Home Blog Page 34

వృద్ధుడికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

0

వృద్ధుడికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’

చిత్రం న్యూస్, వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమావధిగా పెట్టుకున్న ‘సనాతన హిందూ సేవా సమితి’ తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సోమవారం సంస్థ ఆధ్వర్యంలో 177వ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఖిలా వరంగల్ మధ్య కోట ప్రాంతానికి చెందిన చింత కొమురయ్య గౌడ్ అనే వృద్ధుడు వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అతనికి ఎటువంటి ఆధారం లేదని తెలుసుకున్న సేవా సమితి సభ్యులు తక్షణమే స్పందించారు. కొమురయ్య గౌడ్‌కు రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు సాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు బడుగు రాము, తాళ్లపెల్లి రమేష్, పెరుమాండ్ల శ్రవణ్, మేరుగు కరుణాకర్, బండారి సంపత్, పేర్ణ భరత్, ఆవునూరి రాజేష్, గజ్జెల రాము తదితరులు పాల్గొన్నారు. సమితి చేస్తున్న ఈ కృషిని స్థానికులు కొనియాడారు.

ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనంలో ఘనంగా సంస్మరణ దినోత్సవం:‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పుస్తకావిష్కరణ

0

ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనంలో ఘనంగా సంస్మరణ దినోత్సవం:‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పుస్తకావిష్కరణ

చిత్రం న్యూస్, ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్మృతివనంలో సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరై అమరులకు ఘన నివాళులర్పించారు.

ఎస్పీ అఖిల్ మహాజన్, ఇంచార్జి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమరవీరుల స్తూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి, స్తూపానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

పుస్తకావిష్కరణ:

ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్రం భుజేంద్రరావు రచించిన “ఆ గాయానికి 44 ఏళ్లు” అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఇంద్రవెల్లి ఘటన తాలూకు చారిత్రక నేపథ్యాన్ని, ఆనాటి జ్ఞాపకాలను ఈ పుస్తకం గుర్తు చేస్తోందని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావ్, ఆసిఫాబాద్ ,అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆత్రం సుగుణ, నరేష్ జాదవ్ తో పాటు పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు, సార్మేడీలు, పటేళ్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ స్మృతివనం జనసంద్రంగా మారింది.

ఆదిలాబాద్‌లో ఘనంగా బసవేశ్వర జయంతి: నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్

0

ఆదిలాబాద్‌లో ఘనంగా బసవేశ్వర జయంతి: నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో జగద్గురు బసవేశ్వర జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొని, బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. సమాజంలో వేళ్లూనుకున్న వివక్షను నిర్మూలించడానికి, కులమతాలకు అతీతంగా సమానత్వాన్ని సాధించడానికి బసవేశ్వరుడు చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఆయన బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు.

అనంతరం ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా న్యాయం, గౌరవం, సమానత్వం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే మార్గదర్శకమని తెలిపారు.

ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, బసవన్న భక్తులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఖానాపూర్ చెరువు సుందరీకరణకు రూ.3.14 కోట్లతో శంకుస్థాపన

0

ఖానాపూర్ చెరువు సుందరీకరణకు రూ.3.14 కోట్లతో శంకుస్థాపన

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ సోమవారం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా ఆరోగ్యం, పునరుజ్జీవనం, జలవనరుల పరిరక్షణలో భాగంగా ఈ నిధులు మంజూరయ్యాయి.

సుమారు రూ.3.14 కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా, భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, బీజేపీ , కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన సామ రూపేష్ రెడ్డి

0

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరైన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన ముక్కె సవిత దీపక్ కు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తికాగా  సోమవారం గృహప్రవేశ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి హాజరయ్యారు. ముక్కె సవిత దీపక్ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు.బేల మండలంలో అర్హులైన వారందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని,ఎవరు ఆందోళన చెందవద్దన్నారు.

కార్యక్రమంలో బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్,మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాందాస్ నాక్లే, సర్పంచ్ శంకర్,బాపు రావు, ఉప సర్పంచ్ సాగర్, జైనథ్ మార్కెట్ కమిటీ సొసైటీ డైరెక్టర్ మాడవి చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు

