ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రక్షించిన పోలీసులు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని సోమవారం పోలీసులు రక్షించారు. బాసర సీఐ కిరణ్ కుమార్, తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్ జిల్లా మండలం రెంజల్ మండలం ధూపల్లె గ్రామానికి చెందిన బొట్టా సందీప్ (25) ఆర్థిక ఇబ్బంది, ఇంట్లో గొడవల కారణంగా మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గోదావరి నది తీరం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు . హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించి బాధితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుటుంబీకులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాణాల్ని కాపాడిన బాసర ఏఎస్ఐ గంగాధర్, నరేందర్ చారి, సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు




