Home Blog Page 37

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలి

0

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలి

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: యూనివర్సిటీ సమస్యల పైన తన గళం వినిపించాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నూతన పాలక మండలి సభ్యునిగా నియామకమైన చెరుకూరి రజనీకాంత్ ను ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాబోయే కాలంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి కొరకై పాలకమండలి సమావేశాల్లో చర్చించి, యూనివర్సిటీ అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని, యూనివర్సిటీలో గతంలో వచ్చిన ఆరోపణలపై తన గళం వినిపించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా రజనీకాంత్ నియమకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

0

సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే సంక్షేమ వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. వారం రోజుల పాటు నిర్వహించే ఆయా కార్యక్రమాలను నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. వసతి గృహాల విద్యార్థులకు క్విజ్, ఉపన్యాసం, చిత్రలేఖనం, తదితర పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయాలన్నారు. ఆయా వసతి గృహాల్లో చిన్న చిన్న మరమ్మతులు అవసరం ఉంటే అలాంటి పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలపై, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కలిగించడమే కాక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు.

వీసీ అనంతరం అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లు అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ఆయా వసతి గృహాల్లో ఉండే సమస్యలపై ఫోటోలు తీసి, పరిష్కరించాక కూడా ఫోటోలు తీసుకొని బిఫోర్, ఆఫ్టర్ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల బ్యానర్లను తప్పకుండా ప్రదర్శిస్తూ షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. పేరెంట్స్ మీటింగ్ ల సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, సీపీఓ రతన్, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు కృష్ణవేణి, నర్సయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు పాల్గొన్నారు.

యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు

0

యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు

పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ర్యాలీ

ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. యువత చెడు మార్గంలో కాకుండా తమ ఉజ్వల భవిష్యత్తు కోసం సక్రమ మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ ర్యాలీ శనివారం ఉదయం జిల్లా క్రీడా అథారిటీ మైదానం నుండి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ లీగ్ ర్యాలీని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుండడం ఎంతో గర్వకారణమని, నిజామాబాద్ జిల్లా నుండి ఎంతోమంది క్రీడాకారులను దేశానికి అందించినటువంటి ఘనత జిల్లాకు ఉండడం ఎంతో సంతోషకరమైన విషయం అని, ఈ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, యోగా మొదలగు క్రీడలు నిర్వహిస్తున్నారని సాయి చైతన్య అన్నారు. ఇందులో అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని వెల్లడించారు. ఈ క్రీడలలో గెలుపొందిన వారికి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగిందని అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించాలని ఉద్దేశంతో యువతను ప్రోత్సహించే విధముగా ఈ యొక్క సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నరని, కోవిడ్ సమయంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది చనిపోయారని రోడ్డు ప్రమాదాల వలన నిజామాబాద్ జిల్లాలో 2025 సంవత్సరంలో 300 మంది మరణించారని వివరించారు.ప్రధానముగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలన ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించాలని సీపీ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారు క్షేమంగా తమ గమ్యానికి చేరుకుంటున్నారని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. ,

యువత డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరితో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టూ స్పోర్ట్స్ అనే నినాదం చేయించడం జరిగింది. యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారాలు ఉంటుందని యువత సన్మార్గంలో నడిచినప్పుడే అది సాధ్యమవుతుందని అందుకే ఈ యొక్క సమ్మర్ క్యాంపు ద్వారా ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు.. అనంతరం కాగడాతో క్రీడా ర్యాలీని ప్రారంభించి, క్రీడా ర్యాలీ పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి కోర్టు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ కార్యాలయం, విజయ్ థియేటర్, రైల్వే కమాన్, అయ్యప్ప దేవాలయం, మీ-సేవ, పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీసీపీ బస్వా రెడ్డి, జనరల్ సెక్రెటరీ కవిత రెడ్డి, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, ట్రెజరర్ సంతోష్ వివిధ విభాగాల్లో జాయింట్ సెక్రటరీలు శిరీష్, పితాని, శివప్రసాద్, గణేష్ గుప్తా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, నిజామాబాద్ యువత, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొని దిగ్విజయం చేశారు.

జైనథ్ బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం

0

జైనథ్ బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం

చిత్రం న్యూస్, జైనథ్: పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులు, బాటసారుల దాహార్తిని తీర్చడానికి జైనథ్ గ్రామ పంచాయతీ ప్రత్యేక చొరవ తీసుకుంది. స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు.

వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పంచాయతీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు, కూలీలకు, రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ముజీబ్, ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగదీశ్ రెడ్డి, బీజేపీ గ్రామ అధ్యక్షుడు చిలుకూరి లింగారెడ్డి,వార్డు సభ్యులు కోవ సారథి, స్వామి, గంగన్న, పరశురాం, గ్రామ పెద్దలు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బేల కాంగ్రెస్ నేతల ఫైర్

0

బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బేల కాంగ్రెస్ నేతల ఫైర్

చిత్రం న్యూస్, బేల : పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆంధ్రప్రదేశ్-తెలంగాణ విభజనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బేల మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..స్థానిక శివాజీ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ వ్యాఖ్యలు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వందలాదిమంది విద్యార్థుల ఆత్మబలి దానాలకు చలించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు  సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.తేజస్వి సూర్య బేషరతుగా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ  జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, కిసాన్ సెల్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఘన్ శ్యామ్ గవాండే, చంద్రకాంత్ మడావి, ఆత్మ డైరెక్టర్,ఈశ్వర్ ధోటే, సర్పంచులు గంబీర్ థాక్రే, శంకర్ భోక్రె, గులాబ్ గేడాం, అవినాష్ గోడే, బాపురావు దడంజె, సాగర్ థాక్రె నాయకులు సుదర్శన్,  కన్నె రాజు, గోపతి శంకర్, యువ నాయకులు హేమంత్ పటేల్, రవి గట్లేవార్, మహబూబ్ ఖాన్, మొబిన్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

శనగ పంట కొనుగోలు చేయాలని రైతుల ధర్నా: మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

0

శనగ పంట కొనుగోలు చేయాలని రైతుల ధర్నా: మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

 చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల సబ్ మార్కెట్ యార్డులో గత 15 రోజుల నుంచి ప్రభుత్వం రైతుల శనగపంట కొనుగోలు చేయకపోవడంతో శనివారం రైతులు ధర్నా చేపట్టారు.మండల బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతుగా 353బీ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్ మాట్లాడుతూ మండలంలో రైతులు 5,600 ఎకరాలల్లో శనగ పంట పండిస్తే కనీసం ఇప్పటివరకు ఈ ప్రభుత్వం 20% కూడా కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా ఉండి అన్ని విధాల ఆదుకుంటే, ఈ ప్రభుత్వ మాత్రం రైతుల పేరిట శాపంగా మారిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సంబంధిత మార్క్ఫెడ్ డీఎంతో చరవాణిలో మాట్లాడించారు. సోమ, మంగళవారాల్లో కచ్చితంగా శనగ కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చి రైతులకు నచ్చజెప్పారు దీంతో వారు శాంతించి ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖోడే విపిన్, నాయకులు గోడే విశాల్, మధుకర్ భలేరావు, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

జైనథ్ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్,జైనథ్: రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారానే ఆర్థికంగా నిలదొక్కుకోగలరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జైనథ్ వ్యవసాయ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి తో కలిసి ఆయన అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, అధిక డిమాండ్ ఉండే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కట్కం రాందాస్, బీజేపీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, బీజేపి నాయకులు పిడుగు సంతోష్ యాదవ్,చిలుకూరి లింగారెడ్డి, అశోక్ రెడ్డి, దేవన్న, వెంకట్ రెడ్డి, సారథి, మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు పూర్తి సహకారం: ఇంఛార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్

0

ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు పూర్తి సహకారం: ఇంఛార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ఇంఛార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీఓ స్రవంతితో పాటు ఎయిర్ ఫోర్స్ అధికారులు రాహుల్ శుక్ల, ఎస్.జి. హెడ్గే, జెపి సబర్వాల్, రాజీవ్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఎదురవుతున్న సాంకేతిక అంశాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

ఇంటినుండి వెళ్ళిపోయిన యువకున్ని కాపాడిన బాసర పోలీసులు 

0

ఇంటినుండి వెళ్ళిపోయిన యువకున్ని కాపాడిన బాసర పోలీసులు 

*అభినందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలో అనుమానస్పదంగా తిరుగుతున్న యువకుడిని గోదావరి నది వద్ద గమనించి స్థానికులు 100కు డయల్ చేశారు. ఈ సమాచారం అందుకొని పోలీసులు హుటాహుటిన గోదావరి నది వద్ద చేరుకొని అతన్ని పట్టుకున్నారు. బాసర పోలీస్ స్టేషన్ తరలించి అతని వివారాలు  ఆరా తీశారు. కుంటాల మండలం లింబ కే గ్రామానికి చెందిన పండ్ల సిందే విజయ్ కుమార్ గా గుర్తించారు.  కుటుంబం కలహాల కారణంగా చిన్న గొడవతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకొని గోదావరి వద్దకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆయన్ను అప్పగించారు. ఈ సమాచారంపై స్పందించిన సీఐ కిరణ్ కుమార్, బాసర పోలీసులు గగన్, సుభాష్, చందు, భాస్కర్ ను జిల్లా ఎస్పీ  జానకి షర్మిల అభినందించారు .

0

ప్రతి ఒక్కరూ సీపీఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండాలి:పోలీస్ కమిషనర్ సాయిచైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి పణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో టాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అర్డెవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విసృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ లో బ్లూ కోర్టు సిబ్బందికి, ఆటో డ్రైవర్లకు సీపీఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్డెవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా సీపీఆర్ విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సీపీఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ శిక్షణలో సీపీఆర్ విధానం, పాథమిక పథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. పత్రి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సీపీఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి నిజామాబాద్ టాఫిక్ ఏ.సీ.పి మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, టాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్, డాక్టర్ రామనేశ్వర్ (న్యూరాలజిస్ట్ (ఐ.ఎమ్.ఏ ట్రెజరీ), డా. శ్రీశైలం (పీడియాటెస్ట్, డాక్టర్ విటల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్ ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.