నూతన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజర్షి షా అధ్యక్షత వహించారు.
అంతకుముందు, నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ, నిబంధనలు, ఇతర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO) ఇ. విష్ణువర్ధన్ తో పాటు కమిటీ సభ్యులు నూకల దేవేందర్, బేత రమేష్, బిర్కుర్వార్ వెంకటేష్, మహమ్మద్ హమీదుల్లా అన్వర్, పి.గజానన్, మెడపట్ల సురేష్, తోట్ల చిన్న అంజయ్య, బి.కిరణ్ కుమార్, జి.వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




