Home Blog Page 38

రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం

0

రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం

చిత్రం న్యూస్, బేల: ఆపద సమయంలో సమాజ సేవలో ముందుంటూ, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులను బేల మండలంలోని గ్రామమైన సిర్పన్న రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులైన ఊరాడే సాహిల్, మడావి నాగేష్, మరిపెల్లి కిరణ్ లను బేల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధు కృష్ణ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. క్లబ్ సభ్యులు తమ బాధ్యతలను చురుకుగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సామాజిక సేవా కార్యక్రtమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాము బార్కడే, మడావర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

జూన్ 2 లోగా పీఆర్సీని అమలు చేయాలి

0

*డిమాండ్ల సాధన కోసం భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసన

*ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ రెండు లోగా పీఆర్ సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యోగులు భోజన విరామ సమయంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన… నిజామాబాద్ కలెక్టరేట్ సమీకృత కార్యాలయ ఆవరణలో, నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్ పులగం దామోదర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ అనంతరం 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించుటకు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరీ శ్రీనివాస్ రావు అధ్యక్షతన, 206 పైగా భాగస్వామ్య సంఘాలతో టీజీ ఈ జేఏసీ ని స్థాపించి, పలుమార్లు 69 పైగా డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసినప్పటికీని, ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టడం వల్ల, ఉద్యమ కార్యచరణను ప్రకటించిన నేపథ్యంలో…ఇదివరకే ప్రభుత్వానికి నివేదించిన 69 డిమాండ్ లో అతి ముఖ్యమైన నాలుగు డిమాండ్లలో మొదటిది, పీ ఆర్ సీ కమిటీ వేసి 30 నెలల గడుస్తున్నప్పటికిని నేటికి నివేదిక తెప్పించుకోకపోవడం విడ్డూరమని అయన అన్నారు. అతి త్వరగా 51% శాతం ఫిట్మెంట్ తో, 2 వ పిఆర్సిని, అమలు చేయాలనిరెండవది ఉద్యోగులకు 13 వేల కోట్లకు పైగా బకాయి పడ్డ పెండింగ్ బిల్లుల అన్నింటిని ఏక మొత్తంగా విడుదల చేయాలని మూడవది అతి ముఖ్యమైనది ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేస్తూ, ఆరోగ్య కార్డులను అమలు చేయాలని

మూడవది రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మరచినట్టు కాదని, సెప్టెంబర్ 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగులందరికీ సి పి ఎస్ స్కీం నుండి రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు మిగతా 64 డిమాండ్లను కూడా పరిష్కరించాలని, నిరసన ప్రదర్శనను చేపట్టామని… ఉద్యమ కార్యచరణలో భాగంగా, మే 5 న సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తామని తెలుపుతూ, అయినను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే, రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ… ఉద్యమ కార్యచరణలో భాగంగా, నిరసన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర బాధ్యులు పులగం దామోదర్ రెడ్డి కి, టీజీఈ జేఏసీ జిల్లా భాగస్వామ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, అన్ని శాఖల ఉద్యోగులకు మహిళా ఉద్యోగ సోదరులందరికీ ఉద్యమాభివంధనాలు తెలియజేస్తూ. టి జి ఈ జేఏసీ రాష్ట్ర బాధ్యులు దామోదర్ రెడ్డి తెలిపినట్టు పైన తెలిపిన నాలుగు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ కార్యచరణను నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నామని, దీనికి గాను ఉద్యోగులందరూ సమయత్తం కావాలని సూచించారు. ఈ నిరసన కార్యక్రమానికి వీరితోపాటు టీజీఈ జేఏసీ జిల్లా, కో చైర్మన్లు రమేష్, రమన్ రెడ్డి, ధర్మేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సురేష్, పండరినాథ్, వైస్ చైర్మన్లు విజయ్ సింగ్, శేఖర్ ,అమృత్ కుమార్, ప్రశాంత్,మోహన్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, టీజీఈ జేఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి: అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

0

తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి: అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: వేసవి సీజన్ దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పత్రి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా తిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాకూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల ఎంపీడీఓలు, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈలు, ఎం.పీ.ఓ లు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా తీరుతెన్నులపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలంలోని ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతు పనులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది వేసవిలో ఏయే ప్రాంతాలలో దాహార్తి సమస్యలు ఉత్పన్నం అయ్యాయని ఆరా తీశారు. ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నందున, తాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. చుక్క నీరు కూడా వృధా కాకుండా చూడాలని, చివరి ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలలోని నివాసాలకు సైతం నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులుఉంటే ముందుగానే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని, సకాలంలో పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని అన్నారు.

