Home Blog Page 52

మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి వంగలపూడి అనిత 

0

మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి వంగలపూడి అనిత 

చిత్రం న్యూస్, ఏలూరు: ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు రేంజ్ ఐజీ జి వి జి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. తొలుత ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన అభయ షీ బాక్స్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం మంత్రి అనితను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో గ్రూప్ ఫొటోలు దిగారు. మహిళా కానిస్టేబుల్ ను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను కూడా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,AMC చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, టీడీపీ టౌన్ సెక్రటరీ రెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు ఆర్నెపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ 

0

జంగారెడ్డిగూడెం లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ 

చిత్రం న్యూస్, జంగారెడ్డిగూడెం: మండే ఎండలు, వడగాలుల నేపథ్యంలో  మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి పరిణామని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో గురువారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ప్రయాణికులు, పాదచారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ మండల కూటమి నాయకులతోపాటు అధికారులు పాల్గొన్నారు.

రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకం: సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

0

రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకం: సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీ వీరుడు రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తిదాయకమని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి రాంజీ గోండ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, జల్-జంగిల్-జమీన్ కోసం ప్రాణాలర్పించిన గొప్ప యోధుడు రాంజీ గోండ్ అని కొనియాడారు. ఆయన సాగించిన పోరాటం, చూపిన ధైర్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన ఇటువంటి వీరుల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్, బండారి దేవన్న, పలువురు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.

ప్రజల పక్షాన నిలిచే పార్టీ సీపీఐ: జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి 

0

ప్రజల పక్షాన నిలిచే పార్టీ సీపీఐ: జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి 

చిత్రం న్యూస్, ఆదిలారెడ్డిబాద్ టౌన్: సమాజ స్థాపనే ధ్యేయంగా, అణగారిన వర్గాల న్యాయం కోసం నిరంతరం పోరాడే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని హమీద్ పుర, మార్కెట్ ప్రాంతాల్లో ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు.

ఇంటింటికీ తిరుగుతూ పార్టీ లక్ష్యాలను వివరిస్తూనే, ప్రజల నుండి స్వచ్ఛందంగా విరాళాలను సేకరించారు. స్వాతంత్ర్య పోరాటంలో సీపీఐ చేసిన త్యాగాలను, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మైక్ ద్వారా ప్రజలకు వివరించారు. పార్టీ చేపడుతున్న ప్రజా పోరాటాలు, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా నిలుస్తున్న తీరును వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగడమే తమ పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రజలు తమకు అండగా నిలిచి, పోరాటాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, గిరిజన సంఘం నాయకులు కడప సురేష్, రైతు సంఘం నాయకులు సోమపురి జగన్నాథ్, లక్ష్మణ్, ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం:అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

0

* గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం:అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

* ఈ నెల 27న తహసీల్దార్ కార్యాలయాల్లో వినతుల అందజేత

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జాతీయస్థాయిలో చేపట్టిన గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అఖిల భారత గో సమ్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి రాజ్యాంగానుసారంగా అహింసా మార్గంలో గో సంరక్షణ కొరకు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రధానంగా దేశంలో సంపూర్ణ గోహత్య నివారణ చేయడం, గోవును దేశమాతగా ఆరాధ్యనీయ దేశదేవతగా గుర్తించాలన్నారు. అలాగే గో పరిరక్షణ చట్టం, బోర్డును తీసుకురావాలని అన్నారు. వీటిని సాధించేందుకు ఈ నెల 27న జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గో సమ్మాన్ అభియాన్ ప్రతినిధులు అనిల్ గోపాల్, కుషాల్ దాస్, భూపాల్ సింగ్, వీహెచ్ పీ గో రక్ష విభాగం తెలంగాణ ప్రాంత కృషి ప్రముఖ్ ధాత్రిక రమేష్, ఇందూరు గో సేవా సమితి అధ్యక్షుడు వీరమల్లి రమేష్, లక్ష్మీ కాంతం, యాదగిరి, రజినీకాంత్, వెంకటరమణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులను సన్మానించిన ఆలయ ఈవో  విజయరామారావు 

0

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి, వాటి చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా,పత్రికలు, ఛానళ్లు,సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకం, అభినందనీయమని ఆలయ ఈవో విజయరామారావు అన్నారు. ఆలయాల విశిష్టతను చాటిచెప్పడం ద్వారా భక్తులను చైతన్యపరచడంలో మీడియా సేవలందిస్తోందన్నారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆశీర్వాద మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వీరి వెంట ఆలయ ఏఈఓ గంగా శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ సాయిలు, పి ఆర్ ఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఇటీవల అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి తెలిపారు. గురువారం డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో రైతుల పంట పొలాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎవరు కూడా అధైర్యపడొద్దని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక వ్యవసాయ,విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…ఈ నెల 4 వ తేదీన అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి నియోజకవర్గంలోని రైతుల పంట పొలాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అదేరోజు తక్షణమే వ్యవసాయ,విద్యుత్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. కానీ ప్రతిపక్ష బీజేపీ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తూ..చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమది రైతు ప్రభుత్వమని రైతులు కష్టాల్లో ఉంటే తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పారు. ఘటన జరిగిన కొన్నిరోజులు కూడా కాకముందే బీజేపీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు బాధల్లో ఉంటే వారికి అండగా నిలవాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి వేలాదిమంది రైతులను పొట్టనబెట్టుకున్న బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరెక్కడా లేవన్నారు.

పంట నష్టం విషయమై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించినట్లు తెలిపారు.తప్పకుండా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో దాదాపు 2 వేల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. డిచ్ పల్లి మండలం సుద్దపల్లి, ధర్పల్లి లోని రామడుగు,దమ్మన్నపేట,తండాలు,సిరికొండ మండలాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులు అధైర్యపడకుండా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్,ప్రధాన కార్యదర్శి పోసాని శ్రీనివాస్,పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,పార్టీ నాయకులు మునిపల్లి పెద్ద సాయి రెడ్డి,మునిపల్లి సాయి రెడ్డి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వాసు బాబు, ఉమ్మాజి నరేష్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్,శ్యాంసన్, అంబర్ సింగ్ ఆయా గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి 

0

చిత్రం న్యూస్, బేల: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నంతంగా ఎదగాలని గూడ సర్పంచ్ గోడే అవినాష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గూడ గ్రామంలోని MPPS పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పుస్తకాలు, పెన్నులను, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరమాల పుస్తకాలను గురువారం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గోడే అవినాష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువు కోవాలని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ప్రోత్సాహం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీరామే నిఖిల్, వార్డు సభ్యులు ఠాక్రే సుమిత్, గవాండే సందీప్, పాఠశాల ఉపాధ్యాయురాలు అనూష, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు గవాండే మీనా, వీ.అనిల్, దశరథ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

 

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి వేగంగా అడుగులు: త్వరలోనే భూమి పూజ

0

చిత్రం న్యూస్, న్యూదిల్లీ: ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ కనెక్టివిటీ కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరియు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, సివిల్ ఏవియేషన్ అధికారులు, డిఫెన్స్ అధికారులు, వికాస్ రాజ్ గారు, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పాల్గొని ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై చర్చించారు.

ఉమ్మడి నిర్వహణతో అభివృద్ధి

ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర విమానయాన అవసరాలతో పాటు భారత వైమానిక దళం (IAF) శిక్షణ అవసరాల కోసం కూడా వినియోగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రక్షణ శాఖ విమానాశ్రయ అభివృద్ధిని చేపట్టగా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సివిల్ టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది.

కీలక అంశాలు:

ఫీల్డ్ సర్వే: ఏప్రిల్ 17న పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో ఓఎల్ఎస్ (OLS) ఫీల్డ్ సర్వే మరియు పెగ్ మార్కింగ్ నిర్వహించనున్నారు.

భూసేకరణ: ఈ ప్రాజెక్టు కోసం అదనంగా 450 ఎకరాల భూమిని సేకరించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మాస్టర్ ప్లాన్ ఆమోదం: ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికే ఆమోదం పొందిందని ఎంపీ గోడాం నగేష్ వెల్లడించారు.

శంకుస్థాపన: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం.

పారిశ్రామికాభివృద్ధికి బాటలు

ఈ విమానాశ్రయం పూర్తయితే జిల్లాలో పారిశ్రామిక వేగం పుంజుకోవడమే కాకుండా, పర్యాటక రంగం అభివృద్ధి చెంది స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ ఒక కీలక అనుసంధానకర్తగా మారనుంది.

ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో వాకథాన్ 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్‌ను అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ వాకథాన్‌లో అధికారులు, అంగన్వాడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రసంగించి, ఫుడ్ లైసెన్స్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రత అధికారి ప్రత్యూష, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్, వైద్యులు దీపక్ పుష్కర్, నరేందర్ పాల్గొన్నారు.