Home Blog Page 147

మట్టి గణపతులనే పూజిద్దాం- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

0

మట్టి గణపతులనే పూజిద్దాం- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

చిత్రం న్యూస్, బోథ్: వినాయక చవితి సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విత్తన గణపతిని ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్  మాట్లాడుతూ.. విత్తన గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామాన్నారు. విత్తన గణపతులను పూజలు చేసిన అనంతరం ఇంటి ఆవరణలో నిమజ్జనం చెయ్యాలన్నారు. ఇలా చేస్తే విత్తన గణపతి నుండి ఒక మొక్క మొలుస్తుందని, ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తన గణపతులను ప్రతిష్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువకులు గాడ్గే దీపక్, ధీరజ్ తదితరులు ఉన్నారు.

సీఎం చంద్ర బాబుకు వల్లభ స్వామి వారి చిత్రపటం అందజేసిన రేలంగి వెంకట్రావు

0

సీఎం చంద్ర బాబుకు వల్లభ స్వామి వారి చిత్రపటం అందజేస్తున్న రేలంగి వెంకట్రావు

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర_స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చిన సీఎం నారా చంద్ర బాబు నాయుడుని స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్పతో కలిసి పెద్దాపురం ఐటీడీపీ అధ్యక్షులు, మార్కెట్ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిశారు. తొలి తిరుపతిలో వెలసిన శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయ చరిత్రను సీఎం కు వివరించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని, సహకరించాలని  సీఎంకి విన్నవించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

ఘనంగా ముగిసిన శ్రావణ మాస నిత్య భజన కార్యక్రమం 

0

*భజన కళాకారులను సన్మానిస్తున్న రామాలయ కమిటీ ఛైర్మన్ జీ వీ రమణ

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లాలోని సొనాల మండల కేంద్రంలో శ్రీ రామాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం సీతారామ భజన మండలి ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న శ్రావణ మాస నిత్య భజన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఆలయంలో  నిత్య భజనలు చేయడం గత 12 సంవత్సరముల నుండి ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా శ్రావణమాసం మొదలైన నాటి నుండి ప్రతిరోజు సీతారామ భజన మండలి కళాకారులు భక్తి గీతాలు ,ఆధ్యాత్మిక గీతాలు, హరినామ సంకీర్తనలు, శ్రీరామ కీర్తనలు ఆలపించి భక్తులను మైమరపింప చేశారు. భజన కళాకారులందరూ వ్యవసాయ పనులు, ఇతర వ్యాపార పనులు చేసుకుంటూ..ప్రతిరోజు రాత్రి మూడు గంటలపాటు రామాలయంలో రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు భజన గీతాలను ఆలపించి తమ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా రామాలయ కమిటీ చైర్మన్ శ్రీ జీ వీ రమణ నిత్య భజన కళాకారులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భజనలు అనేవి మానసిక ఉల్లాసానికి, భక్తి భావాలకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. భజన కళాకారులు తమ కళ అంతరించి పోకుండా భావితరాలకు అందించాలన్నారు. కళాకారులందరినీ ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీతారామ భజన మండలి బృందం, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

నేరడిగొండలో ఘనంగా ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు

0

నేరడిగొండలో ఘనంగా ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు. బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ,  సిరికొండ, గుడిహత్నూర్, బజార్ హత్నూర్, మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నేరడిగొండ మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్ లో అడే గజేందర్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. ఆయనతో  కేక్ కట్ చేయించారు. కార్యకర్తలు శాలువా, పూలమాలతో సన్మానించి తమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనం మెచ్చిన జననేత, పేద ప్రజల పెన్నిధి, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ అన్న అని కొనియాడారు. తమ జన్మదిన వేడుకలకు హాజరైన కార్యకర్తలకు గజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజేందర్ గారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి తన వంతు కృషి చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ ఇమామ్ ,నారాయణ గౌడ్, అగు రమేష్, మురళిగౌడ్, పర్ల వంశీ, రాజు గౌడ్, కళ్లెం భోజన్న ,వడ్ల నారాయణ,లక్ష్మన్న, కంచం లక్ష్మణ్, దత్తు, కృష్ణ తదితరులు  పాల్గొన్నారు.

ఘనంగా అంతరిక్ష దినోత్సవం

0

ఘనంగా అంతరిక్ష దినోత్సవం

చిత్రం న్యూస్,భైంసా: జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శుక్రవారం భైంసా గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ మేజర్ సీ హెచ్ శివప్రసాద్ పాల్గొని  మాట్లాడారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఆర్యభట్ట లాంటి ప్రయోగాలు, చంద్రయాన్ వన్, టు, త్రీ, లాంటి ప్రయోగాలతో ప్రపంచంలో భారతదేశం ఎందులోనూ తక్కువ లేదని నిరూపించిన ఘనత మన శాస్త్రవేత్తలదని, ఇస్రో ఎన్నో ప్రయోగాలతో తన కీర్తిని ఇనుమడింప చేసిందన్నారు.విద్యార్థులు ఆదర్శనీయ వ్యక్తుల జీవితాలను ఎప్పటికప్పుడు చదువుతూ వారిని అనుసరిస్తూ ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనలో మన దేశం అత్యంత గర్వనీయ స్థానంలో ఉందని చంద్రయాన్ వన్ గాని మంగళ్ యాన్ గాని చంద్రయాన్ 3 గాని ప్రయోగాలు చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు సృజనాత్మకమైనటువంటి ప్రతిభను కలిగి ఉండాలని, వివిధ ఆవిష్కరణలు, ప్రయోగాలు చేస్తూ ముందు ఉండాలని రాకేష్ శర్మ ,కల్పనా చావ్లా ,సునీత విలియమ్స్, శుభాన్స్ శుక్ల లాంటి ఎందరో అద్భుతమైన అంతరిక్ష యాత్ర చేసి దేశ కీర్తిని నలు దిశల ఇనుమ డింప చేశారని అన్నారు.ఈ సందర్భంగా అంతరిక్షానికి సంబంధించి పలు ప్రదర్శనలు చేశారు. విద్యార్థులకు డ్రాయింగ్‌, క్విజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చంద్రయాన్‌ విజయవంతంపై తయారు చేసిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.వివిధ పోటీలు నిర్వహించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, ఫిజిక్స్ అధ్యాపకులు శ్రావణ్య, రవికుమార్, విద్యార్థులు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అధికారిక లాంచనాలతో ఆర్మీ జవాన్ అంతక్రియలు

