Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home NIRMAL గుండెపోటుతో  ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి  

గుండెపోటుతో  ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి  

0
0

గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి  

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బైంసా కేంద్రంలో గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి చెందారు. కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ బుధవారం గుండెపోటుతో మరణించడంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. ఆయన వైద్యుడిగా చేసిన సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటూ ఆయన మృతి చెందాడన్నా విషయాన్ని విని జీర్ణించుకోలేకపోయారు. ప్రస్తుతం నర్సాపూర్ (జి ) ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆయన బైంసాలో సొంతంగా ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం తన ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేస్తుండగా డా.సురేందర్ కు ఒక్కసారి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది నిర్మల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు.  ఆయనకు చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతి చెందడంతో ఆయా గ్రామ ప్రజలు, భైంసా ఏరియా హాస్పిటల్ ఉద్యోగులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, స్నేహితులు దిగ్బ్రాంతి చెందారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం
WhatsApp