Home Blog Page 36

స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం

0

స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఇమోఫిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రోచ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై సహకారంతో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలొ ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా హీమోఫిలియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్:గంగారం మరియు ఇన్నమురీ రవితేజ,డాక్టర్:రఘు, డాక్టర్:సంతోష్ దంత వైద్యులు డాక్టర్: జగదీష్ ఫిజియోథెరపిస్ట్ , స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య హిమఫిలియా సొసైటీ అధ్యక్షులు దాసరి విజయనందరావు లు పాల్గొని హిమోఫిలియా వ్యాధి గురించి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. అయితే హిమోఫిలియా వ్యాధి అనేది ఒక రాజవంశపు వ్యాధిగా పేర్కొంటారన్నారు. కొందరికి జన్యుపరంగా వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. ఇది అన్ని వ్యాధుల మాదిరిగానే ఈ వ్యాధి కూడా ఒకటని సూచించారు. అయితే ఏ వ్యాధికైనా వైద్యులు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించవచ్చు అన్నారు.అలాగే వ్యాధి వచ్చిందని మానసిక కుంగుబాటుకు గురైనట్లయితే శారీరక దృఢత్వం కోల్పోవడం జరుగుతుందని దాంతోపాటు అనారోగ్యం బారిన మరింత ఎక్కువ పడతారని సూచించారు.మీరు ఎప్పుడైతే మానసిక దృఢత్వంతో ఉంటారో వ్యాధిని అధిగమించవచ్చని హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు మరియు వారి తల్లిదండ్రుల్లో మానసిక ధైర్యాన్ని నింపారు.అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అలాగే దంత వైద్య నిపుణులు మాట్లాడుతూ హిమోఫిలియా బారిన పడ్డవారు దంతాలు, చిగురుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా బ్రష్ చేయాలి. ఎప్పుడు రక్తస్రావం జరుగుతుంది అలా జరగకుండా ఎలా ఉండాలని క్లుప్తంగా వివరించారు.అలాగే ఫిజియోథెరపీ వైద్యుడు జగదీష్ మాట్లాడుతూ.. దినచర్యలో భాగంగా వ్యాయామం ఏ విధంగా చేయాలి ఆటలు ఏ విధంగా ఆడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన వైద్యులను హిమోఫిలియా సొసైటీ చాప్టర్ నిజామాబాద్ అధ్యక్షులు దాసరి విజయ్ నంద రావు మరియు చాప్టర్ సభ్యులు అంబరీష్, యజాస్ హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో శాలువలు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.

జైనథ్ లో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరస

0

జైనథ్ లో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిర

చిత్రం న్యూస్, జైనథ్: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ జైనథ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా సాధికారతకు కీలకమైన మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని వారు విమర్శించారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లబ్ధి కోసం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో జైనత్ బీజేపీ మండల అధ్యక్షుడులోక కరుణాకర్ రెడ్డి, బోరాజ్ మండల బీజేపి అధ్యకుడు గాజుల సన్నీ, స్థానిక బీజేపీ నాయకులు, చిలుకూరి లింగారెడ్డి, పిడుగు సంతోష్ యాదవ్, పొచ్చన్న,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శ 

0

ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శ 

చిత్రం న్యూస్, బాసర:  నిర్మల్ జిల్లా భైంసాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పలువురిని పరామర్శించారు.ముథోల్ మాజీ సర్పంచ్ గంట శ్రీనివాస్ అతని మనుమరాలు రోడు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరగడంతో వారిని పరామర్శించారు. అదే విధంగా అంబకంటి గ్రామానికి చెందిన అరుంధతి అనే మహిళ కు ఆపరేషన్ జరుగగా, దౌనెల్లి గ్రామానికి చెందిన ఖాదీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు ప్రముఖ వైద్యులు దామోదర్ రెడ్డి, ముథోల్ మాజీ సర్పంచ్ అనిల్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్ తో పాటు పలువురు ఉన్నారు.

మాదిగ కులస్తుల జనాభా శాతానికి తగ్గట్లుగా రిజర్వేషన్లు కేటాయించాలి

0

 మాదిగ కులస్తుల జనాభా శాతానికి తగ్గట్లుగా రిజర్వేషన్లు కేటాయించాలి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ఏకైక కులం మాదిగ కులస్తులు మాత్రమే అని గత 12 సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగ చేస్తున్న ప్రకటన సత్యమని కుల గణన రిపోర్ట్ రుజువు చేసిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ..జనాభా  11% ఉందని, ఎస్సీ వర్గీకరణలో కూడా అంతే వాటా కేటాయించాలని మంద కృష్ణ మాదిగ గతంలో లేవనెత్తిన ప్రశ్నలు సంపూర్ణ న్యాయమని కుల గణన రిపోర్ట్ తో స్పష్టం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన నివేదికలో మాదిగల జనాభా 10.3 % గా తేలిందని దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో 10 నుండి 11% రిజర్వేషన్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకువచ్చే సమయంలోనే 9% రిజర్వేషన్ వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని మంద కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. అయినా రేవంత్ రెడ్డి ఆనాడు న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చిన కుల గణన రిపోర్ట్ ద్వారా మాదిగల జనాభా శాతం గణంకాలతో సహా ఋజువైందని,ఇప్పుడైనా రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు తెచ్చుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. సందర్భం వచ్చినప్పుడు న్యాయం చేస్తామని మాట్లాడిన ముఖ్యమంత్రి ఆ సందర్భం ఇప్పుడు వచ్చిందని గుర్తించాలని అన్నారు.

