Home Blog Page 47

మొక్కలకు నీరు పోస్తూ..ప్రాణంగా చూస్తూ 

0

* మొక్కలకు నీరు పోస్తూ..ప్రాణంగా చూస్తూ

* ఆదర్శంగా నిలుస్తున్న బట్టి సావర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ యువకులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  మొక్కలు అందరూ నాటుతారు..వాటిని సంరక్షించడమే కష్టం..ఇలాంటి తరుణంలో నాటిన మొక్కలను కాపాడుకునేందుకు బట్టి సావర్గాం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ యువత నడుంబిగించారు. శ్రమ నీ ఆయుధమైతే.. విజయం నీ బానిసవుతుంది అనే నానుడిని నిజం చేస్తున్నారు వీరంతా..ప్రతి ఆదివారం నీరు పోస్తూ మొక్కలను కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సర్పంచ్ కాకముందే ఆలోచనకు బీజం..

ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గాం గ్రామ పంచాయతీలోని స్మశానవాటికలో మొక్కలు లేక ఎడారిగా ఉండడం, చెట్ల నీడ లేక పక్షులు రాక పోవడంతో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆలోచనకు బీజం పడింది. ఎలాగైనా మొక్కలు నాటాలని సర్పంచ్ కాక ముందే నిర్ణయించుకున్నారు. అనుకున్నది తడవుగా శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులు రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టి గత ఏడాది జూన్ నెలలో సుమారు 300 మొక్కలను నాటించారు. అందులో 10 మొక్కల వరకు పోయాయి. ఉన్న 290  మొక్కలను ఎలాగైనా సంరక్షించాలని కంకణం కట్టుకున్నారు. గ్రామ యువత సైతం తోడు కావడంతో ప్రతి ఆదివారం నీరు పోస్తూ మొక్కల సంరక్షణ చేపడుతున్నారు..

మండుటెండలో మొక్కవోని సంకల్పంతో..

40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ మొక్కలను కాపాడేందుకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా తెచ్చిన నీటిని మొక్కలకు పోస్తూ సర్పంచ్ తో పాటు యువకులంతా కాపడుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఎవరైనా అంత్యక్రియలకు వస్తే ఎండకు ఎండుతూ.. వర్షంలో తడుస్తూ ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని  గ్రహించాను. మొక్కలను సంరక్షిస్తే వృక్షాలుగా మారి నీడతో పాటు పక్షులు వచ్చే అవకాశం ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పచ్చగా కనిపిస్తున్నాయి.

బరంపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయ భక్తుల సౌకర్యార్థం బెంఛీలు విరాళం

0

చిత్రం న్యూస్, తలమడుగు: బరంపూర్ గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం పల్లి (బి)గ్రామ వాస్తవ్యులు నల్లా రవీందర్ రెడ్డి గొప్ప మనసుతో ముందుకు వచ్చారు. సుమారు రూ. 70 వేల  సొంత  నిధుల ఖర్చుతో ఆలయానికి వచ్చే భక్తులు కూర్చోవడానికి వీలుగా ప్రత్యేక టేబుళ్లను (బెంఛీలను) చేయించారు.ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, బరంపూర్ గ్రామస్తులైన మెరువు ప్రభాకర్ రెడ్డి – శైలజ దంపతుల ఆధ్వర్యంలో నల్లా రవీందర్ రెడ్డి దంపతులను ఆలయ ప్రాంగణంలో శాలువాతో కప్పి చిరు సన్మానం చేశారు. స్వామివారి సేవలో భాగస్వాములైనందుకు గ్రామస్తులు, భక్తులు రవీందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పోగొట్టుకున్న సెల్​ఫోన్లు బాధితులకు అందజేత

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నగరంలో సెల్​ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన బాధితులకు వాటిని ట్రేస్ చేసి తిరిగి అందజేసినట్లు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్​హెచ్​వో మాట్లాడుతూ.. వన్​ టౌన్​ పరిధిలో 20మంది బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేశారన్నారు. ఈ సందర్భంగా సీఈఐఆర్​ పోర్టల్ ద్వారా వాటిని ట్రేస్​ చేసి తిరిగి బాధితులకు శనివారం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్​ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలని.. ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్​స్టేషన్​లో సంప్రదించాలని సూచించారు.

వైద్య సేవలు ప్రశంసనీయం: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల ముగిం పు కార్యక్రమం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సేవలు ప్రశంసనీయమని వైద్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీహెచ్ఎస్, ఆసుపత్రి సూపరిండెంట్ డా.విజయ భాస్కర్, డిప్యూటీ డా.డీఎంఅండ్ హెచ్ ఓ విద్యా, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో  మహాత్మాాా  జ్యోతి రావు ఫులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈనెల 7వ తేదీన నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా సాధారణ ప్రసవాలు నిర్వహించిన ఆసుపత్రి గా అవార్డు అందుకున్న బాన్సువాడ మాత, శిశు సంక్షేమ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని పోచారం అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచడం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యమని, వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు.

