Home Blog Page 33

శనగ పంట కొనుగోలు చేయాలని  జాతీయ రహదారిపై నేతల ధర్నా

0

శనగ పంట కొనుగోలు చేయాలని  జాతీయ రహదారిపై నేతల ధర్నా

చిత్రం న్యూస్, జైనథ్: నిలిచిపోయిన శనగ కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, అఖిలపక్ష నాయకులు జైనథ్ జాతీయ రహదారిపై మంగళవారం ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో శనగ పంట మధ్యంతరంగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

పండించిన పంటను అమ్ముకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు పునరుద్ధరించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సర్సన్ లింగారెడ్డి  డిమాండ్ చేశారు. మొత్తం 1.26 లక్షల క్వింటాల్లో  లక్ష క్వింటాళ్ళు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్, నాయకులు పిడుగు స్వామి యాదవ్, నిలేష్ రెడ్డి, గణేష్ యాదవ్, గంగన్న, సోమ రాంరెడ్డి, పురుషోత్తం రెడ్డి, వెంకన్న, కొప్పుల దేవన్న, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అత్యవసర సమయంలో అండగా..సీఎం సహాయనిధి

0

అత్యవసర సమయంలో అండగా..సీఎం సహాయనిధి

*రూ5లక్షల ఎల్ వో సీ లెటర్ ను అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామానికి చెందిన పోతుగంటి లత అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5లక్షలకు సంబంధించి ఎల్ వో సీ లెటర్ ను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మేల్యే తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు.ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు వారి గ్రామస్తులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఘనంగా బసవ జయంతి వేడుకలు: పాల్గొన్న మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి

0

ఘనంగా బసవ జయంతి వేడుకలు: పాల్గొన్న మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హిందూ ధర్మంలోని లింగాయత్ శాఖ వ్యవస్థాపకులు, 12వ శతాబ్దపు గొప్ప కవి, తత్వవేత్త అయిన మహాత్మా బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని మాజీ జెడ్పీ ఛైర్మన్ సుహాసిని రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు బసవన్న అందించిన బోధనలు ఎప్పటికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన చూపిన మార్గం ఎంతో ఆచరణాత్మకమైనదని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కల దత్తు, బండారి దేవన్న, పలువురు నేతలు, స్థానికులు పాల్గొన్నారు.

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 

0

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల  ఎస్ఐ, సీఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని పేర్కొన్నారు.

పేద రోగులకు ఎల్ వో సీ పత్రాలు అందజేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా

0

పేద రోగులకు ఎల్ వో సీ పత్రాలు అందజేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పలువురికి ఎల్ వో సీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజక వర్గంలో అర్హులైన పేదలకు ఎల్ వో సీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన పెంటయ్య నరాల సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే సబ్బని శ్రీనివాస్ మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున ఇరువురికి కలిపి రూ.6 లక్షల ఎల్ వో సీ లు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా ప్రజల ప్రాణాలను కాపాడటమే తన కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

0

అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

*ముగిసిన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

* ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. గత వారం రోజులుగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ జిల్లా కార్యాలయంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్నిమాపక శాఖ నిర్వహించిన వారోత్సవాలు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఈ అవగాహనతో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగి సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందన్నారు. అగ్గిమాపక శాఖ అధికారులు సూచించిన మేరకు జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సీపీ సాయి చైతన్య బహుమతులను ప్రధానం చేశారు. గత ఏడాది సంభవించిన వరదల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి పరమేశ్వర్, నిజామాబాద్ స్టేషన్ అధికారి శంకర్, రూరల్ అధికారి విక్రమ్, బోధన్ కేంద్ర అధికారి సుభాష్, నందిపేట్ ఇన్చార్జ్ అధికారి నరేష్, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులను శాలువాతో సన్మానించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బెస్ట్ ఫైటర్లను శాలువాతో సన్మానించారు.

నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి

0

నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి

*అభినందించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. ప్రమోషన్ పొందిన వారిని పోలీసు కమిషనర్ సాయి చైతన్య సోమవారం తన చాంబర్లో అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశానుసారము నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా నలుగురు ప్రమోషన్ పొందారు.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి హెడ్ కానిస్టేబుల్ లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో వర్ని పోలీస్ స్టేషన్ కు చెందిన  సికె.ఆనంద్, జిల్లా కేంద్రంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న వి. సతీష్, ధర్పల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన కె.నవీన్ కుమార్, నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన శశి ప్రసాద్ లు ఉన్నారు.

ఆదిలాబాద్‌లో నకిలీ జాబ్ స్కామ్ గుట్టురట్టు

0

ఆదిలాబాద్‌లో నకిలీ జాబ్ స్కామ్ గుట్టురట్టు

చిత్రం న్యూస్, మావల, ఆదిలాబాద్: నిరుద్యోగులే లక్ష్యంగా నకిలీ ఉద్యోగ అవకాశాలతో మోసం చేస్తున్న ఒక వ్యక్తిని మావల పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ విమానయాన సంస్థ SpiceJet లో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి, బాధితుల నుండి నిందితుడు భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని 37 ఏళ్ల వాగ్మారే రాజరత్నగా గుర్తించారు.

మోసం చేసిన తీరు: బాధితుడికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు (Appointment Letters) పంపి, SpiceJet లో ఉద్యోగం వచ్చినట్లు నమ్మించి మోసం చేశాడు. ఒక బాధితుడి నుండి నిందితుడు సుమారు ₹3.40 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుండి మొబైల్ ఫోన్ మరియు డిజిటల్ ఆధారాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించి, ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్యారంటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బు అడిగే వారిని నమ్మవద్దు. ఉద్యోగ సమాచారాన్ని కేవలం అధికారిక సంస్థల వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఆదివాసీ అమరవీరులకు ఎంపీ గోడం నగేష్ నివాళి

0

ఆదివాసీ అమరవీరులకు ఎంపీ గోడం నగేష్ నివాళి

చిత్రం న్యూస్, ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లిలోని ఆదివాసీ అమరవీరుల స్తూపం వద్ద ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తాటిపెల్లి గంగాధర్ రావుతో పాటు పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. వారిలో ఇంద్రవెల్లి మండల నాయకులు, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, బీజేపీ మండల అధ్యక్షులు కేంద్రే బాలాజీ, మాజీ జెడ్పీటీసీ కనక తుకారాం, మారుతి, దీపక్ సింగ్ శేఖావత్ రాజ్ వర్ధన్, పుష్పలత, సర్పంచ్ కోరేంగ సుంగు, తోడసం నాగోరావు, కనక హన్మంత్ రావు, రాజ్ లింగు వంటి ఆదివాసీ నాయకులు మరియు ఇతర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వృద్ధుడికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

0

వృద్ధుడికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

చిత్రం న్యూస్, వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమావధిగా పెట్టుకున్న ‘సనాతన హిందూ సేవా సమితి’ తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సోమవారం సంస్థ ఆధ్వర్యంలో 177వ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఖిలా వరంగల్ మధ్య కోట ప్రాంతానికి చెందిన చింత కొమురయ్య గౌడ్ అనే వృద్ధుడు వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అతనికి ఎటువంటి ఆధారం లేదని తెలుసుకున్న సేవా సమితి సభ్యులు తక్షణమే స్పందించారు. కొమురయ్య గౌడ్‌కు రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు సాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు బడుగు రాము, తాళ్లపెల్లి రమేష్, పెరుమాండ్ల శ్రవణ్, మేరుగు కరుణాకర్, బండారి సంపత్, పేర్ణ భరత్, ఆవునూరి రాజేష్, గజ్జెల రాము తదితరులు పాల్గొన్నారు. సమితి చేస్తున్న ఈ కృషిని స్థానికులు కొనియాడారు.