Home Blog Page 43

పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షునిగా గేడం జగన్నాథ్ 

0

పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షునిగా గేడం జగన్నాథ్ 

చిత్రం న్యూస్, సాత్నాల: పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నగేష్ ఆధ్వర్యంలో మంగవారం పర్ధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షునిగా గేడం జగన్నాథ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జగన్నాథ్ మాట్లాడుతూ..సాత్నాల మండలంలోని పర్ధాన్ సామాజిక వర్గ అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్ధాన్ జనజాతి జాతీయ నాయకుడు సిడాం రాంకిషన్, జిల్లా అధ్యక్షుడు గొడం గంగారాం, జిల్లా ఉపాధ్యక్షుడు నైతం సంతోష్, మండల నాయకులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

ఖానాపూర్‌లో బీజేపీ ఘనవిజయం: భారీ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర నేతలు

0

ఖానాపూర్‌లో బీజేపీ ఘనవిజయం: భారీ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర నేతలు

చిత్రం న్యూస్,ఖానాపూర్: రాజకీయ కుట్రలను ఛేదించి ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవడం చారిత్రాత్మకమని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. ఈ విజయోత్సవం సందర్భంగా సోమవారం ఖానాపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, ఎంపీ గోడం నగేష్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలతో కలిసి పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికార అహంకారంతో ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా ఖానాపూర్ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత విజయాన్ని స్వర్గీయ రాథోడ్ రమేష్ గారికి అంకితం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖానాపూర్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడిందని, ఇదే ఉత్సాహంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

సమాజ సేవలో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం 

0

సమాజ సేవలో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం 

*వినికిడి సాధన పరికరాల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  సమాజ సేవలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, సేవలు అభినందనీయంమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని బర్కత్పుర లో గల రోటరీ కేంద్రంలో సోమవారం వినికిడి సాధన పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రోటరీ అంటేనే సేవా కార్యక్రమాలతో పేరుపొందిందన్నారు. వికలాంగులకు జైపూర్ కాళ్ళను అందించడం, వినికిడి సమస్య ఉన్నవాళ్లకు పరికరాలు అందించడం అభినందనీయమన్నారు. గతంలోనూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. నగరవాసులు రోటరీ క్లబ్ అందజేసే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వినికిడి లోపం ఉన్నవారు, మొహమాటం పడకుండా పరికరాలను వాడాలని సూచించారు. ధన్ పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో రెండు లక్షల విలువ గల వినికిడి పరికరాలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 18 మందికి వినికిడి సాధన పరికరాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, దాంపల్లి జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షుడు శ్యాం అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, రోటరీ ట్రస్ట్ చైర్మన్ ఆకుల అశోక్, క్లబ్ డైరెక్టర్ రాజ్కుమార్ సుబేదార్, కార్యనిర్వాహణాధికారి డాక్టర్ హరీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొ.డా.నాగమోహన్

0

జీజీహెచ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొ.డా.నాగమోహన్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఫోరెన్సిక్ హెడ్ ప్రొఫెసర్ డా.నాగమోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్న నాగమోహన్ కు ఇంచార్జి సూపరింటెండెంట్ గా నియమిస్తూ డీఎంఈ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. సూపరింటెండెంట్ గా పని నిజామాబాద్ ఇంచార్జి సూపరింటెండెంట్ గా పని చేసిన శ్రీనివాస్ స్థానంలో నాగమోహన్ ను నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. డా. నాగమోహన్ ను మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తో పాటు జీజీహెచ్ డిప్యూటీ సూపరిండెంటెంటు, ఆర్ఎంవోలు, సీనియర్ రెసిడెంట్, జూనియర్ డాక్టర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ పెద్దోళ్ళ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది నాగమోహన్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.

అనాథ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత

0

అనాథ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత

*నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సమాజంలో అనాధ వృద్ధుల సంక్షేమం పత్రి ఒక్కరి బాధ్యత అని, వారిని ఆదుకోవడం ద్వారా మనుష్యత్వాన్ని చాటుకోవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్ లో గల నిర్మల్ భవన్ లో అనాధ వృద్ధాశ్రమాన్ని సోమవారం సీపీ సందర్శించారు. అక్కడ నివసిస్తున్న అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడి, వారి ఆరోగ్యం, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న సహాయం కూడా వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, అందరూ సేవాభావంతో ముందుకు రావాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ చార్జి ఏసీబీ రాజా వెంకటరెడ్డి టాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సౌత్ రూరల్ సీఐ సతీష్ కుమార్, టాఫిక్ సీఐ ప్రసాద్, టాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్, టౌన్ 6 ఎస్ఐ వెంకట్ రావ్, గ్రామ సర్పంచ్ నరాల జ్యోతి, నిర్మల్ భవన్ సిస్టర్ రోసుమ్మ, గామ ప్రజలు పాల్గొన్నారు.

అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

0

అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ నూతన కార్యాలయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఏసీబీ నూతన కార్యాలయాన్ని సోమవారం సీపీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీబీ కి ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేయాలని సూచించారు. ఈ పారంబోత్సవానికి హైదరాబాద్ ఏసీబీ వెస్ట్ జోన్ డిప్యూటి డైరెక్టర్ డి. కమలాకర రెడ్డ్ని నిజామాబాద్ ఏసీబీ డీస్పీ జి.శేకర్ గౌడ్, ఇన్స్ పెక్టర్స్ యం.వేణుకుమార్, జి.నగేష్, ఏసీబీ సిబ్బంది హాజరయ్యారు.

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులపై పోచారం ఆగ్రహం

0

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులపై పోచారం ఆగ్రహం

*ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు సమస్యల విషయంలో మరో సారి తన కట్టుబాటును చాటుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు ప్రభుత్వం నిధులు మం జూరు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు జీవనాడిగా నిలిచే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి వరకు రిజర్వాయర్ ప్రాంగణంలోనే ఉండి,సంబంధిత శాఖల ఉన్నతా ధికారులతో పాటు పలువురు కీలక వ్యక్తులతో ఫోన్ ద్వారా సంప్ర దింపులు జరిపారు. సమస్యకు వెంటనే పరిష్కారం దొరకాలన్న లక్ష్యంతో ఆయన నిరంతరం ప్రయత్నించినప్పటికీ, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఫోన్లు ఎత్తకపోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. “ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం వస్తోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహార శైలి పై పోచారం తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల మాటకు విలువ లేకుండా పోయిందని, ప్రజాప్రతినిధులు చెప్పినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల కోసం తాను పలుమార్లు మంత్రిని సంప్రదించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. “మంత్రికి ఇరవై సార్లు చెప్పాను. అయినా పట్టించుకోలేదు. ఈ వయస్సులో నిధుల కోసం ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ వర్ని మండల రైతులకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. అయితే నిధుల కొరత కారణంగా పనులు నిలిచిపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎమ్మెల్యే పోచారం స్వయంగా రంగంలోకి దిగడం, రాత్రివేళల వరకు అధికారులతో చర్చలు జరపడం ఈ సమస్య తీవ్రతను సూచిస్తోంది. స్థానిక రైతులు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోచారం వ్యాఖ్యలతో ఈ అంశం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రైతు సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న కఠిన వైఖరి, ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పేదింటి పెళ్లికి అండగా నిలిచిన గ్రామస్థులు

0

పేదింటి పెళ్లికి అండగా నిలిచిన గ్రామస్థులు

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం మాలెబోరిగామ గ్రామ పంచాయతీ లోని కె బి కాలనీ గ్రామస్థులు. గ్రామానికి చెందిన మెస్రం రజిత వివాహం నిమిత్తం తమవంతు సాయంగా రూ.12,500 నగదును సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.మానవత్వాన్ని చాటుకున్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో గ్రామంలో కట్నకానుకలు, ఆర్భాటాలను నిషేధించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మెస్రం నాగోరావ్, గ్రామ మహజన్ సెడ్మకి అనంద్ రావ్, గ్రామ దేవారీ మెస్రం గణపతి, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌కు ‘జాతీయ రోడ్డు భద్రత’ పురస్కారం: అభినందించిన కలెక్టర్

0

ఆదిలాబాద్‌కు ‘జాతీయ రోడ్డు భద్రత’ పురస్కారం: అభినందించిన కలెక్టర్

చిత్రం, న్యూస్, ఆదిలాబాద్: బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖకు ‘2వ జాతీయ రోడ్డు భద్రతా ఎక్సలెన్స్ అవార్డు-2026’ లభించింది. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ రాజర్షి షా ను అధికారులు మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన వారిని అభినందించారు.  ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రవీందర్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కె. హరీంద్ర కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం, డీఎం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జడ్పీ సీఈఓ బి.రవి

0

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జడ్పీ సీఈఓ బి.రవి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన బి.రవి సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందేలా చూడాలని సూచించారు. శాఖాపరమైన కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, విధులను సమర్థవంతంగా నిర్వహించాలని నూతన సీఈఓకు సూచించారు.