Home Blog Page 145

Vinayaka chavithi vedukalu- పాఠశాలలో వినాయక చవితి వేడుకలు       

0

 Patashaalalo Vinayaka chavithi vedukalu- పాఠశాలలో వినాయక చవితి వేడుకలు  

మట్టి విగ్రహాలను తయారు చేసిన పాఠశాల విద్యార్థులు

             చిత్రం న్యూస్,భైంసా:

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పురస్కరించుకొని మట్టితో వినాయకుడి ప్రతిమలను తయారు చేశారు. పీవోపీ(ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌)తో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి హాని జరుగుతుందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికే విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించామని స్కూల్ హెచ్ఎం రాధిక తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను పూజించాలని హెచ్ఎం రాధిక, విద్యార్థులకు సూచించారు.

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

0

ఉపాధ్యాయుడు కరీం అన్సారీ (ఫైల్ ఫొ టో)

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

చిత్రం న్యూస్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి ప్రాథమికోన్నత పాఠశాల బయో సైన్స్ ఉపాధ్యాయుడు కరీం అన్సారీ సోమవారం సాయంత్రం  హఠాన్మరణం  చెందారు.  ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన కరీం అన్సారీ పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చారు. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే  ఓ  ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  గుండె నొప్పి ఎక్కువ కావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు.

ఆడే గజేందర్ ని కలిసిన నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు

0

ఆడే గజేందర్ ని కలిసిన నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు

చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ  మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ని నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు సోమవారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాలనీలో గల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆడే గజేందర్  తెలిపారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ కాలనీ సభ్యులు సంతోష్, మణి, అరుణ్, ప్రవీణ్, అనిల్, నాయకులు  ఎఎండీ సద్దాం, కపిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

0

*వరదలతో నష్టపోయిన రైతులకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

*ధర్నా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ 

చిత్రం న్యూస్, భోరజ్: కాంగ్రెస్ ప్రభుత్వం  ఇచ్చిన  హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి జైనథ్ మండల నాయకులు భోరజ్ మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.353 జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ మట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ, తెలంగాణ ప్రజలకు ఆరు హామీలు అమలు ఇస్తామని హామీ ఇచ్చి, వాటిని అమలు చేయలేదని, రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు, పంట నష్టాలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే ఇంక భారీ ఎత్తున నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపి జైనథ్, భోరజ్ మండలాల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, గాజుల సన్నీ, బీజేపి మాజీ జైనథ్ మండల అధ్యక్షులు కట్కం రాందాస్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి, నాయకులు సీతారాం, సూర్య రెడ్డి, రాకేష్ రెడ్డి, తోట రమేష్, మహేందర్, వెంకన్న, సురేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి

0

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి

*కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని  జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్ గంగా పరీవాహక ప్రాంతాల్లో  అధికంగా సోయా, పత్తి, కంది పంటలు ముంపుకు గురయ్యాయని తెలిపారు. వరద ముంపుకు గురైన రైతులకు ఎకరానికి రూ.50 వేలు నష్ట పరిహారం అందజేయాలని కోరామన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సిడం రాకేష్, పొచ్చన్న, సూర్యరెడ్డి, రమేష్ అశోక్, భోగి ఊశన్న తదితరులు ఉన్నారు.

అనాధ ఆశ్రమంలో పేదలకు అన్నదానం

0

అనాధ ఆశ్రమంలో  ఉచితంగా ఫ్యాన్లు అందజేస్తున్న  బృహస్పతి-ధనలక్ష్మి దంపతులు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన బృహస్పతి -ధనలక్ష్మి దంపతుల 25వ పెళ్లి రోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. KNR కాలనీలోని వృద్ధులకు వారి అవసరాలు తెలుసుకొని ఉచితంగా ఫ్యాన్లు అందజేశారు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి రోజులు, పుట్టిన రోజులకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించి పేదలకు తోడ్పడాలని వారు పేర్కొన్నారు.

