Home Blog Page 45

పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

0

పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులు హాజరు గురించి ఆరా తీయగా, రెండు కేంద్రాలలోనూ పూర్తి స్థాయిలో హాజరు అయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

0

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో పాటు సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శనగ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బీఆర్ఎస్ నాయకుల వినతి

0

 

శనగ కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బీఆర్ఎస్ నాయకుల వినతి 

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన శనగ కొనుగోళ్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం  తహసీల్దార్ (MRO) కార్యాలయంలో RI ఉల్లాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు బంధు మాజీ మండల అధ్యక్షుడు సర్సన్ లింగారెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో గత కొన్ని రోజులుగా శనగ కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు మార్కెట్ వద్ద పడిగాపులు కాస్తున్నారని, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. నిలిచిపోయిన శనగ సేకరణను వెంటనే ప్రారంభించలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక  ఎమ్మెల్యే , కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్, నాయకులు సోమ రాంరెడ్డి, గణేష్ యాదవ్, పూండ్రు వెంకట్ రెడ్డి ఇతర నాయకులు మ పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో 19 న హిందూ సమ్మేళనం: సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

0

ఆదిలాబాద్‌లో 19 న హిందూ సమ్మేళనం: సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్, వినాయక్ చౌక్‌లో ఏప్రిల్ ఆదివారం సాయంత్రం 6:15 నిమిషాల నుండి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భవ్య శ్రీరామ నామ సంకీర్తనం కార్యక్రమం జరగనుంది. ఈ ధార్మిక కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా డాక్టర్ వారె దస్తగిరి ( ఆర్ ఎస్ ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచార ప్రముఖ్), పిట్ల కృష్ణ మహారాజ్ (వింగేశ్వర ఆశ్రమము, మల్లారం, ఇందూరు),  సంత్ సురేష్ మహరాజ్ (దేవగిరి ప్రాంత ఉపాధ్యక్షులు) హాజరుకానున్నారు. కుల, వర్ణ, ప్రాంత భేదం లేకుండా హిందూ బంధువులందరు కుటుంబ సమేతంగా పాల్గొని హిందువుల ధార్మికతను, ఐక్యతను చాటుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: సీఐ కిరణ్ కుమార్

0

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: సీఐ కిరణ్ కుమార్

చిత్రం న్యూస్, బాసర : ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సీఐ కిరణ్ కుమార్ అన్నారు.  ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాసర గ్రామ పంచాయతీలో రోడ్డు భద్రత పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేటపుడు హెల్మెట్ ధరించాలన్నారు. మన కోసం ఇంట్లో భార్యా, పిల్లలు ఎదురుచూస్తుంటారని, వాహనం జాగ్రతగా నడుపుతూ గమ్యం చేరుకోవాలని సూచించారు. మైనర్ లకు వాహనాలు ఇవ్వద్దని, మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, మట్కా, అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని వాటికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ఉప సర్పంచ్ సయ్యద్ అలీ, ఈవో ప్రసాద్ గౌడ్, కాంప్లెక్స్ హెచ్ ఎం నర్సయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్ దేశాయ్, ఆత్మ డైరెక్టర్ జలిల్, వార్డు మెంబర్ లు కృష్ణ, ఫసియొద్దిన్, ఫారుఖ్, నానం సాయిలు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై ప్రమాదం: కల్వర్టును ఢీకొన్న లారీ

0

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామ సమీపంలో 353బీ జాతీయ రహదారిపై అతివేగంగా వస్తున్న ఓ లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా సోమవారం ఢీకొట్టింది. వేగంగా వస్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు గోడను ఢీకొనడంతో లారీ ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

సామాజిక విప్లవకారుల స్ఫూర్తిని కొనసాగిద్దాం: ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

0

* డా.అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో ఆదివారం డా అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, నాయకులు పిడమర్తి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..డా. అన్నా బాహు సాఠే, కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు, ఆయన అణగారిన వర్గాల గొంతుకని, తెలంగాణ గడ్డపై సామాజిక న్యాయం జరగాలన్నదే మన ప్రభుత్వ సంకల్పమన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో మాదిగ సోదరుల పాత్ర మరువలేనిదన్నారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించుకోవడం మన బాధ్యతన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బహుజన పక్షపాతిగానే ఉంటుందన్నారు. ఇవాళ ఇక్కడ ఇంతమంది మాదిగ ప్రజాప్రతినిధులను సన్మానించుకోవడం గర్వకారణమన్నారు. రాజకీయాల్లో ఎదిగిన మాదిగ సోదరులు తమ అధికారాన్ని పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు. బలహీన వర్గాల సాధికారత కోసమే ఇవాళ కులగణన వంటి కీలక నిర్ణయాలను మనం ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..సాఠే విగ్రహం మనకు నిరంతరం పోరాట పటిమను గుర్తుచేస్తుందన్నారు. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం నుంచి గెలుపొందిన సర్పంచులు, కౌన్సిలర్లు తమ ప్రాంత అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలన్నారు. దళిత సమాజం ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమన్నారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందేలా చూడటమే మన లక్ష్యమన్నారు.

ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం

0

ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం

*స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు కైవసం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఇంటర్మీడియట్​​ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇందులో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంటర్ సెకండియర్​లో స్టేట్​ ఫస్ట్​,ఫోర్త్​ ర్యాంకులు, ఫస్టియర్​లో ఇద్దరు విద్యార్థులు స్టేట్ సెకండ్​ ర్యాంకులు, నలుగురు స్టేట్​ నాలుగో ర్యాంకులు పొందారు.ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. డీఈవో అశోక్​ విద్యార్థులను సన్మానించారు.ఇంటర్మీడియట్​​ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇందులో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు.స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించారు.ఇంటర్ సెకండియర్​లో స్టేట్​ ఫస్ట్​,ఫోర్త్​ ర్యాంకులు, ఫస్టియర్​లో ఇద్దరు విద్యార్థులు స్టేట్ సెకండ్​ ర్యాంకులు, నలుగురు స్టేట్​ నాలుగో ర్యాంకులు పొందారు.ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. డీఈవో అశోక్​ విద్యార్థులను సన్మానించారు.

సెకండియర్​ ఎంపీసీలో మృదుల స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించగా, బైపీసీలో తుబా ఫాతిమా, బి.కావ్య నాలుగో ర్యాంకు సాధించారు. అంతేకాకుండా ఎంపీసీలో హమియా ఉమేమా, వై.గౌతమి ఆరో ర్యాంకు పొందారు. అలాగే డి.కౌచిత, ఏ.సంజన, సీహెచ్​.వైష్ణవి, ఎన్​.రూపాని, కె.కీర్తి, టి.నిత్యశ్రీ, కె.అశ్రిత స్టేట్​ ర్యాంకులు సాధించారు.

ఫస్టియర్​ ఎంపీసీలో బి.మనోగ్న,ఆర్​.అక్షిత స్టేట్​ సెకండ్​ ర్యాంకులు పొందారు.అలాగే ఎస్​.భవాని,సాకేత్​, ఇష్రా మహీన్​,జేఎస్​.రినిత్య మూడో ర్యాంకులు సాధించారు. ఏ.సాయి విఘ్నత, తమన్నా నాజ్​, సిరి వేద స్టేట్​ ర్యాంకులు పొందారు.

ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. అనంతరం కాకతీయ విద్యాసంస్థల ఛైర్​పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ అద్భుతమైన ఫలితాల వెనుక నిరంతర పర్యవేక్షణ ఉందన్నారు. విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు.90 శాతం మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు,స్టేట్ ర్యాంకులు సాధించారన్నారు.

రాష్ట్రంలో అగ్రగామిగా..

స్టేట్ ర్యాంకులే కాకుండా, అత్యుత్తమ ఉత్తీర్ణత శాతంతో కాకతీయ విద్యార్థులు రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం సంతోషంగా ఉందని విజయలక్ష్మి అన్నారు. అద్భుతమైన విజయాలకు కారకులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ఉత్తమ ఫలితాలు వచ్చేందుకు విశేషమైన కృషి చేసిన అధ్యాపక బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్లు చెరుకూరి రజనీకాంత్​, రామోజీ ,తేజస్విని, రాజా,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

నిఘా నేత్రం..నేర నియంత్రణకు మార్గం

0

ఇచ్చోడలో 40 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల అదుపులో సీసీటీవీ కెమెరాలు ‘మూడో కన్ను’గా నిరంతరాయంగా పని చేస్తాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గంజాయి వినియోగానికి, విక్రయాలకు దూరంగా ఉంటూ “నో టు గంజాయి” నినాదాన్ని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు  సిబ్బంది పాల్గొన్నారు.

జైనథ్ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన వైష్ణవి: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అద్భుత ప్రతిభ!

0

జైనథ్ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన వైష్ణవి: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అద్భుత ప్రతిభ!

చిత్రం న్యూస్,జైనథ్: మండల కేంద్రానికి చెందిన గాతాడే వైష్ణవి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో సంచలనం సృష్టించింది. బైపీసీ (BiPC) విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది.

జైనథ్ గ్రామానికి చెందిన గాతాడే అనిల్ కుమార్తె వైష్ణవి చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తన ప్రతిభతో అగ్రస్థానంలో నిలిచి, అటు తల్లిదండ్రులకు, ఇటు జైనథ్ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చింది. 438 మార్కులతో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

వైష్ణవి సాధించిన ఈ అద్భుత విజయంపై స్థానికులు,  గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జైనథ్ పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టినందుకు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైష్ణవి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆమె భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. వైష్ణవి తల్లిదండ్రులు తమ కుమార్తె సాధించిన విజయం పట్ల ఎంతో గర్వంగా ఉన్నామని తెలియజేశారు.