0

సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు  

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లాలోని బాసర అభివృద్ధి అంటేనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు నాయుడనీ అంటున్నారు ఇక్కడి స్థానికులు. ఆయన హయాంలో తిరుమల, తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్ తో పాటు అర్బన్ డెవలప్మెంట్ హుడా, జన్మభూమి, సీసీ రోడ్ల నిర్మాణం, వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని నలుమూలలకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వారి అభిమానులు పేర్కొన్నారు. గత 2005-2010 వ సంవత్సరం మధ్య కాలంలో మహారాష్ట్ర గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, శ్రీరాంసాగర్‌లోకి నీరు రాదని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. దీనిలో భాగంగా 2010లో బాబ్లీ వద్ద ధర్నాకు యత్నించినందుకు మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి,కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.సోమవారం బాసరలో ఆయన అభిమానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పాటు ప్రధాన రహదారి బస్టాండ్ వద్ద ఏపీ సీఎం ఫ్లెక్సీ లను ఏర్పాటుచేసిన వారిలో ఉప్పుల్ల లక్ష్మణ్ , నాగేష్, సాయి, సురేష్, చంద్రమోహన్, గణేష్, దేవ్ భాయ్,అల్లం రాజు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక విజయవంతం చేయాలి: ఆదిలాబాద్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షులు దుర్గం శేఖర్

0

 అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక విజయవంతం చేయాలి: ఆదిలాబాద్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షులు దుర్గం శేఖర్

*  కార్యక్రమ నిర్వాహకులకు రూ.10 వేలు అందజేత 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉట్నూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ అసోసియేషన్ & ఫాలోవర్స్ ఉట్నూర్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ జీవిత చరిత్ర నాటిక విజయవంతం చేయాలని ఆదిలాబాద్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి దుర్గంశేఖర్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన గోడప్రతులను  సోమవారం  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతకు బాబా సాహెబ్ జీవిత చరిత్ర తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు. మంగళవారం సాయంత్రం ఉట్నూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నాటికకి భారీ సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమం విజవంతం కోసం తన వంతుగా రూ.10 వేలు నగదును కార్యక్రమం నిర్వహకులు, ఉట్నూర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ బొంకంటి  తదితరులకు అందజేశారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు అంబేద్కర్ అసోసియేషన్ ఉట్నూర్, CH.రమేష్, శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీనివాస్, అంజన్న, మతిన్, స్వామి, కిషన్, రఘనాథ్ ఆడే తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలోకి భారీ చేరికలు: ఆదిలాబాద్ అభివృద్దే లక్ష్యం – ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

బీజేపీలోకి భారీ చేరికలు: ఆదిలాబాద్ అభివృద్దే లక్ష్యం – ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, భోరజ్: జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా భోరజ్ మండలం లేకర్వాడ గ్రామ సర్పంచ్ సంద ప్రభాకర్, ఉప సర్పంచ్, ఇతర వార్డ్ మెంబర్లతో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ప్రజలు తనకు సేవ చేసే గొప్ప అవకాశం ఇచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా భోరజ్ నుండి చంద్రపూర్ హైవే వరకు రహదారి విస్తరణ, తరోడ వద్ద హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు సాధించామని, ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.

రైతుల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం పోరాడతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ‘పొలం బాట’ కార్యక్రమం ద్వారా ప్రతి రైతు పొలానికి రహదారి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. అలాగే, ఫసల్ భీమా పథకం అమలుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.

లేకర్వాడ గ్రామం ఆధ్యాత్మికతకు నెలవని కొనియాడుతూ, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ భోరజ్, జైనథ్ మండలాల అధ్యక్షులు గాజుల సన్నీ, లోక కరుణాకర్ రెడ్డి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జనాభా లెక్కల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి

0

జనాభా లెక్కల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి

చిత్రం న్యూస్, దండేపల్లి :దండేపల్లి మండలంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను అధికారులు అత్యంత క్రమబద్ధంగా, ఖచ్చితంగా నిర్వహించాలని తహసీజనాభా లెక్కల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలిల్దార్ రోహిత్, ఎంపీడీఓ ప్రసాద్ సూచించారు. జనాభా లెక్కలు ప్రభుత్వానికి కీలకమైన సమాచారంగా ఉపయోగపడతాయని, అందువల్ల ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.

సోమవారం దండేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిగా సేకరించాలని, వయస్సు, విద్య, ఉపాధి వంటి అంశాలను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.

అంతేకాకుండా, సేకరించిన సమాచారాన్ని రికార్డుల్లో సరిగా నమోదు చేయడంతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డేటాను సమర్పించాలని సూచించారు. గణనలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని వారు అన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జనాభా లెక్కలు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వంటివని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఈ డేటా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ప్రజలు కూడా సిబ్బందికి సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు.

డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ 

0

డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మమ్మాయి రమేష్ ను ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ శాలువా కప్పి సన్మానించారు.పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నారాయణరావు పటేల్,మాట్లాడుతూ. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మమ్మాయి రమేష్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించిందని, భవిష్యత్తులో జిల్లా స్థాయిలో పార్టీ మరింత పటిష్టం కావడానికి రమేష్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

​తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు ఘనంగా సన్మానించినందుకు మమ్మాయి రమేష్ మా జీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటానని, పార్టీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మమ్మాయి రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.