0

అధికారిక లాంచనాలతో ఆర్మీ జవాన్ అంతక్రియలు

చిత్రం న్యూస్, భైంసా, ముథోల్: అధికార లాంచనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. గత నాలుగు రోజుల కింద న్యూఢిల్లీలోని దేశ వైమానిక దళాల్లో పనిచేస్తున్న ముథోల్ మండలం తరోడ వాసి లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్ {25} వాటర్ పాల్ లో పడి మృతిచెందారు. శనివారం అతని అంత్యక్రియలు స్వగ్రామంలో అధికారిక లాంచనాలతో పూర్తయ్యాయి. ఎయిర్ ఫోర్స్ అధికారి ప్రవీణ్ సింగ్ జవాన్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. ఇక చివరి చూపు కొరకు మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముథోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్, సీఐ మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సిస్  తది

తరులు పాల్గొన్నారు.

భైంసాలో అందుబాటులోకి ఫ్రీజర్ సేవలు

0

*డా.ముత్యం రెడ్డి తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం 

చిత్రం న్యూస్,భైంసా: తన తల్లి అమృతాబాయి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని భైంసా పట్టణంలోని శ్రీ సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.ముత్యం రెడ్డి కుటుంబీకులు ఒక ప్రత్యేక సేవను శనివారం అందుబాటులోకి తెచ్చారు. మృతదేహాన్ని భద్రపరచేందుకు అవసరమైన ఫ్రీజర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచారు. మాతృమూర్తి జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ఈ సదుపాయం స్థానికులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు, వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే బంధువుల రాకపోకల్లో ఆలస్యం కలిగిన సందర్భాల్లో మృతదేహాన్ని  భద్రపరచుకునేందుకు ఇది ఎంతో తోడ్పడనుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ముత్యం రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..తల్లి ఆత్మకు శాంతి చేకూరాలన్న ఆశయంతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సేవను ప్రారంభించాం. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఫ్రీజర్ సేవలు అవసరమున్న వారు 9441375375, 6300854960 మొబైల్ నెంబర్ లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఫ్రీజర్ సేవలను అందుబాటులోకి తెచ్చిన డా. ముత్యంరెడ్డిని భైంసా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కదం మోహన్ రావ్ పాటిల్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండెపు కాశీనాథ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చందులాల్, బీజేపీ పట్టణ కమిటి అధ్యక్షులు రావుల రాము, మాజీ అధ్యక్షులు గాలి రవితో పాటు పలువురు అభినందించారు.

బీఆర్ఎస్  నాయకుల పరామర్శ

0

బాధిత కుటుంబీకులను పరామర్శిస్తున్న బీఆర్ఎస్  నాయకులు

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కోగ్దూర్ గ్రామానికి చెందిన చొకాజీ నింసత్కర్ మరియు హేటి గ్రామానికి చెందిన నాందేవ్ ఠాక్రే (మహాజన్) ఇటీవల మరణించడంతో బాధిత  కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు శనివారం పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్ళెం ప్రమోద్ రెడ్డి, యువ నాయకుడు సతీష్ పవార్, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ తేజ్రావు మస్కే, విశాల్ గోడే,సుదర్శన్ బత్తుల, సుధాకర్ చౌహాన్ తదితరులు ఉన్నారు.

ఘనంగా ఆడే గజేందర్  జన్మదిన  వేడుకలు

0

బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, నేరడిగొండ:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నేరడిగొండ లోని లక్ష్మి గార్డెన్ లో జరిగిన జన్మదిన వేడుకల్లో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆడే గజేందర్

ను శాలువాతో సన్మానించారు. అనంతరం కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ కో-ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, రెండ్ల రాజన్న, ఎస్ కే అలీమ్, దినేష్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పొలాల పండగ 

0

         ఘనంగా పొలాల పండగ

*ఎడ్లకు కుటుంబసమేతంగా పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తున్న జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల అరుంధతి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పొలాల అమావాస్య పండగను జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల అరుంధతి_వెంకట్ రెడ్డి దంపతులు  ఘనంగా నిర్వహించారు.  ఆదిలాబాద్ పట్టణం శాంతి నగర్ లోని వారి నివాసంలో ఉదయం మట్టితో చేసిన ఎడ్లకి  కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం  బసవన్నలకు నైవేద్యం సమర్పించారు. ప్రజలు పాడిపంటలు, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.