Home Blog Page 50

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి: గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిప్పులు

0

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి: గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిప్పులు

చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని బీజేఎల్పీ ఉప నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని ఆయన కొనియాడారు.

గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో ఒక్క కొత్త ఎయిర్ పోర్ట్ కూడా తీసుకురాలేని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమని ఆయన విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి కనీసం భూసేకరణ కూడా చేయకుండా ఆ పార్టీ చేతులెత్తేసిందని, ఇప్పుడు మాత్రం తామేదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని పాయల్ శంకర్ తెలిపారు. దీనికోసం వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారని, దీనివల్ల స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్టుల పనులను కేంద్రం మాస్టర్ ప్లాన్‌తో అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన వివరించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కేంద్ర పథకాలతోనే రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చెత్త సేకరణ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి 

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  నిజామాబాద్ రూరల్ నియోజవర్గ పరిధి డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామ పంచాయతీ లో చెత్త సేకరణ నిమిత్తం రూ.10 లక్షల తో నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రవి కిరణ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వాసు బాబు లతో కలిసి వాహనాన్ని ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగుంటేనే ప్రజలంతా ఆరోగ్యకరంగా ఉంటారని ఆ దిశగా గ్రామ పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ షేక్ ఖాదర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణస్థాయిలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం: రూరల్ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

0

మాతా, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజమాబాద్ రూరల్, అర్బన్ సీడీపీవో లు జ్యోతి, సౌందర్య ల నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వంచే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 200 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా, శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం 26 కొత్త అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి,ధర్పల్లి,ఇందల్వాయి సూపర్వైజర్లు మమతా,బుజ్జి,సరిత,సునీత, డిచ్ పల్లి బ్లాక్ కో ఆర్డినేటర్ రంజిత్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ లు అందజేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ లను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్ లను సద్వినియోగపర్చుకోవాలన్నారు. అంగన్వాడీ నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు డిజిటల్ వ్యవస్థలో పొందుపరుస్తూ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అంగన్వాడీ నిర్వాహకులు పిల్లలకు, గర్భిణులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేర్చాలన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో 326 సెల్ ఫోన్లను అంగ న్వాడీ నిర్వాహకులకు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో దీర్ఘకాలిక సమస్యలను అంగన్వాడీ టీచర్ ప్రాజెక్టు అధ్యక్షురాలు చంద్రకళ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.

ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచి నీటిని అందించేందుకు వీలుగా ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిట్టచివరన ఉండే ఆవాసాలకు కూడా తాగునీరు చేరుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతగిరి, పోచారం గ్రామాలకు సైతం తాగునీటి సరఫరా కోసం ఇదేతరహా ఏర్పాట్లు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఆవాస ప్రాంతానికి రక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ లు రాకేష్, స్వప్న తదితరులు ఉన్నారు.

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

0

 ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం శాంతినగర్‌లోని ఈవీఎం గోదామును సందర్శించారు. అక్కడ భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ (VVPAT) యంత్రాల పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గోదాము వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, రిజిస్టర్ల నిర్వహణను ఆయన తనిఖీ చేశారు. యంత్రాల నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, రెవెన్యూ సిబ్బంది సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

0

ఏప్రిల్ 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష అందుబాటులో హాల్ టికెట్లు 

చిత్రం న్యూస్, జైనథ్:  తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఆన్లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలని జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లుందే రాము తెలిపారు. 6వ తరగతిలో సీట్ల కోసం 131 మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వీరికి ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి అభ్యర్థులకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష జరుగుతుందని వివరించారు. హాల్ టికెట్లను విద్యార్థి పేరు, పుట్టిన రోజు లేదా మొబైల్ నెంబర్ నమోదు చేసి, https://telanganams.cgg.gov.in/TGMSWEB20/#/ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

సీపీఐ వందేళ్ల ప్రస్థానం – అప్రతిహతంగా ప్రజా పోరాటాలు: ముడుపు ప్రభాకర్ రెడ్డి

0

సీపీఐ వందేళ్ల ప్రస్థానం – అప్రతిహతంగా ప్రజా పోరాటాలు: ముడుపు ప్రభాకర్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారతదేశంలో నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలకు పెట్టింది పేరు సీపీఐ పార్టీ అని, వందేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో నిరంతరం పేదల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీయేనని సీపీఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో ‘ఇంటికీ సీపీఐ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ కరపత్రాలను పంపిణీ చేస్తూ, విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, అవినీతిపరులను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే సీపీఐ లక్ష్యమని స్పష్టం చేశారు.

సీపీఐ కార్యక్రమానికి ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోందని, దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు బలోపేతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు.  సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ప్రజలు సీపీఐ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్, గిరిజన సంఘం నాయకులు కోడప సురేష్, ఆదిలాబాద్ మండల కార్యదర్శి మహబూబ్ ఖాన్, శ్యామల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

బేలలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు: పాల్గొన్న ఎంపీ గొడాం నగేష్ 

0

బేలలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు: పాల్గొన్న ఎంపీ గొడాం నగేష్ 

చిత్రం న్యూస్, బేల: భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు శుక్రవారం బేల మండల కేంద్రంలోని శ్రీరామ్ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎంపీ గొడాం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ సిద్ధాంతాలు, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ శిక్షణ తరగతులలో జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కట్కం రాందాస్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్, క్రాంతి కుమార్ జైనథ్, బేల, భోరజ్,  సాత్నాల మండలాల అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ ఛార్జిలు, మండల పదాధికారులు, బూత్ కమిటీ అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది.

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్

0

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామంలో ఉపాధి హామీ పనులను  ఉప సర్పంచ్ టాక్రే సాగర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి కూలీలు ఎండలో పనిచేస్తున్న వారికి ఓ ఆర్ ఎస్ పాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ టాక్రే సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన భువన్ యాప్ కూలీలకు చాలా ఇబ్బంది పెడుతుందన్నారు. ఉదయం ఫొటో క్యాప్చర్ చేస్తేనే పనులకు వెళ్ళవచ్చాన్నారు. క్యాప్చర్ కాని వారు పనిచేయరాదనీ, ఆ కూలీల పరిస్థితి ఎలా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూలీలు ఫొటో క్యాప్చర్ కోసం వేచివుండాల్సి వస్తుందన్నారు. ఇంత సమయం తీసుకుంటే ఇంటి నుండి భోజనం చేయక వచ్చిన కూలీల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. పాతపద్దతిలో మాస్టర్ రోల్ పేపర్ పైన సంతకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సర్పంచ్ మెస్రం దౌలత్, సెక్రటరీ అర్షద్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవరావు తదితరులు పాల్గొన్నారు.