 

విద్య నేర్పిన గురువు కుటుంబానికి ఆర్థిక చేయూత

0

విద్య నేర్పిన గురువు కుటుంబానికి ఆర్థిక చేయూత

చిత్రం న్యూస్, బోథ్ : విద్య నేర్పిన గురువు కుటుంబానికి ఆర్థిక చేయూతనందించారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మోడల్ స్కూల్ విద్యార్థులు.  ఇక్కడ గంటల ప్రాతిపదికన పనిచేస్తూ ఇటీవల మరణించిన ఎకనామిక్స్  ఉపాధ్యాయుడు అశోక్ కుటుంబానికి మోడల్ స్కూల్  ఉపాధ్యాయులు, విద్యార్థులు రూ.93,460 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మొత్తాన్ని అశోక్  భార్య, పిల్లలకు ప్రిన్సిపాల్ Dr.అనురాధ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శివ భక్త మార్కండేయ మందిరంలో  శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం

0

శ్రీ శివ భక్త మార్కండేయ మందిరంలో  శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా.బోథ్ పట్టణం కేంద్రం లోని శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయం లో శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా  నిర్వహించారు. 30 రోజుల పాటు కలశం పెట్టి అఖండ దీపం వెలిగించారు. నిత్యం భోజన కార్యక్రమం నిర్వహించారు. రోజు వేముల చంద్రమోహన్ గారితో ప్రవచనాలు భక్తులుకి వినిపించారు. నిత్యం భజనలు చేసిన భక్తులకు, ప్రవచనం చేసిన చంద్రమోహన్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం చంద్ర మోహన ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఆలయంలో గల శివ విగ్రహానికి సేరె లక్ష్మీ ఆధ్వర్యం లో అన్న పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పట్టణ పద్మశాలి గౌరవ అధ్యక్షుడు గంగుల మల్లేష్, అధ్యక్షుడు మెరుగు భోజన్న, ప్రధాన కార్యదర్శి మాసం అనిల్ కుమార్, భజన భక్తులు బారే హితిష్, బారే నారాయణ, దాసరి గంగయ్య, బింగి పురుషోత్తం, తాటికొండ రాజేశ్వర్, గొర్ల ప్రభాకర్, బొడ్డు సుశీల, సేరె లక్ష్మీ, బోనగిరి చంద్రకళ, బారె పద్మ, సోయం రాధ, జక్కుల లక్ష్మీ , పోసాని, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

అడానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

0

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్న అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా (బి ) గ్రామంలో అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ చేశారు.  ఈ సందర్బంగా సతీష్ పవార్ మాట్లాడుతూ.. బేల మండలంలో ఎక్కడ విద్యార్థుల కోసం ఏ అవసరం ఉన్నా తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు తేజ్రావు మస్కే, సుదర్శన్ బత్తుల, కిరణ్ గోడం, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఉన్నారు.

వాట్సాప్ వేదికగా పొలిటికల్ వార్

0

వాట్సాప్ వేదికగా పొలిటికల్ వార్

చిత్రం న్యూస్, భీంపూర్:  స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందే మండలంలో వాట్సప్ వేదికగా ఆయా పార్టీల యువకులు మాటల యుద్ధం మొదలుపెట్టారు . ప్రధాన సమస్య మారిన రోడ్డు అంశంపై వాడి వేడిగా చర్చకు తెరలేపారు. పదేళ్ళు అధికారంలో ఉండి రోడ్డు బాగు చేయించలేదని ఓ పార్టీ నాయకులు విమర్శిస్తే అధికారంలో ఉన్న మీరు చేయొచ్చుగా అని మరికొందరు వాదనకు దిగడం పొలిటికల్ వేడినీ పుట్టిస్తోంది. రాబోవు ఎన్నికల్లో రోడ్డు అంశమే ప్రధాన ప్రచార అస్త్రంగా మారనుంది. ఇదే అదనుగా యువకులు, విద్యావంతులు కొందరు అప్పుడే పరామర్శలు, ప్రచారంతో ఊపుతెస్తున్నారు. మండల వాసులను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్య నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో రానుందని,  రిజర్వేషన్  తమకే అనుకూలంగా వస్తుందని  మద్దతు తెలపాలని తమ చర్యలతో పరోక్షంగా తాము రంగంలో ఉన్నామని హల్ చల్ చేయడం పొలిటికల్ వార్ ని తలపిస్తోంది.