Home Blog Page 148

ఘనంగా పొలాల అమావాస్య 

0

పొలాల వేళ.. అన్నదాతలకు అండగా

*సామాజిక  కార్యకర్త మంగదుడ్ల మహేందర్ యాదవ్ ఉదారత

చిత్రం న్యూస్, భీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వడూర్, అర్లి (టి) గ్రామాల్లో పొలాల అమావాస్య పండగను ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త మంగదుడ్ల మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వడూర్, అర్లిటి గ్రామాల్లో చూడ ముచ్చటగా బసవన్నలను అలకరించిన రైతులకు పంపుసెట్లు, టార్చిలైట్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను బహుమతులుగా ప్రధానం చేశారు.

ఈ మేరకు  ఆయన మాట్లాడుతూ. రైతు నేస్తాలైన బసవన్నలను పూజించుకోవడం రైతుల్లో గొప్ప పండగ అన్నారు. కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్దలతో జరుపుకోవడం మత సామరస్యం తో ఐక్యమత్యానికి పొలాల పండగ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వడూర్ గ్రామ పెద్దలు హన్మాండ్లు యాదవ్, మాజీ సర్పంచ్ హన్మాందాస్ యాదవ్, రమణారెడ్డి, సుదర్శన్, సంజీవ్ రెడ్డి, కావటి దేవరెడ్డి, అడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగన్న, అనిల్ యాదవ్, అర్లి t మాజీ సర్పంచ్ గొల్లి లస్మయ్య,  వీడీసీ చైర్మన్ ఓమన్న, గ్రామ పెద్దలు కామన్వార్అశోక్, రాహుఫ్, నందు, ఉల్లాస్ పటేల్, గజానన్ యాదవ్, గంగయ్య, మాజీ ఎంపీటీసీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

జీవో 49 రద్దు చేయాలి_బీజేపి ఎమ్మెల్యేలు

0

జీవో 49 రద్దు చేయాలి_బీజేపి ఎమ్మెల్యేలు

*సత్యాగ్రహ దీక్ష చేపట్టిన పాల్వాయి హరీశ్

*నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

చిత్రం న్యూస్, కాగజ్ నగర్:  సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ను బీజేపి ఎమ్మెల్యేలు విరమింపజేసారు. జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శుక్రవారం పాల్వాయి హరీష్ బాబును బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేశ్ రెడ్డి,  కాట్ పెల్లి  వెంకటరమణ రెడ్డి లు పరామర్శించారు.  నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ. సందర్భంగా బీజేపి ఎమ్మెల్యేలు మట్లాడుతూ..ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49 రద్దు చేస్తున్నామని కేవలం ప్రకటించిందని, దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు జీవో 49 రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపి పార్టే ఆధ్వర్యంలో ప్రభుత్వంపై భారీ ఎత్తున పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

సంప్రదాయబద్ధంగా పొలాల అమావాస్య వేడుకలు

0

సంప్రదాయబద్ధంగా పొలాల అమావాస్య వేడుకలు

*బసవన్నలకు ప్రత్యేక పూజలు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. బోథ్ మరియు  సొనాల మండల కేంద్రాల్లో  శ్రావణ మాస ఉత్సవాల సందడిలో భాగంగా పొలాల బసవన్నల ఊరేగింపులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వానలు బాగా కురవాలి, పొలాలు పచ్చగా కళకళలాడాలి. పంటలు బాగా పండాలని ఆకాంక్షతో గ్రామ పెద్దలు, యువత బసవన్నలను పూలమాలలతో, రంగురంగుల వస్త్రాలతో అలంకరించి గ్రామ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. డోలు వాయిద్యాల మధ్యన ఊరేగింపు గ్రామమంతా సందడిగా సాగింది.రైతులు బసవన్నలకు పంటలు బాగా పండాలని, కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొనాలని మొక్కులు తీర్చుకున్నారు. బసవన్నల ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఈ సాంప్రదాయం తరతరాలకు సంక్రమించి కొనసాగాలని, రైతు జీవితంలో బసవన్నకు ఉన్న ప్రాధాన్యతను కొత్త తరం గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు.  పొలాల అమావాస్యలో శాస్త్రీయత దాగి ఉందని పెద్దలు తెలిపారు..

 

మావల లో ఘనంగా పొలాల అమావాస్య పండగ 

0

ఎడ్లకు కుటుంబసమేతంగా పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నబోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, మావల: నిత్యం రైతుకి సహాయపడే పశువులను పూజించే గొప్ప పండగ పొలాల అమావాస్య పండగను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామం మావలలోని నివాసంలో ఉదయం మట్టితో చేసిన ఎడ్లకు శ్రీకాంత్ రెడ్డి, అయన సోదరుడు ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ఎడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని హనుమాన్, పోచమ్మ ఆలయాల్లో డప్పు చప్పుళ్ల నడుమ ఎడ్ల ఊరేగింపు ఏంతో వేడుకగా నిర్వహించారు. రైతులు, యువకులు, గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎడ్ల ఊరేగింపులో పాల్గొన్నారు.

ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

0

ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: గిఫ్ట్ డీడ్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన జాయిట్ సబ్ రిజిస్ట్రారర్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. గమనించిన కొంత మంది కార్యాలయ సిబ్బంది అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు దాడులు జరపగా..లంచం తీసుకుంటున్న జాయింట్ రిజిస్ర్త్రార్ ను అదుపులోకి తీసుకున్నారు. సిలికన్ పరీక్ష నిర్వహించి పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. బాదితుడు బేల మండలం సిర్సన్నకు చెందిన మన్సుర్ ఖాన్ పటాన్ తన భార్య గౌసియ బేగం పేరున ఉన్న ఇంటిని తనపై గిఫ్ట్ డీడ్ కోసం ఈనెల 19న ముదస్సిర్ షా అనే డాక్యుమెంట్ రైటర్ తో పత్రాలు తయారు చేశారు. 20వ తేదిన జాయింట్ రిజిస్ట్రారర్ వద్దకు పత్రాలను పరిశీలించి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాదితుడు దానికి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం గిఫ్ట్ డీడ్ అయిన తరువాత ఐదు వేలు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని డీఎస్పీ మధు తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి అయిన లంచం అడిగితే పోలీసులు లేదా ఏసీబీని సంప్రదించాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని తెలిపారు. అయితే ఇంచార్జ్ బాధ్యతల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గతంలో కరీంనగర్ జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి బయటకు రావడం గమనార్హం.

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

0

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

చిత్రం న్యూస్, భైంసా: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తౌసిఫ్ ఆధ్వర్యంలో వాలేగాం లో వైద్య శిబిరం నిర్వహించారు. 69 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ తౌసిఫ్ మాట్లాడుతూ.. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగహన కల్పించి, వ్యక్తి గత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పై కూడా అవగహన కల్పించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్న పల్లె దవాఖానాలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని గ్రామ ప్రజలకు తెలిపారు. వైద్య శిబిరములలో అసంక్రిమిత వ్యాధులు అనగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీఎచ్ఓ వంశీ, డాక్టర్  హెచ్ ఈవో అబ్దుల్ సలీమ్, డాక్టర్ విజయ్ కుమార్,ఏఎన్ఎంలు లక్ష్మి,మంజుల, గ్రామ కార్యదర్శి పోతన్న, స్వయం సహకార సీసీ లక్ష్మణ్,గ్రామ సమైక్య విఓఏ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ మాణిక్ రావు, ప్రజలు తదితరులు ఉన్నారు.

గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ధి

0

పనులు జాతర కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్న జిల్లా పంచాయితీ అధికారి రమేష్ 

చిత్రం న్యూస్, జైనథ్: గ్రామాలు అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా పంచాయతీ అధికారి రమేష్ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వార రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు జాతర – 2025 భాగంగా జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు జిల్లా పంచాయతీ అధికారి రమేష్ భూమిపూజ చేసి ప్రారంభించారు. అంతకు ముందు గత సంవత్సరం ఉపాధి హామీ పథకం ద్వారా ద్ నిర్మించిన నడాఫ్ కమ్ షెడ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం చేపట్టిన పనులు జాతర కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చాలా అభివృద్ది పనులు జరగుతున్నయన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రైతులు, ఉపాధి హామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భగా 100 రోజులు ఉపాధి హామి పని దినాలు పూర్తి చేసిన కూలీలను, గ్రామ పంచాయతి కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల ఎంపీడీవో మహేష్ కుమార్, ఏపీవో సుభాషిణి, పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, గ్రామస్తులు పెంచల ఉశన్న,సోమ రాంరెడ్డి, ఎండ్ర వాకేశ్,సింగిరెడ్డి రాంరెడ్డి, రాజన్న, ప్రవీణ్ రెడ్డి, పూర్ణచందర్ రెడ్డి, రాకేష్, చిన్నరెడ్డి రాములు, ఆశన్న పాల్గొన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  భూమిపూజ

0

ఇస్పూర్ లో భూమిపూజ  చేస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, నేరడిగొండ:  రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనుల జాతరలో భాగంగా నేరడిగొండ మండలంలోని ఇస్పూర్ గ్రామంలో నిర్వహించిన నూతన గ్రామ పంచాయతీ భవనం , క్యాటిల్ షెడ్ నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను గ్రామస్తులు సన్మానించారు. 100 రోజుల పని పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి వాంకిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేదని దీనిని మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేశారని అన్నారు. పనుల జాతరలో పాత పనుల ప్రారంభోత్సవాలే ఉన్నాయని కొత్త పనులు మంజూరు చేసి కార్యక్రమం పెడితే బాగుండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో   మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు శివారెడ్డి, రమేష్, నానక్ సింగ్, రాజు, సవాయిరాం, అనిల్ యాదవ్, రాథోడ్ సురేందర్, రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గులాబ్, భారత్, వివిధ శాఖల అధికారులు  తదితరులు  పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం 

0

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం 

*ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

చిత్రం న్యూస్, కొత్తపేట: ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ప్రతి సమస్యపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తాగునీరు, రోడ్లు, విద్యుత్, హౌసింగ్, పెన్షన్లు, రేషన్ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రతి వినతిని వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ ప్రజా దర్బార్ లో 74 వినతులు వచ్చాయని ఎమ్మెల్యే బండారు తెలియజేశారు. వచ్చిన వినతులను త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

0

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, కైకలూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ కైకలూరులో శ్రీ శ్యామలాంబ అమ్మవారి కళామండపంలో   ప్రముఖ సినీ నటుడు, పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. కొణిదల చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కైకలూరు వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కామినేని గారు చిరంజీవి గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు,  నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహరావు గారు, NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.