Home Blog Page 32

తొర్తి గ్రామాన్ని సందర్శించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ

0

తొర్తి గ్రామాన్ని సందర్శించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్భిగ్యాన్ మాల్వీయ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తొర్తి గ్రామ రైతులు ప్రజావాణిలో దరఖాస్తు చేసిన విషయం విచారణ కోసం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మమాల్వీయ మంగళవారం తొర్తి గ్రామాన్ని సందర్శించారు. తమ గ్రామానికి చెందిన మురుగు కాలువ (డ్రైనేజీ) నీళ్ళు తమ పంట పొలాలకు వచ్చి నష్టము జరుగుతుందని రైతులు సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజావాణిలో విన్నవించిన ప్రకారం రైతుల పంట పొలాలను, మురుగు కాలువను సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తొర్తి గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద భూమేశ్వర్, బాధిత రైతులు, గ్రామపెద్దలు, గ్రామస్తులతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల తహసీల్దార్ జె మల్లయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్ము ఇరిగేషన్ ఈ ఈ, ఎంపీఓ శివ చరణ్, ఏఈ ఇరిగేషన్, ఉప సర్పంచ్ సుమన్ గౌడ్, గామ పంచాయతీ కార్యదర్శి అనిల్, గ్రామ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.6.33 కోట్ల నిధుల ఆమోదం: అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన కలెక్టర్, ప్రజా ప్రతినిధులు 

0
  1. రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.6.33 కోట్ల నిధుల ఆమోదం: అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన కలెక్టర్, ప్రజా ప్రతినిధులు 

చిత్రం న్యూస్ ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ (RIMS) ఆసుపత్రి అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుదలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ, సుమారు  రూ.6.33 కోట్ల విలువైన అభివృద్ధి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అనంతరం రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీ.టీ.జీ (C.T.G) యంత్రాలను, ఇతర వైద్య పరికరాలను కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భొజ్జు పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, కొత్త పరికరాల అందుబాటుతో వైద్య సేవలు మరింత వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగుపరచవలసిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ పుష్కర్, వివిధ విభాగాల అధిపతులు రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

వరద నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్షేత్రస్థాయి పరిశీలన

0

వరద నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్షేత్రస్థాయి రిశీలన

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లోని పలు వరద ప్రభావిత ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లను) జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలంలో రహదారులు, నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా తీసుకోవాల్సిన నివారణ, రక్షణ చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరద నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి వెంబడి నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో డీపీవో రమేష్, డీఎల్పీవో ఫణిందర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ట్రైబల్ ఈఈ తానాజీ, జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ అధికారి సునీత పాల్గొన్నారు. తహసీల్దార్లు కలిమ్, ఇమ్రాన్ ఖాన్, కవిత, ఎంపీడీఓలు రవీందర్, శేఖర్, డిప్యూటీ ఈఈ రాజేష్, జాతీయ రహదారి విభాగం ప్రతినిధులు శాలిని, సుకుమార్, సోమా నిర్మాణ సంస్థ ప్రతినిధులు,  స్థానిక సర్పంచులు పాల్గొన్నారు.

కలెక్టర్ రాజర్షి షా ను కలిసిన నూతన ఆదిలాబాద్ ఆర్డీఓ జగదీశ్వర్ రావు

0

కలెక్టర్ రాజర్షి షా ను కలిసిన నూతన ఆదిలాబాద్ ఆర్డీఓ జగదీశ్వర్ రావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా బాధ్యతలు స్వీకరించిన పి.జగదీశ్వర్ రావు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కలెక్టర్‌కు ఆయన పూల మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు. విధి నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆర్డీఓకు దిశానిర్దేశం చేశారు.

పోలీస్ సిబ్బందికి యూనిఫాం ఆర్టికల్స్ పంపిణీ చేసిన సీపీ సాయి చైతన్య

0

 పోలీస్ సిబ్బందికి యూనిఫాం ఆర్టికల్స్ పంపిణీ చేసిన సీపీ సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలో ట్రాఫిక్, పోలీసు సిబ్బందికి అవసరమైన కూలింగ్ అద్దాలు, యూనిఫామ్ ఆర్టికల్స్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి అందిన ఈ సామాగ్రిని సీపీ చేతుల మీదుగా మంగళవారం పోలీస్ సిబ్బందికి అందజేశారు. టాఫిక్ డ్యూటీలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్యం, భద్రత దృష్యా ఈ సామగ్రి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏఆర్) రామచందర్రావు, రిజర్వ్ ఇన్స్ పెక్టర్ ధరణి కుమార్,వెల్పేర్ ఆర్.ఐ సతీష్, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్ సిబ్బంది పాల్గొన్నారు.

మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు 

0

మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా పత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విసృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం జరుగగా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, ఇకపై అవలంభించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫాజోలంను కట్టడి చేసేందుకు గట్టి నిఘా ఉంచాలన్నారు. క్లోరోఫాం, డైజోఫాం, ఆల్ఫాజోలం వంటి వాటిని వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు తాగి అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా కల్తీ కల్లు బారిన పడకుండా గ్రామగ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు.

నిరంతర దాడులు కొనసాగిస్తూనే, మత్తు పదార్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పని చేసేలా చూడాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. ఎక్కడైనా గంజాయి, క్లోరో హెడ్రేట్, డైజోఫామ్, అల్ఫాజోలం వంటి వాటి రవాణా,విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కూడా ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ సమావేశంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిజామాబాద్ జోన్ ఏసీపీ సోమనాథం, ఏ.సీ.పీ ప్రకాష్, ఎక్సెజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత, డీఐఈఓ రవికుమార్, ఎంవీఐ శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్, సైకియాటిస్ట్ డా.రవితేజ తదితరులు పాల్గొన్నారు.

జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆలిండియా ర్యాంకులు కాకతీయ వశం

0

జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆలిండియా ర్యాంకులు కాకతీయ వశం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో ఇంటర్మీడియట్ చదువుతూ తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ర్యాంకులను కాకతీయ విద్యార్థులుకైవసం చేసుకున్నారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో తమకు ఎలాంటి బ్రాంచీలు లేకున్న తొలిప్రయత్నంలోనే ఇంటర్ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారని కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ సి హెచ్. విజయలక్ష్మి తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఎస్ హేమ 132, రాఖీ 1763, రమాదేవి 2800,సంధ్య 2984, ఎస్.ఆర్థిక 4761, హెచ్. భరత్ 6430, శరత్ చంద్ర 8388, అమృత వర్షిణి 9461, ఎ.అత్రీజ్9955, జే. తన్విక 10292 ర్యాంకులు సాధించగా కాకతీయ ఐఐటీ /మెడికల్అకాడమీ డైరెక్టర్  సీ హెచ్. రామోజీరావు (ఐఐటియన్) వారినిసన్మానించారు.

ఈ సంధర్బంగా రామోజీరావు మాట్లాడుతూ.. కాకతీయ విద్యాసంస్థకు వేరే జిల్లాలో, ఇతర బ్రాంచీలలో సాధించిన ఆలీండియా ర్యాంక్స్ కాదని కేవలం నిజామాబాద్ కాకతీయలో సాధించిన ర్యాంకులు అని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. 10 మంది విద్యార్ధులు జేఈఈ మెయిన్స్ లో ఆలిండియా స్థాయి ర్యాంకులు సాధిస్తే 50 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్డ్ కు అర్హత సాధించారన్నారు. తమ విద్యార్ధులు జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి కాకతీయ విద్యాసంస్థల పేరు నిలబెట్టారని అన్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ తేజస్విని, సీ హెచ్ రాజా, ఐఐటీ అకాడమీ డీన్ నాగరాజు, ప్రిన్సిపాల్ సందిప్ కులకర్ణి, రణదిష్, వైస్ ప్రిన్సిపాల్ శ్యాం, జ్యోత్స్న తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు

0

అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలో అడిషనల్ డీసీపీగా సేవలందించిన బస్వారెడ్డికి సీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్​​లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. బస్వారెడ్డి గతంలో జిల్లాలోనే ఎస్సైగా పనిచేశారని..అనంతరం సీఐగా, ఏసీపీగా  పదోన్నతి పొంది సేవలందించారన్నారు. అదనపు డీసీపీగా విధులు నిర్వహిస్తూ తాజాగా చీఫ్​ ఆఫీస్​కు బదిలీ అయ్యారన్నారు. మృదు స్వభావిగా పేరున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.

కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్​ సెక్యూరిటీ ​ కౌన్సిల్ ఛైర్మన్​ సీపీ సాయిచైతన్య, జనరల్ సెక్రెటరీ డా. కవిత రెడ్డి, ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ, కాకతీయ విద్యాసంస్థల అధినేత రజనీకాంత్ తదితరులు హాజరై బస్వారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది, అభిమానులు సీపీ కార్యాలయానికి వచ్చి బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన స్థానంలో ఐపీఎస్​ అధికారి శుభం ప్రకాష్​ నియమితులయ్యారు.

మానవత్వాన్ని చాటుకున్న కౌన్సిలర్: అత్యవసర స్థితిలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు

0

మానవత్వాన్ని చాటుకున్న కౌన్సిలర్: అత్యవసర స్థితిలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌసియా బేగం అనే మహిళకు సకాలంలో రక్తం అందించి కౌన్సిలర్ పర్వేజ్ అతని స్నేహితుడు జహీర్ తమ ఉదారతను చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గౌసియా బేగం కాళ్లకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ కావడంతో వైద్యులు ఆమెకు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే ఆమెది అరుదైన ‘A- నెగటివ్’ (A- Negative) బ్లడ్ గ్రూప్ కావడంతో రక్తం దొరకడం కష్టమైంది. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త మానే శంకర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రక్తదాతలు కావాలని కోరారు.

ఈ పోస్ట్‌ను గమనించిన 32వ వార్డు కౌన్సిలర్ పర్వేజ్ వెంటనే స్పందించారు. తన స్నేహితుడు జహీర్ బ్లడ్ గ్రూప్ కూడా ‘A- నెగటివ్’ కావడంతో, అతడిని ఒప్పించి రిమ్స్ ఆసుపత్రికి పంపించారు. జహీర్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేయడంతో గౌసియా బేగం ఆపరేషన్‌కు మార్గం సుగమమైంది. సమయానికి స్పందించి ప్రాణదాతలుగా నిలిచిన పర్వేజ్, జహీర్‌ను స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులు అభినందించారు.

రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మిక తనిఖీ: రోగుల ఇబ్బందులపై సీరియస్

0

రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మిక తనిఖీ: రోగుల ఇబ్బందులపై సీరియస్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం రిమ్స్ (RIMS) ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, రోగులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోనే అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రిమ్స్ ఆసుపత్రిలో వనరులు, సిబ్బంది, వైద్యుల కొరత వల్ల సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 150 కోట్ల భారీ వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించినప్పటికీ, సిబ్బంది లేకపోవడం వల్ల ఆ సౌకర్యాలు వృధా అవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమంది వైద్యులను నియమించినా, పూర్తిస్థాయిలో సేవలు అందాలంటే మరిన్ని నియామకాలు జరగాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.

ఆసుపత్రిలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోతే రోగుల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందని, తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్, పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఎమ్మెల్యే వెంట బీజేపి నాయకులు ముకుంద్ రావు, కృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.