ఈ వేసవిలో జిల్లాల్లో ఎక్కడ కూడా నీటి ఎద్దడి నెలకొనకుండా అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికోసం ప్రజలు నిరసనకు దిగితే, సంబంధిత ఎంపీడీఓలను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులతో సమన్వయాన్ని పెంపొందించుకుని, పత్రి గ్రామంలో,మున్సిపల్ వార్డులలో ప్రజల అవసరాలకు సరిపడా పూర్తిస్థాయిలో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలాపర్యవేక్షణ చేయాలన్నారు. చేతి పంపులు, బోరు బావులకు తక్షణమే ఫ్లషింగ్ చేయించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఆటంకం కలిగేలా పైప్ లైన్లను ధ్వంసం చేయడం, వాల్వ్ లకు నష్టం చేకూర్చే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభం చేయించాలని, ఎంపీఓలు, ఏఈలు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీఓ శ్రీనివాస్ రావు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్, మిషన్ భగీరథ ఈఈ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

వైట్ కాలర్ నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలి

0

అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి

*నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : జిల్లాలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై పత్యేక బృందాల ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి పై సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అరెవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కువకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పత్యేక దృష్టిపెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బాక్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా పత్రి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై పత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి నిజామాబాద్ ఇన్ చార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ సీఐ అంజయ్య, సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి నియామకం 

0

తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి నియామకం

*డైరెక్టర్ గా కాకతీయ రజనీకాంత్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వితీయ శ్రేణి సభ్యులతో కుడిన పాలక మండలిని  ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరుపున ప్రభుత్వ ప్రధాన ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ 1991 ప్రకారం నూతనంగా పాలక మండలి సభ్యులను నియమిస్తు అదేశాలు జారీ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి నామినేటేడ్ కోటాలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మెనేజ్ మెంట్ ప్రొపేస్తర్ అంజనేయులు, యూనివర్సిటీ పరిధిలోని ఒక విభాగం ప్రిన్సిపాల్ ను నామినేట్ చేయాల్సిన కోటా జియో ఇన్ఫర్మేటిక్స్ డిపార్ట్ మెంట్ అసోసియేట్ ప్రొఫేసర్ డా.సుధాకర్ గౌడ్, అఫిలియేటెడ్ కాలేజ్ ల తరుపున ఒక ప్రిన్సిపాల్ గా గౌతమి కాలేజీ ప్రిన్సిపాల్ డా. కే. సంజీవ రావు, యూనివర్సిటీ పరిధిలోని ఓక కాలేజీ లెక్చరర్ గా గిరిరాజ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దండు స్వామిని, అప్లియేటేడ్ కాలేజీల నుంచి ఓక అధ్యాపకుడిగా ఇందూర్ పిజీ కాలేజ్ ఆప్ బిజినేస్ మెనేజ్ మెంట్ కాలేజీ ప్రో. మదన్ మోహన్ ను నామినేట్ చేశారు.

అవల్పూర్ గ్రామంలో తీరిన దశాబ్ద కాలపు విద్యుత్ కష్టాలు: సర్పంచ్ అనిల్ చొరవపై సర్వత్రా హర్షం

0

అవల్పూర్ గ్రామంలో తీరిన దశాబ్ద కాలపు విద్యుత్ కష్టాలు: సర్పంచ్ అనిల్ చొరవపై సర్వత్రా హర్షం

చిత్రం న్యూస్, బేల: గత పది ఏళ్లుగా విద్యుత్ సమస్యలతో అల్లాడుతున్న బేల మండలం అవల్పూర్ గ్రామ ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గ్రామంలో నెలకొన్న తీవ్రమైన విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, సర్పంచ్ అనిల్ ప్రత్యేక చొరవ చూపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.

