ఆదిలాబాద్‌లో ఉత్సాహంగా 5K మారథాన్: విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాల అందజేత
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి 5K మారథాన్ రన్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించారు. ఈ రన్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమై కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, అంబేడ్కర్ చౌక్ మీదుగా తిరిగి స్టేడియం వద్ద ముగిసింది. ఉద్యోగులు, యువత, వివిధ వర్గాల ప్రజలు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 5K రన్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, డీఆర్డీఓ రాథోడ్ రవీందర్, డీపీఓ రమేష్, సంక్షేమ అధికారి మిల్కా, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, క్రీడా కోచ్‌లు, అధికారులు, యువత, ఉద్యోగులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

