Home Blog Page 41

ఆదిలాబాద్ కంది రైతులకు ఊరట.. రూ.10 కోట్ల బకాయిలు విడుదల

0

ఆదిలాబాద్ కంది రైతులకు ఊరట.. రూ.10 కోట్ల బకాయిలు విడుదల!

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని కంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవల మార్క్‌ఫెడ్ ద్వారా రైతులు అమ్ముకున్న కంది పంటకు సంబంధించిన రూ. 10 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా మార్చి 17వ తేదీ వరకు జరిగిన కొనుగోళ్లకు సంబంధించి ఈ నిధులు విడుదలయ్యాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 27 వరకు ప్రభుత్వం సేకరించిన 18,194 క్వింటాళ్ల కంది పంటకు గానూ మొత్తం రూ. 14.52 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే రూ. 3.5 కోట్లు విడుదల చేయగా, రూ. 2.50 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.

తాజాగా విడుదలైన రూ. 10 కోట్లతో మార్చి 17 లోపు పంట అమ్ముకున్న రైతులందరికీ లబ్ధి చేకూరనుంది. ఈ నిధులు త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జిల్లా కంది రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

దీపాయిగూడ వాసి ఉదారత: తహసీల్దార్ కార్యాలయానికి 15 కుర్చీల వితరణ

0

దీపాయిగూడ వాసి ఉదారత: తహసీల్దార్ కార్యాలయానికి 15 కుర్చీల వితరణ

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామానికి చెందిన గణపతి అయ్య తన ఉదారతను చాటుకున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, వారికి సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో తన వంతు సహాయంగా15 కుర్చీలను వితరణ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వృద్ధులు, మహిళలు కుర్చీలు లేక నిలబడటం చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నారాయణ, ఆర్ఐ ఉల్లాస్ తో పాటు బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, జైనథ్ గ్రామ బీజేపి పార్టీ అధ్యక్షుడు లింగా రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్,స్థానిక నాయకులు వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, సూర్య రెడ్డి, పొచ్చన్న, అశోక్,  ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గణపతి అయ్య చేసిన ఈ సామాజిక సేవను రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజలు అభినందించారు.

రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రాణరక్షణ: ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రాణరక్షణ: ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రజా పాలనలో 99 రోజుల వేడుకల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఓ పాఠశాలలో ‘Arrive – Alive’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కంటే, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడమే మేలని సూచించారు. ప్రమాదాల వల్ల బాధితులే కాకుండా వారి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ వివరాలను తనిఖీ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ రవాణా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేయాలి : డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్ 

0

మొక్కజొన్న కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేయాలి : డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్  

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ ( కె) గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, బాసర మండల అధ్యక్షుడు కోర్వ శ్యాం  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బాసర మండలంలోని ఆయా గ్రామాలలో మొక్కజొన్న పంటను రైతులు విస్తారంగా పండించారని, పంటను అమ్ముకునేందుకు మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు లేక పంటను దళారీ చేతిలో అమ్మి మోసపోతున్నారన్నారు. ఆరుగాలం పంట పండించి పంటను ప్రయివేట్  దళారులకు తక్కువ రేట్లలో అమ్ముకోవాల్సి వస్తుందన్నారు.ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రైతులతో కలిసి ప్రభుత్వంపై ఆందోళనలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీనివాస్, గంగాధర్, మంతెన పోశెట్టి, పెద్దకప్ రవి,మలేగాం గోపాల్, అగుల్ల శివన్న, జాజోళ్ల అశోక్, జాజోళ్ల రాజు, నరడి మహేష్, పల్లె రాజేశ్వర్, గుడాల లక్ష్మణ్, యోగేష్, మలేష్ పాల్గొన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

0

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీఓ లు ఇతర అధికారులతో కలెక్టర్ తాగునీరు సరఫరా తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించారు. మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టడానికి ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని అన్నారు.

జూన్ లో విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నందున హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ళకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఆవాసంలో ఒక్కో నివాస గృహం వారీగా శుద్ధి జలాలు అందేలా నీటి సరఫరా వ్యవస్థను చక్కదిద్దాలని, కుళాయిల బిగింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయించాలన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడైనా లోపాలను గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయాలన్నారు. వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఎంపీఓలు, ఏఈలు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీఓ శ్రీనివాస్ రావు, మిషన్ భగీరథ ఈఈ రాకేష్, నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఏఈలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు

అన్ని అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మాణ తలపెట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీంగల్ మండలం  గోన్ గొప్పుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి అనువైన పరిస్థితులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు తరగతి గదులతో పాటు, ల్యాబ్ రూమ్ లు, లైబ్రరీ, కంప్యూటర్ గదులు, ఆర్ఓ ప్లాంట్, బోర్ వెల్ తదితర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ తదితరులు ఉన్నారు.

మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు:కలెక్టర్ ఇలా త్రిపాఠి

0

మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు:కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిత్రం న్యూస్ నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16న మండల కేంద్రాలు, మున్సిపల్ పట్టణాలలో నిర్వహించనున్న సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు మంగళవారం పలు సూచనలు చేశారు. ముందస్తుగానే సభా వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లతో, ఇతర మండల స్థాయి అధికారులతో సమావేశమై తగు సూచనలు చేయాలన్నారు. సభలు నిర్వహించే ప్రదేశాలలో తగిన నీడ, తాగునీరు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 8.00 గంటల నుండి 10.30 గంటల లోపు సభలు ముగిసేలా ప్రణాళిక రూపొందించూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సభలలో అవగాహన కల్పించడంతో పాటు, ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్దిదారుల వివరాలు చదివి వినిపించాలని, లబ్ధిదారులతో వారి అనుభవాలను తెలియజేసేలా చూడాలన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి వాటికి సంబంధించి గ్రామ సభలలో వచ్చిన అర్జీలను మండల సభలకు ముందు తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, అందరూ భాగస్వాములు అయ్యేలా చొరవ చూపాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్-అలైవ్ కార్యక్రమం గురించి సభల్లో తెలియజేయాలని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సభల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు 

0

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) బాసర ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. క్యాంపస్ లోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో, డా.రెవెల్లి అజయ్ అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి.  ఈ కార్యక్రమానికి ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, వివిధ విభాగాల డీన్స్ హాజరై, డా.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు ప్రసంగిస్తూ.. డా.బీ.ఆర్. అంబేద్కర్ జాతికి చేసిన విశేష సేవలను, ఆదర్శాలను, సమాజ సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ జయంతి ఉత్సవాలలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

అంబేద్కర్‌ చౌక్‌లో ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు: సంత్ శిరోమణి గురు రావిదాస్ 250వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

0

అంబేద్కర్‌ చౌక్‌లో ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు: సంత్ శిరోమణి గురు రావిదాస్ 250వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారత రత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అణగారిన వర్గాల చైతన్యానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ సంత్ శిరోమణి గురు రావిదాస్ 250వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకుని, ఆయన జ్ఞాపకార్థం రూపొందించిన క్యాలెండర్‌ను ప్రముఖులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్  రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అసిస్టెంట్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అనూష బండారి సతీష్, లైబ్రరీ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి గురు రావిదాస్ చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. చర్మకార వృత్తిలో పుట్టినా, తన ఆధ్యాత్మిక కవితల ద్వారా మూఢనమ్మకాలపై పోరాడి, కుల విభేదాలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ఆయన మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్, గురు రావిదాస్ వంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సామాజిక సమరసత వేదిక బాధ్యులు అప్పల ప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యుదయ భావాలను చాటడానికి చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోచి సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కావల్ల రమేష్, బాలశంకర్ ప్రవీణ్,సామ రమేష్ రెడ్డి, మెస్రం రాజేశ్వర్, ఓటర్కర్ సంతోష్  వివిధ దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రముఖులకు చిత్రపటాల అందజేత

0

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రముఖులకు చిత్రపటాల అందజేత

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దళిత, యువజన సంఘాల సమితి ప్రతినిధులు ముఖ్య అతిథులకు అంబేద్కర్ చిత్రపటాలను అందజేసి గౌరవించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింలు, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, వైస్ చైర్మన్ మొహమ్మద్ రోహిత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత మనోహర్ తదితరులు హాజరయ్యారు.

దళిత సంఘాల ప్రతినిధులు బాలశంకర్ కృష్ణ, దుర్గం శేఖర్, ఊరే గణేష్, భీంరాం వాగ్మారె, అల్లూరి భూమన్న, మాల్యాల మనోజ్, నక్కా రాందాస్, చందన రాజన్న, కౌన్సిలర్లు బోడిగం శ్రీకాంత్, కృష్ణ, సంజయ్, కడ్డారపు ప్రవీణ్, దర్శనాల నగేష్, మరెల్లి మల్లేష్, అశోక్, సోగల సుదర్శన్, నిమ్మల ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకున్నారు.

జైనథ్ మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు – నివాళులర్పించిన బీజేపీ నాయకులు

0

జైనథ్ మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు – నివాళులర్పించిన బీజేపీ నాయకులు

చిత్రం న్యూస్, జైనథ్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను జైనథ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అంబేద్కర్ ప్రవచించిన సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పాలన సాగిస్తోందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, బీజేపి పార్టీ జైనథ్ గ్రామ అధ్యక్షుడు లింగా రెడ్డి, జైనథ్ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, స్థానిక నాయకులు అన్నెల అశోక్, సూర్య రెడ్డి, శరత్, పొచ్చన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.