గ్రామంలో పాతబడిన, సరిపడా సామర్థ్యం లేని ట్రాన్స్‌ఫార్మర్ల వల్ల లో-వోల్టేజ్ తో ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సర్పంచ్, సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధప్రతిపాదికన అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయించారు.

స్వయంగా పనులను పర్యవేక్షించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల నాటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ అనిల్ కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గ్రామ అభివృద్ధిలో విద్యుత్ సమస్య పరిష్కారం ఒక కీలక మైలురాయి అని ఈ సందర్భంగా గ్రామస్తులు కొనియాడారు.

రాష్ట్రస్థాయిలో మెరిసిన జైనథ్ విద్యార్థిని గతాడే వైష్ణవికి ఘన సన్మానం

0

రాష్ట్రస్థాయిలో మెరిసిన జైనథ్ విద్యార్థిని గతాడే వైష్ణవికి ఘన సన్మానం

చిత్రం న్యూస్, జైనథ్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జైనథ్ గ్రామానికి చెందిన గతాడే వైష్ణవి అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించి తమ గ్రామానికి పేరు తెచ్చిన వైష్ణవిని స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గ్రామ అధ్యక్షుడు చిలుకూరి లింగారెడ్డి, నాయకులు కోవ సారథి, అన్నెల అశోక్, కొడిచర్ల స్వామి, శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆమె నివాసానికి చేరుకుని, శాలువాతో ఆమెను గౌరవించి అభినందనలు తెలిపారు. వైష్ణవి పట్టుదలతో చదివి సాధించిన ఈ విజయం ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ దిశగా అడుగులు: అధికారుల బృందం సంయుక్త క్షేత్ర స్థాయి పరిశీలన

0

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ దిశగా అడుగులు: అధికారుల బృందం సంయుక్త క్షేత్ర స్థాయి పరిశీలన

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ నిర్మాణ సాధ్యసాధ్యాలను (Feasibility Study) పరిశీలించేందుకు శుక్రవారం రక్షణ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని,జిల్లా ఇంచార్జి కలెక్టర్ యువరాజ్ మర్మట్ అధికారులకు అవసరమైన వివరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అధ్యయనం చేపట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ అధ్యయనానికి సహకరించిన భారత ప్రభుత్వానికి, సంబంధిత కేంద్ర మంత్రులకు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఢిల్లీలో జరగనున్న తదుపరి సమావేశంలో ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీఓ స్రవంతిలతో పాటు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు రాహుల్ శుక్ల, ఎస్.జి. హెడ్గే, జె.పి. సబర్వాల్, రాజీవ్ మరియు పలువురు ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ నెల 18న కూర గ్రామంలో హిందూ సమ్మేళనం 

0

ఈ నెల 18న కూర గ్రామంలో హిందూ సమ్మేళనం 

చిత్రం న్యూస్, జైనథ్: ఆధ్యాత్మికత, ఐక్యతను చాటిచెప్పే లక్ష్యంతో  శనివారం  ఉదయం 11 గంటల నుండి కూర గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వేదికగా భారీ “హిందూ సమ్మేళనం” నిర్వహించనున్నారు. కరంజి ఉప మండలం పరిధిలోని అనంద్ పూర్, కూర, కరంజి, కాప్రి, ఉమ్రి వంటి పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ధర్మ పరిరక్షణ, హిందూ సమాజంలో ఐక్యత పెంపొందించడం కోసం ఈ సమ్మేళనంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, సామూహిక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, అలాగే హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని నిర్వాహకులు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన బీజేపీ బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ 

0

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన బీజేపీ బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ 

చిత్రం న్యూస్, బాసర : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావుని నిర్మల్ జిల్లా బాసర బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ శుక్రవారం హైదరాబాద్ లో  మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి  ఘనంగా సన్మానించారు. అనంతరం బాసరలో నెలకొన్న సమస్యలపై వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా రామచంద్ర రావుకు పుట్నాల సాయినాథ్ అభినందనలు తెలిపారు. ఆయన వెంట జాదవ్ గణేష్ తదితరులు ఉన్నారు