Home Blog Page 40

బాసర రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

0

బాసర రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

చిత్రం న్యూస్, బాసర:  ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం బాసర రైతు వేదికలో నిర్వహించారు. ఈ సమావేశం ఎంపీడీవో దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు, ప్రగతి, ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బాసర ఎంపీడీవో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు. అలాగే, పనుల అమలులో పారదర్శకత పాటిస్తూ సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పవన్ చంద్ర ఎంపీఓ గంగ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, శాఖాధికారులు, సిబ్బంది మండల ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా పాలనతో గ్రామాల అభివృద్ధికి వేగం

0

ప్రజా పాలనతో గ్రామాల అభివృద్ధికి వేగం

చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)  పి.చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించి, సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల అవసరాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి పరస్పర సమన్వయం కీలకమని తెలిపారు.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం..తల్లీ బిడ్డ క్షేమం 

0

చిత్రం న్యూస్,బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చెంపల్లి గ్రామానికి చెందిన యోగిత  108 వాహనంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో  బేల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకొని వెళ్లారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి 108 అంబులెన్స్ లో  అదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యల నొప్పులు తీవ్రమవ్వడంతో ఈఎంటీ సాయి కిరణ్ ,పైలట్ అర్షద్ ఖాన్ లు వాహనం నిలిపి ప్రసవం చేశారు. మహిళ మగ బిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు.  మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించిన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

బేలలో ప్రజా పాలనా..ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

0

బేలలో ప్రజా పాలనా..ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలనా- ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఎంపీడీఓ మహేష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.సమావేశ ప్రారంభోత్సవం ముందుగా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ మండల స్థాయి ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఇందులో రైతుభరోసా,సబ్సిడీ గ్యాస్,తదితర సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు మండలానికి 21 కోట్లు రావడం జరిగిందన్నారు. అదేవిదంగా మండల స్థాయి అధికారులు తమ తమ ప్రగతి నివేదికను సమావేశంలో చదివి వినిపించారు.సమావేశంలో పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం నిర్వహించారు.

ఈ సందర్బంగా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం వివిధ శాఖలకు సంబందించిన మండల స్థాయి అధికారులు తమ తమ నివేదికలను వివిరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, జిల్లా విద్యాధికారి మహాలక్ష్మి, మండల వైద్యాధికారి, కృష్ణవంశీ, మండల పశువైద్యాధికారి డా. దీప్ రతన్, మండల వ్యవసాయ అధికారి సాయి తేజ రెడ్డి, మండల హౌసింగ్ ఏఈ లింగం, మండల సర్పంచ్ సంఘం అధ్యక్షుడు అశోక్ టాక్రే, తదితరులు పాల్గొన్నారు.

సర్కారు బడిలోనే విలువలతో కూడిన విద్య

0

సర్కారు బడిలోనే విలువలతో కూడిన విద్య

చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ధర్మారావుపేట ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు భరత్, సత్తయ్య గురువారం సందర్శించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేసి, బోధన తీరును పరిశీలించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనా వేసి, పాఠ్యబోధనలో మరింత మెరుగులు దిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.bఅధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విశ్వాసంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. విద్యతో పాటు విలువల ఆధారిత సంస్కారం కూడా పాఠశాలల్లోనే పెంపొందుతుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం, మౌలిక వసతులు, పరిశుభ్రత పరిస్థితులను కూడా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహన్ రావు పాటిల్

0

 కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహన్ రావు పాటిల్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన జాదవ్ సావిత్రి బాయి భర్త బాబురావు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ ఆ కుటుంబానికి  అండగా నిలిచారు. నిత్యవసరాల నిమిత్తం కొంత ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ  పల్లె పల్లెకు..  గడప గడపకు మోహన్ రావు పటేల్ కార్యక్రమం విజయవంతం చేయడంలో జాదవ్ సావిత్రి బాయి కుమారుడు గణేష్ కృషి ఉందన్నారు. మా ప్రజా ట్రస్ట్ పేద, మధ్య తరగతి కుటుంబాలకు సహాయపడటంలో ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

నర్సంపేట లో కాషాయ జెండా ఎగురవేస్తాం: బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధీమా

0

నర్సంపేట లో కాషాయ జెండా ఎగురవేస్తాం: బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధీమా

చిత్రం న్యూస్,వరంగల్:  భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు.

జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ నాయకులతో కలిసి జరిగిన ఈ భేటీలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాంచందర్ రావు గారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు మరియు వివిధ మోర్చాల బాధ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఈ పర్యటన కొత్త ఉత్సాహాన్ని నింపింది

వృద్ధురాలికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

0

వృద్ధురాలికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

చిత్రం న్యూస్,వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమార్థంగా భావించే ‘సనాతన హిందూ సేవా సమితి’ తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించింది.  ఈ సంస్థ తన 175వ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

వరంగల్ వెంకట్రామా థియేటర్ సమీపంలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన పేర్ణ ఎల్లమ్మ అనే వృద్ధురాలు, ఎటువంటి ఆధారం లేక ఆరోగ్య సమస్యలతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో మగ్గుతోంది. ఆమె దీనస్థితిని గమనించిన సనాతన హిందూ సేవా సమితి సభ్యులు, మానవత్వంతో స్పందించి ఆమెకు రెండు నెలలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసర వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని, ఇప్పటివరకు 175 కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సాయం అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, సలహాదారు ప్రతాపగిరి గణేష్‌తో పాటు సభ్యులు బడుగు రాము, గంగిడి ధర్మారెడ్డి, పేర్ణ భరత్, దీకొండ అమర్నాథ్, పెరుమాండ్ల శ్రవణ్, దిడ్డి మోహన్, బండారి సంపత్, ఓదెల తిరుపతి తదితరులు పాల్గొని వృద్ధురాలికి సాయం అందించారు. తమ వంతు సాయం అందినందుకు వృద్ధురాలు ఎల్లమ్మ కన్నీటి పర్యంతమవుతూ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆదిలాబాద్: 44 దొంగతనాల కేసుల్లో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు

0

ఆదిలాబాద్: 44 దొంగతనాల కేసుల్లో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ పాత నేరస్థుడిపై పోలీసులు పీడీ (Preventive Detention) యాక్ట్ ప్రయోగించారు. ఉట్నూర్ ప్రాంతానికి చెందిన టేకం తుకారం (40) అనే వ్యక్తిపై ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. టేకం తుకారం గత 10 ఏళ్లకు పైగా వరుస నేరాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 44 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లినప్పటికీ, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎస్పీ సిఫార్సు మేరకు పీడీ యాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్ నమోదైన అనంతరం నిందితుడిని నిన్న చంచల్‌గూడ/చర్లపల్లి జైలుకు తరలించారు. వరుస నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

విస్తృత స్థాయి అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

0

విస్తృత స్థాయి అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, సీపీ, జిల్లా అధికారులు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అరైవ్ అలైవ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్ నగర పర్యటనకు బుధవారం విచ్చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిజామాబాద్ చేరుకున్న మంత్రిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్ద కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో పాటు అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, ఇతర జిల్లా అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి పోలీసు బందోబస్తు మధ్య కాన్వాయ్ ద్వారా మంత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కోసం చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీ కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు చేరుకోగా, అక్కడ విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా అధికారులతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు మానవహారంలో భాగస్వాములు అయ్యారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని, ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తద్వారా అనేక కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. ఎన్ని చట్టాలు నిబంధనలు అమలు చేసినా, ప్రజలలో మార్పు రానంత వరకు ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని అన్నారు. దీనిని గుర్తిస్తూ పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో ప్రజలలో అవగాహన కల్పించడం కోసం అరైవ్ అలైవ్ పేరుతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రమాదాల నివారణకు తమవంతు దోహదపడాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించాలని, అలా కృషి చేసిన వారిని రహ్ వీర్ కింద రూ. 25 వేల నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం ద్వారా అందజేయబడుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.