మంద కృష్ణ మాదిగ జనాభా ప్రకారం మాదిగలకు 11% శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి మెప్పు కోసం కొంత జాతి ద్రోహులు మాదిగ మేధావుల ముసుగులో 9% రిజర్వేషన్లను స్వాగతించి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అలాంటి ద్రోహులకు కుల గణన రిపోర్ట్ చెంప పెట్టు లాంటిదని అన్నారు. మాదిగల జనాభా శాతానికి కన్న తక్కువ శాతం రిజర్వేషన్లు రావడాన్ని స్వాగతించిన ద్రోహులు ఇప్పుడు మాదిగ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కీలక ఘట్టంలో జాతికి వెన్నుపోటు పొడిచి తీరని ద్రోహం చేసిన వాళ్లకు జాతి గురించే మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. ద్రోహం ఎప్పటికైనా ఓడిపోతుందని సత్యమే ఎప్పటికైనా గెలిచి తీరుతుందని అన్నారు. జాతికి ద్రోహం చేసిన వాళ్లకు జాతి గురించి మాట్లాడే అర్హత ఇకపై లేదని అన్నారు.ఇక ప్రభుత్వం బహిరంగపరిచిన కుల గణన రిపోర్ట్ లో జనాభాలో మాదిగలు ప్రథమ స్థానంలో ఉన్నట్లుగానే దినసరి కూలీ పని చేసుకునే వారిలో,అలాగే భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్న వారిలో కూడా మాదిగలే ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇది మాదిగల పేదరికాన్ని, సామాజిక వెనుకబాటుతనాన్ని సూచిస్తుందని అన్నారు.గత 80 ఏళ్ల కాలంలో మాదిగలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పని చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి తగిన సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టాలని,ప్రభుత్వ భూములను మాదిగలకు పంచాలని డిమాండ్ చేశారు.అన్ని రకాల ప్రభుత్వరంగ నియామకాల్లో 11% వాటా మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగలు శాసనమండలిలో , లోక్ సభ, రాజ్యసభలో, నామినేటెడ్ పోస్టులో ఒక్కరు కూడా లేరని, ఈ అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు.

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో బలమైన నిర్మాణాత్మక శక్తిగా ఎదగడానికి మరింత సంఘటితం కావాలని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిరావు ఫులే ద్విశత జయంతి ఉత్సవాలను రెండు సంవత్సరాల పాటు నిర్వహించడానికి నిర్ణయం తీసుకుందని, అందుకోసం ప్రధానమంత్రి చైర్మన్ గా 126 మందితో కమిటీ ఏర్పాటు చేసిందని,ఆ కమిటీలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను సభ్యుడిగా నియమించడం జరిగిందని,అందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి యావత్తు మాదిగ జాతి తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇది మాదిగలు ఇచ్చిన గుర్తింపు,గౌరవంగా భావిస్తామని అన్నారు.ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని, దేశంలో మొదటిగా మహాత్ముడిగా నిలిచిన మహాత్మా ఫులే సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాసింగారి భూమయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, మందర్న మారుతి మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పద్మ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చెవురి సంజీవయ్య మాదిగ, MRPS నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, టౌన్ నాయకులు రాహుల్ మాదిగ, ఎల్లన్న మాదిగ, సత్యం మాదిగ తదితరులు పాల్గొన్నారు.

శివాజీ మహారాజ్ విగ్రహం కోసం రూ.5 వేలు అందజేసిన ఇట్టడి సుశాంత్ రెడ్డి

0

శివాజీ మహారాజ్ విగ్రహం కోసం రూ.5 వేలు అందజేసిన ఇట్టడి సుశాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: మండలంలోని కొబ్బయి గ్రామంలో ప్రతిష్టాపించనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కోసం జై హనుమాన్ పర్టిలైజర్స్ బేల యజమాని ఇట్టడి సుశాంత్ రెడ్డి తమ వంతు సహాయంగా రూ.5 వేలు గ్రామ పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహావీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేయడం ఎంతో సంతోషకరమని, శివాజీ మహారాజ్ ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడని పేర్కొన్నారు. బేల మండలంలోని ఏ గ్రామంలో ఐన శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు ముందుకొస్తే తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దు: జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ 

