Home Blog Page 53

ఆత్మహత్యాయత్నం నుంచి మహిళను రక్షించిన పోలీస్ నారీశక్తి

0

* పోలీస్ నారీ శక్తి సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల

చిత్రం న్యూస్, బాసర : నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో జరిగిన కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఇంటి నుండి వెళ్లిపోయింది. అనంతరం బాసర గోదావరి నదిలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. డయల్ 100 సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీస్, నారీ శక్తి బృందం సంఘటనా స్థలానికి చేరుకొని అప్రమత్తంగా వ్యవహరించి ఆ మహిళను ఆత్మహత్యకు పాల్పడకుండా ప్రాణాలను కాపాడారు. అనంతరం మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీస్ అక్కలు దీపిక, సుమేర లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ నారీ శక్తి,మహిళల భద్రత కోసం మాత్రమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ తెలిపారు.

 

తండ్రి జన్మదిన వేళ పాఠశాలకు కంప్యూటర్ వితరణ చేసిన కుమారుడు 

0

చిత్రం న్యూస్, వరంగల్ : తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారు బండారి మనోజ్. తన తండ్రి బండారి కృష్ణమూర్తి జన్మదిన సందర్భంగా శివనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మనోజ్-శ్వేత దంపతులు ఒక కంప్యూటర్‌ను బహూకరించారు.

35వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనోజ్ దంపతులు కంప్యూటర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూస నరేంద్రస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా మేరుగు అశోక్ మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలను ఇలా అర్థవంతంగా, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా జరుపుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీహాన్ వర్ధన్, కలువల రాహుల్, గోదాసి శివ, అంకతి అఖిల్ లతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తిరుపతి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, దేవరాజ్, అంజయ్య, నరేందర్, రంగాచారి, సంపత్, కవిత, సుహాసిని, స్వప్న, భవాని, కృష్ణమూర్తి, కిరణ్మయి, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యుత్ వెలుగుల్లో రంజని తండా 

0

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా కుబీర్ మండలం రంజని తండాలో గత 20 ఏళ్లుగా నెలకొన్న విద్యుత్ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. తండా ప్రజల చిరకాల వాంఛ అయిన విద్యుత్ స్తంభాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడ్డారు. యువ నాయకుడు జాదవ్ వికాస్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకుని, అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి నిరంతరం ఫాలోఅప్ చేశారు. వికాస్ నాయక్ కృషి ఫలితంగా 2026లో ఈ ప్రాజెక్టుకు అధికారికంగా అనుమతులు (Sanction) లభించాయి. ప్రస్తుతం విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో పీఎం జుగ (PM-JUGA) కింద కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.ఈ సందర్భంగా తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “మా కష్టాలను గుర్తించి, మా కోరికను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది” అని స్థానికులు పేర్కొన్నారు.

అవాల్పూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ అనిల్

0

చిత్రం న్యూస్, బేల: బేల మండలం అవాల్పూర్ గ్రామ అంగన్‌వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అనిల్ బుధవారం సందర్శించారు. అక్కడి పరిస్థితులను, కార్యక్రమాలను పరిశీలించారు. కేంద్రంలోని పిల్లల సంఖ్య, వారికి అందిస్తున్న పౌష్టికాహార పంపిణీ విధానం, కేంద్రం యొక్క నిర్వహణ గురించి ఆరా తీశారు. అంగన్‌వాడీ టీచర్, సహాయకురాలితో మాట్లాడి, కేంద్రంలో అమలు జరుగుతున్న ‘ఆరోగ్య లక్ష్మి’ వంటి పథకాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లల తల్లిదండ్రులను కూడా అడిగి కేంద్రం నిర్వహణపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేంద్రం పరిశుభ్రత, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.

వేంకటేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్తం మరుగుదొడ్ల నిర్మాణం 

0

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం కూర గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. 4.50 లక్షల నిధులతో నిర్మాణ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకుడు మార్చెట్టి గోవర్ధన్, బీజేపి కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సామ వెంకట్ రెడ్డి హాజరై, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన కొంగల భూమన్న, సామ సంజీవ్ రెడ్డి, బీమ్ రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుకు నష్టపరిహారం అందించాలి: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోర్వ శ్యాం డిమాండ్

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సూరెళ్లి గ్రామంలో ఆనంద్ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైందని, రైతును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాసర మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ డిమాండ్ చేశారు. ముథోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కొమ్రేవార్ ఆదేశాల మేరకు రైతు వద్దకు చేరుకుని తమ పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతుకు భరోసా కల్పించారు. కష్టపడి చేతికి వచ్చిన పంట పూర్తిగా దగ్ధం కావడంతో స్థానిక ఎమ్మార్వో పవన్ చంద్రకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రైతు పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు పార్టీ నేతలు కోరారు. వెంట శ్రీనివాస్ ,మంతెన పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ఇద్దరికి జైలు శిక్ష, ఏడుగురికి జరిమానా

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపిన తొమ్మిది మందిలో ఇద్దరికీ జైలు శిక్ష, ఏడుగురికి  కోర్టు జరిమానా విధించింది ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు బుధవారం పి.ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహింఛారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఏడుగురికి జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు

ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం 

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్  ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ నిజామాబాదు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ( మహిళలకు క్యాన్సర్ సంబంధించిన) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది 24/7 విధినిర్వహణలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలని అందుకోసం డా. సూచనలు,  సలహాలు పాటించాలన్నారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం గురించి వివరించారు. క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడం ద్వారా చికిత్స సులభం అవుతుందని ప్రతి ఒక్కరూ నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలవకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి ఫ్రూట్స్ వివిధ రకాల ఫ్రూట్స్ నుండి అన్ని రకాల జాగ్రతలు తీసుకొని వాటిని వాడాలని తెలిపారు. మన శరీరమునకు ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలని అంతేకానీ జీర్ణం కానీ ఆహారము తీసుకొని బాధపడకూడదు అని అన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని , ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సంబంధిత డాక్టర్లకు చూయించుకోవాలని , డాక్టర్ల సూచనలు సలహాలు తప్పనిసరి పాటించాలని కోరారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపు నిర్వహించడం ఎంతో శోభదాయకమని భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఇంకా అనేక నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ వైద్య విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. 30 సంవత్సరాల పైబడిన మహిళలు మూడు సంవత్సరాలకు ఒక సారి పంప్స్మీర్ పరీక్ష, 40 సంవత్సరాలు పైబడిన మహిళలు రెండు సంవత్సరాలకు ఒక సారి మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు  ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, అదనపు డీసీపీ (సి.ఏ.ఆర్) కె.రాంచందర్ రావ్ , పోలీస్ యూనిట్ డా. సరళ, డా.అమర్ దీపిక (మెడికల్ డైరెక్టర్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్), డా.పి.అరవింద్ (రేడియేషన్ ఒంకలోజిస్ట్), డా. శైలజ (గైనకాలజిస్ట్), డా.రితిక ( డీఎమ్ఓ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్), డా. రవీంద్రనాథ్ సూరి (సీనియర్ డా. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ) , మధు (స్క్రీనింగ్ క్యాంపు కోఆర్డినేటర్), నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ పోలీస్ స్టేషన్ మహిళా సిబ్బంది, పోలీస్, రేంజ్ కార్యాలయం మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ నూతన కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభించారు. కార్యాలయంలోని ఆయా విభాగాలను సందర్శించి వసతులను పరిశీలించారు. అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పూర్తి పారదర్శకంగా, సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇంచార్జి రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రమణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.

పోచంపాడ్‌లో కత్తిపోట్ల ఘటన: యువకుడి దారుణ హత్య

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ జిల్లా బ్యూరో: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో పాత వివాదాల నేపథ్యంలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో రిషిక్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.పోచంపాడ్ గ్రామంలో వేణు కుటుంబానికి, నర్సింలు కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య పరిష్కారానికి రిషిక్ నర్సింలు ఇంటికి వెళ్లగా, అక్కడ ఘర్షణ పెరిగి కత్తిపోట్లకు దారితీసింది.

నర్సింలు కుమారులైన ఉదయ్ చందు, కిషోర్, అరవింద్ కలిసి రిషిక్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో రిషిక్ కడుపులో తీవ్ర గాయాలు కావడంతో అతన్ని నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో రిషిక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యువకుడి మృతితో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుహాసిని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి, భద్రతను పెంచారు. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.