Home Blog Page 51

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్

0

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామంలో ఉపాధి హామీ పనులను  ఉప సర్పంచ్ టాక్రే సాగర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి కూలీలు ఎండలో పనిచేస్తున్న వారికి ఓ ఆర్ ఎస్ పాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ టాక్రే సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన భువన్ యాప్ కూలీలకు చాలా ఇబ్బంది పెడుతుందన్నారు. ఉదయం ఫొటో క్యాప్చర్ చేస్తేనే పనులకు వెళ్ళవచ్చాన్నారు. క్యాప్చర్ కాని వారు పనిచేయరాదనీ, ఆ కూలీల పరిస్థితి ఎలా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూలీలు ఫొటో క్యాప్చర్ కోసం వేచివుండాల్సి వస్తుందన్నారు. ఇంత సమయం తీసుకుంటే ఇంటి నుండి భోజనం చేయక వచ్చిన కూలీల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. పాతపద్దతిలో మాస్టర్ రోల్ పేపర్ పైన సంతకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సర్పంచ్ మెస్రం దౌలత్, సెక్రటరీ అర్షద్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవరావు తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ మధుప్రీతి 

0

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ మధుప్రీతి 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె )గ్రామ సర్పంచ్ మధుప్రీతి, సురేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి,అధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు, గ్రామస్తులకు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామస్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చలివేంద్రం ప్రారంభించామని సర్పంచ్ మధుప్రీతి తెలిపారు. ఈ కార్యక్రమంలో. ఉప సర్పంచ్ కో ప్లే నాగనాథ్ , బీజేపీ కార్యకర్త సిందే వినయ్ రావు పటేల్, కధం సాయినాథ్ పటేల్, కర్రోల్ల మల్లయ్య, పెద్ద కప్ సక్కరి, అగ్గోళ్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో 99 రోజుల ఆరోగ్య మిషన్ ఆరోగ్య వారోత్సవంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఎయిడ్స్ అవేర్నెస్ వాకతాన్( రెడ్ వాక్ ) ను అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. బి రాజశ్రీ తో కలిసి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి గాంధీ చౌక్ మీదుగా తిరిగి జనరల్ హాస్పిటల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పైన అవగాహన ఉన్నప్పుడే దాని బారిన పడకుండా ఉండగలరని, ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి రాజశ్రీ జిజి హెచ్ లో గల సంపూర్ణ సురక్ష కేంద్రం వద్ద రోగ నిర్ధారణ పరీక్షల క్లినిక్ ను, ట్రాన్స్ జెండర్స్ కోసం రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం ను మైత్రి క్లినిక్ వద్ద ప్రారంభిం చారు..ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతి రావు,నోడల్ ఆఫీసర్ ఆర్ట్ సెంటర్,జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా. దేవి నాగేశ్వరి, డిప్యూటీ డీఎం హెచ్ ఓ డా. అశ్విని, ఎన్.వి.హెచ్.సి.పి  డా. వెంకటేష్, డీఈ డా. శ్రావ్య, టీబీ మెడికల్ ఆఫీసర్ డా. అవంతి , ఆర్ట్ సెంటర్ మెడికల్ ఆఫీసర్స్, డీ హెచ్ ఈ ఘనపురం వెంకటేశ్వర్లు, డీపీఎం సుధాకర్ , స్నేహ సొసైటీ సిద్దయ్య , పీఎమ్ఓ రూప , మోయిజ్ ,నవీన్, రవి గౌడ్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా వైద్య శాఖ కార్యాలయం సిబ్బంది , ఆఫీసర్ క్లబ్ సభ్యులు,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది, టీబీ కంట్రోల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.

అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి

0

రూ.5.60 లక్షల ఎల్.ఓ.సి లెటర్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన ఎర్గు సత్యవ్వ అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5 లక్షలకు సంబంధించి ఎల్.ఓ.సి లెటర్ ను అదేవిధంగా నిజమాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన బొద్దుల శ్రీనివాస్ చికిత్స నిమిత్తం రూ .60 వేల విలువగల ఎల్.ఓసి లెటర్ ను బాధిత కుటుంబ సభ్యులకు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు వారి గ్రామస్తులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు 

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సెంట్రల్ జైలులో దాదాపు 640 మంది ఖైదీలకు టీబీ పరీక్షలు నిర్వహించడం ,అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు, స్కిన్ ,డెంటల్ , గైనిక్,  గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డా. బి రాజశ్రీ, జిల్లా టీబీ నియంత్రణ అధికారి అండ్ పోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ డా. దేవి నాగేశ్వరి, ఎన్ వి హెచ్ సి పి నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా టటీబీ నియంత్రణ సిబ్బంది, మొబైల్ ఐసీటీసీ సిబ్బంది జిల్లా వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మన ఊరు – మన భద్రత – మన బాధ్యత : పోలీస్ కమిషనర్ వెల్లడి

0

గ్రామ సర్పంచులకు అవగాహన కార్యక్రమం 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని కామాక్షి కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యవసాయదారులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలన్నారు.

ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి యొక్క తల్లిదండ్రులు వచ్చి మాట్లాడారు. అనంతరం అరైవ్ అలైవ్ సంబందించిన ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి , ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లహరి రఘు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాటిపల్లి గంగారెడ్డి , ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ టౌన్ సీఐ సత్యనారాయణ , ఆర్మూర్ రూరల్ సీఐ జి. జాన్ రెడ్డి, ఐ-రాడ్ మేనేజర్ వర్ష , ఆర్మూర్ డివిజన్ ఎస్ఐ లు రజనీకాంత్, సంజీవ్ , అనిల్ , రాము , శ్యామ్ రాజ్ , శైలేందర్ , కిరణ్ పాల్ , రాజేశ్వర్, ఎన్ ఎస్ సి కౌన్సిల్ మెంబర్స్ సుందర్ , క్రాంతి గంగారెడ్డి , నిజంసాగర్ మాజీ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వై.సాయ రెడ్డి , సాగర్ రెడ్డి , గ్రామ సర్పంచులు ,వార్డ్ కౌన్సిలర్లు, ప్రజలు, పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఆర్మూర్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

0

ఆర్మూర్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలోని భక్త ఆంజనేయ మందిరంలో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని , ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని , సీసీ కెమెరాల ద్వారా పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆర్మూర్ ఎస్ హెచ్ వో సత్యనారాయణ, కౌన్సిలర్ విజయ్ అగర్వాల్ (దియా) , జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షులు రాజేందర్ గౌడ్ , సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ ప్రవీణ్ చారి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

సమాజ సేవలో ముందుండాలి

0

*ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.  ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పీఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్ ఎదురుగా అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసుల సౌకర్యార్థం అంబలి పంపిణీ చేస్తున్నామన్నారు. ఎండ దెబ్బ, వేడి నుంచి అంబలి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేంద్రాన్ని గత 12 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారని, నాలుగేళ్లుగా తమ ట్రస్ట్ సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా గ్రామీణులు అధిక సంఖ్యలో వస్తారని, వారికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అంబలి పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబలి కేంద్ర ప్రతినిధి పార్శి రమేష్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీ నారాయణ, బట్టు రాఘవేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, మల్కాయి మహేందర్, మఠం పవన్, మల్లేష్ యాదవ్, కల్పె అర్చన చిరంజీవి, ఎర్రం ప్రభాకర్, గజవాడ ఆగమయ్య, మంచొల్ల రామస్వామి, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

సమష్టి కృషితో ‘అరైవ్ – అలైవ్’ను విజయవంతం చేయండి 

0

*స్థానిక ప్రజాప్రతినిధులతో సహా అందరినీ భాగస్వాములు చేయాలి

*అధికారులతో సమీక్షలో కలెక్టర్, సీపీ 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. ఈ కార్యక్రమం అమలు తీరు గురించి రాష్ట్ర సచివాలయం నుండి గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , డీజీపీ శివధర్ రెడ్డిలు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్.పీలు, సీ.పీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. దేశ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనూ నానాటికీ రోడ్డు ప్రమాదాలు పెచ్చుమీరుతున్న నేపధ్యంలో వీటి నియంత్రణ కోసం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు వీలుగా, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు.

ఈ సందర్భంగా వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచ్ లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని అన్నారు. 13వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. అదేవిధంగా రిటైర్డ్ టీచర్లు, డాక్టర్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఈ కమిటీలో కనీసం ముగ్గురు మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని అన్నారు. ఎక్కడైనా రోడ్ల పక్కన పాడుబడిన బావులు ఉంటే పూడ్చివేయించాలని, ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.

14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. 15వ తేదీన చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డేగా జరపాలని, 4 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్ళే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మైనర్ లు వాహనాలు నడపకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. స్కూల్ బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉండేలా చూడాలన్నారు. 16 తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలన్నారు. అలాగే, వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కాగా, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలలో తక్షణమే స్పందించి ప్రథమ చికిత్స ఎలా చేయాలి, క్షతగాత్రులను సత్వరమే సమీప ఆసుపత్రికి తరలించడం, రహ్ వీర్ కింద ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకం గురించి 17వ తేదీన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు.

ప్రమాదాల నివారణకు కృషి చేసిన వారిని గుర్తించి సన్మానించాలని సూచించారు. 18వ తేదీన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిని గుర్తిస్తూ, వారికి కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. ఈ నెల 16న మండల స్థాయిలో నిర్వహించే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సభల్లోనూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రధాన కూడళ్ళలో మానవహారాలు జరపాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

డీసీసీ కార్యాలయంలో ఘనంగా రాంజీ గోండ్ వర్ధంతి

0

డీసీసీ కార్యాలయంలో ఘనంగా రాంజీ గోండ్ వర్ధంతి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో : ఆదివాసీ వీరుడు  మర్సుకోల రాంజీ గోండ్ వర్ధంతి సందర్భంగ జిల్లా కాంగ్రెస్ కమిటి కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో రాంజీ గోండ్ చేసిన త్యాగాలు అపారమని పేర్కొన్నారు. దేశ స్వేచ్ఛ కోసం ఆయన ప్రాణత్యాగం చేసిన మహనీయుడని, ఆయన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన రాంజీ గోండ్ చరిత్రను యువత తెలుసుకోవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి,మందగూడ సర్పంచ్ గోపాల్,రప్ అహ్మద్,కనక నాగోరావ్, హరీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాంజీ గోండ్ సేవలను స్మరించుకున్నారు.