-Advertisement-

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కుమ్మరి పెళ్లి సాయితేజ నియామకం

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కుమ్మరి పెళ్లి సాయితేజ నియామకం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బిజెపి నాయకుడు కుమ్మరిపెళ్లి సాయితేజ (సన్నీ సాయి తేజ) నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామ్ చందర్ రావు ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.

పార్టీ బలోపేతానికి సాయితేజ అందిస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం, రాష్ట్ర స్థాయిలో ఆయనకు ఈ కీలక బాధ్యతను అప్పగించింది. తన నియామకం పట్ల సాయి తేజ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కుమ్మరి పెళ్లి సాయితేజ నియామకం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానందం లకు సాయితేజ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కిసాన్ మోర్చా ద్వారా రైతు సమస్యలను సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సాయితేజ నియామకం పట్ల జిల్లా బీజేపీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments