సత్యనారాయణ, సిబ్బంది మంగేష్, పూజ, రైతులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యాలయాలు, నాయకులపై దాడులను  ఖండించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

బీజేపీ కార్యాలయాలు, నాయకులపై దాడులను  ఖండించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, హైదరాబాద్: నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడి హేయమైన చర్య అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. నల్గొండలో బీజేపీ జిల్లా కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం, జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షిత్ రెడ్డి ఇంట్లోకి చొరబడి టీవీ, ఫ్రిజ్ తదితర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ఆయన తల్లిపై దాడి చేసి గాయపరిచిన ఘటనను ఖండించారు. “ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు సహజం, కానీ కార్యాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, మహనీయుల చిత్రాలను అవమానించడం సమర్థనీయం కాదు” అని అన్నారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతల అరెస్టులను కూడా ఆయన ఖండించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని అన్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయానికి వెళ్లి బీజేపీ నేతలతో కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కార్యాలయంపై 50 మంది దాడి, సంత్ రవిదాస్ చిత్రాన్ని అవమానించిన ఘటనలపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులకు న్యాయం, బీజేపీ నేతలకు భద్రత కల్పించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన దళిత, గిరిజన సంఘాల నాయకులు

0

సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన దళిత, గిరిజన సంఘాల నాయకులు

చిత్రం న్యూస్,అదిలాబాద్: సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్ మెంట్ జిల్లా కార్యదర్శి బిక్కి గంగన్న, ఆదిమ కోలాం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనేరావు మరియు దళిత సంఘాల నాయకులు పాల్గొని సిఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత మరియు తెలంగాణ ఉద్యమకారుల పక్షపాతి అని రుజువైందని నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణ, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, అంబేద్కర్ అభయ హస్తం కింద స్వయం ఉపాధి కోసం 12 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించడం హర్షణీయమని వారు తెలిపారు.

ఉట్నూర్ అటవీ వృక్ష జాతులపై గ్రంథం ఆవిష్కరణ

0

ఉట్నూర్ అటవీ వృక్ష జాతులపై గ్రంథం ఆవిష్కరణ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉట్నూర్ అటవీ ప్రాంతంలో ఉన్న వృక్ష జాతులపై బేల కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వృక్ష శాస్త్రవేత్త డా. వేముగంటి వరప్రసాద్ రావు రచించిన _”Floristic Composition and Species Diversity of Utnoor Forest of Adilabad District, Telangana”_ అనే గ్రంథాన్ని రాష్ట్ర ఆదివాసీ నాయకులు పూసం సచిన్ కు మర్యాదపూర్వకంగా బహూకరించారు. ఈ సందర్భంగా పూసం సచిన్ మాట్లాడుతూ.. డా. వరప్రసాద్ రావు చేస్తున్న వృక్ష శాస్త్ర పరిశోధనలు అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని గ్రంథాలు రాసి ఆదివాసీలతో పాటు సమాజానికి పర్యావరణ పరిరక్షణలో తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో అనికేత్, RTI మండల ఉపాధ్యక్షుడు ఉరాడే సాహిల్ తదితరులు పాల్గొన్నారు.