పోరాట యోధురాలు నూర్జహాన్ కన్నుమూత

0

* నివాళులు అర్పించిన కార్మిక నాయకులు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సీఐటీయూ, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ (45) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె, శనివారం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కార్మిక ఉద్యమాలకు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు పెద్ద దిక్కు కోల్పోయినట్టైంది. నూర్జహాన్ జీవితం మొత్తం పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మున్సిపల్ తదితర రంగాల్లో పనిచేసే కార్మికుల హక్కుల సాధన కోసం ఆమె నిరంతరం పోరాటాలు నడిపారు. తక్కువ వేతనాలు, అసమాన పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలపై ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఆందోళనలు మాత్రమే కాకుండా, స్థానిక స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను అధికారులతో చర్చల ద్వారా పరిష్కరించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. కార్మికుల ప్రతి సమస్యను తన సమస్యగా భావించి, వారి మధ్యే ఉండి, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యారు. ఒక దశలో అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపిన నూర్జహాన్, ఆ తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చి సీపీఎం పార్టీతో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కష్టకాలాల్లో వెనుకడుగు వేయని ధైర్యసాహసాలు, అంకితభావం ఆమెను ప్రత్యేక నాయకురాలిగా నిలిపాయి. నూర్జహాన్ మరణం కార్మిక ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తూ, పార్టీ నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నూర్జహాన్ కి భర్త ఆనంద్ (ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు), కొడుకులు అబ్బాస్, ఆజాద్ ఉన్నారు. నూర్జహాన్ మృతి పట్ల పలువురు తమ సంతాపం ప్రకటించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్, నాటకం సభ్యులు ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్,జయలక్ష్మి నివాళులర్పించారు. విజయ రాఘవన్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి పి.వెంకట్, సీఐడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్.శ్రమ, తమ సంతాపం ప్రకటించారు. సీపీఐ(ఎం ) నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్ నాయకులు విశాల్, గంగాధర్, సుజాత,తదితరులు నివాళులర్పించారు.

మహిళా అక్షరాస్యతకు జ్యోతిబా ఫులే ఎనలేని కృషి: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహిళా అక్షరాస్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా ఫులే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జ్యోతిబా ఫులే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళల కోసం సతీమణి సావిత్రి భాయి ఫులేతో కలిసి మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాయోధుడు అని తెలిపారు. ప్రధానంగా మహిళల విద్యకు ఆయన చేసిన సేవలు అపూర్వమైనవని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంతో సత్యశోధకు సమాజాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ఒక మహానుభావుడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కార్పొరేటర్లు జ్యోతి మురళి, మల్లేష్ యాదవ్, బెల్లాల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి వేడుకలు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో శనివారం జరిగిన మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష పాల్గొన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించాయి. సుకుమార్ పెట్కూలే రచించిన ఫులే జీవిత చరిత్ర ఆడియో సీడీని కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు ఫులే జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమెంటో, ప్రశంసా పత్రాలను కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు.బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో, భుక్తాపూర్‌లోని ఫులే కూడలిలో, దస్నాపూర్‌లోని బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో ఫులే చిత్రపటాలకు, విగ్రహాలకు కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, అధికారులు, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు 

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుబ్బ లోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో పూలే జయంతి వేడుక నిర్వహించారు.అంతకుముందు వినాయకనగర్ లోని మహాత్మ జ్యోతిబా ఫులే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు మహాత్మ జ్యోతిబా ఫులే కొనసాగించిన కృషి అమోఘమని అన్నారు. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం చలించకుండా సాంఘిక దురాచారాలను దూరం చేసేందుకు ఫులే ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా విశేషంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం బీ.సీ గురుకులాలకు జ్యోతిబా ఫులే పాఠశాలలుగా నామకరణం చేస్తూ నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తోందన్నారు. మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే మన జీవితానికి కూడా సార్థకత చేకూరుతుందన్నారు. జ్యోతిబా ఫులే చూపిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. జయంతి సభలో మేయర్ ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ లు మాట్లాడుతూ, జ్యోతిబా ఫులే సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల బాధ్యులు బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, నరేందర్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

తలమడుగు రైతులకు భూ పట్టాల పంపిణీ

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తలమడుగు మండలం పల్సీ (బి) తండాకు చెందిన 9 మంది రైతులకు 30 ఎకరాల భూ పట్టాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జడ్పీ సమావేశ మందిరం ఆవరణలో పంపిణీ చేశారు. ప్రత్యేక చొరవ చూపి దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యను పరిష్కరించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ జడ్పీటీసీ  గోక గణేష్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

కారుణ్య నియామక అభ్యర్థులకు ఉత్తర్వులు అందజేసిన కలెక్టర్ రాజర్షి షా

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా నియామక ఉత్తర్వును శనివారం అందజేశారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఎంపికైన మొత్తం 16 మంది అభ్యర్థులకు ఆయన ఈ ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ఈ నియామకాలు ఆర్థిక భరోసానిస్తాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో వర్ణ, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.