భాది గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం: లబ్ధిదారులకు ‘సారె’ పెట్టిన సర్పంచ్ దంపతులు
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని భాది గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం అత్యంత వేడుకగా జరిగింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు కొండల సునీత-సంతోష్ దంపతులు తమ నూతన గృహంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దంతెల వినోద్ దంపతులు పంచాయతీ పాలక వర్గం తరపున లబ్ధిదారులకు మర్యాదపూర్వకంగా ‘సారె’ (బట్టలు) అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేష్, ఉప సర్పంచ్ జె. శంకర్, వార్డు సభ్యులు షేక్ వాహబ్, జోడే గణేష్, సుంకరి శ్రీనివాస్, పటేల్ మానిక్ రావు పాల్గొన్నారు. తుడుందెబ్బ అధ్యక్షులు సిడం నందు, అర్జున్గ
మస్తులు హాజరై సందడి చేశారు. తమకు సొంతింటి కలను నిజం చేసినందుకు లబ్ధిదారులు ప్రభుత్వానికి మరియు సహకరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