0

బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దు: జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దని అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, జరగకుండా ఉండడానికి అందరూ ప్రయత్నం చేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ అక్షయ తృతీయలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ష్యూర్ ఎన్జీవో, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం బాల్ రక్షక్ భవన్ లో పూజారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ష్యూర్ ఎన్జీవో ముద్రించిన బాల్య వివాహాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మంచి ముహూర్తాలు ఉన్నాయని వయసు చూడకుండానే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బాల్యవివాహాలు నిర్వహించొద్దని పూజారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అర్చకులు చెప్తే ప్రతి ఒక్కరూ వింటారని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వయసు నిర్ధారణ చూసుకున్న తర్వాతే పెళ్లిళ్లు చేయాలన్నారు. ఆధార్ కార్డు, వయసు, ప్రామాణికం కాదని విద్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలన్నారు. తక్కువ వయసులో పెళ్లిళ్లు చేస్తే ఆరోగ్య సమస్యలతో పాటు, మానసిక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ధూప దీప నైవేద్య సంఘం జిల్లా అధ్యక్షుడు కలవరపు లింగయ్య మాట్లాడుతూ.. బాల్ వివాహ ముక్త్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు నిరోధించడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ సిపివో (చైల్డ్ మ్యారేజ్ నోడల్ ఆఫీసర్) రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, పివోఐసి ఎన్. స్వామి, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్ కుమార్, అర్చక సంఘం ప్రచార కార్యదర్శి గజానంద్, కోశాధికారి నాగభూషణ్, చైల్డ్ హెల్ప్ లైన్, డిసిపియు, ష్యూర్ ఎన్జీవో సిబ్బంది తదితరులున్నారు.

బోధన్ లోని రైస్ మిల్లుపై దాడి: పీడీఎస్ బియ్యం పట్టివేత 

0

బోధన్ లోని రైస్ మిల్లుపై దాడి: పీడీఎస్ బియ్యం పట్టివేత 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బోధన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో ఉన్న సాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై సీసీఎస్ టీం, స్థానిక బోధన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఉంచుతునారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రైడ్ చేపట్టారు. రెండు ఆటోలు, ఒక లారీ నుండి పీడీఎస్ ధాన్యం అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 144. 2 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.సివిల్ సప్లై డీటీ హనుమాన్ పంచనామ నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ సీఐ వెంకటనారాయణ హెచ్చరించారు.

కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు 

0

కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కు భవిష్యత్తులో మహిళలే తగిన గుణపాఠం చెబుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిఖిల్ సాయి చౌరస్తా వద్ద కాంగ్రెస్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ ನಿಜ స్వరూపం బయటపడిందన్నారు. 2023 లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలికినట్టే పలికి ఇప్పుడు వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు కూడా మహిళల పట్ల వారికున్న నైతికత బయటపడిందన్నారు. మహిళా శక్తి అంటూ చెప్పే కాంగ్రెస్ అవకాశం ఇవ్వాల్సిన సమయంలో వెనక్కి తగ్గిపోవడం సిగ్గుచేటన్నారు. మోడీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యతిరేక పనులలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉద్దేశంతో బీజేపీ ముందడుగు వేసింది అన్నారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ చేయని మహిళా బిల్లు ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బొబ్బిలి సువర్ణ వేణు, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి మహిళా నాయకురాలు వనిత తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ స్పాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

0

నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ స్పాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఫ్లోరోసెంట్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్ లతో నిజామా బాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్, నిజామా బాద్,ఆర్మూర్ డివిజన్ పరిధిలోగల 55 బ్లాక్ స్పాట్లను పోలీసులు సమగ్రంగా గుర్తించి పర్యవేక్షించారు.ఎస్ఐలు,సీఐలు, ఏసీపీలు,అదనపు డీసీపీ(అడ్మిన్)తో పాటు పోలీస్ కమిషనర్ స్వయంగా ఆయా ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్, అశోక్ సాగర్ దర్గా వద్ద నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,శనివారం పర్యవే క్షించారు. ఈ సందర్భంగా ప్రమాదాలకు ప్రధాన కారణా లైన అధిక వేగం, రోడ్డు వంపులు,స్పష్టమైన సూచిక బోర్డుల లేమి, రాత్రివేళలలో తగిన లైటింగ్ లేకపోవడం వంటి అంశాలను గుర్తించడం జరిగింది.వీటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులకు సిపి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ స్పాట్లలో తక్షణ చర్యలు గా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం,ఫ్లోరోసెంట్ పెయింటింగ్ మరియు రేడియం స్టిక్కర్ తో కూడినటు వంటి పోలీస్ కటౌట్ లను ఏర్పాటు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం,రోడ్డు మార్కింగ్లు స్పష్టంగా వేయడం, స్ట్రీట్ లైటింగ్ మెరుగుపరచడం వంటి పనులు చేప ట్టాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల పర్య వేక్షణను పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదనం గా, డ్రైవర్లలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని,హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరి పాటించడం వంటి అంశాలపై కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణలో పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా సమగ్ర చర్యలు కొనసాగుతున్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలి

0

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలి

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: యూనివర్సిటీ సమస్యల పైన తన గళం వినిపించాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నూతన పాలక మండలి సభ్యునిగా నియామకమైన చెరుకూరి రజనీకాంత్ ను ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాబోయే కాలంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి కొరకై పాలకమండలి సమావేశాల్లో చర్చించి, యూనివర్సిటీ అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని, యూనివర్సిటీలో గతంలో వచ్చిన ఆరోపణలపై తన గళం వినిపించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా రజనీకాంత్ నియమకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.