-Advertisement-

TGSRTC ఆదిలాబాద్ రీజియన్‌లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

TGSRTC ఆదిలాబాద్ రీజియన్‌లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: TGSRTC కార్మికులు ఏప్రిల్ 22, 2026 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అదిలాబాద్ రీజియన్ మేనేజర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె కాలంలో బస్సులను నడపడానికి తాత్కాలిక ప్రాతిపదికన అర్హత కలిగిన డ్రైవర్లు మరియు కండక్టర్ల నుండి దరఖాస్తులను కోరుతోంది.

డ్రైవర్ (Driver): హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ పొంది కనీసం 18 నెలల అనుభవం ఉండాలి. హెవీ లోడ్ వాహనాలను నడపడంలో నైపుణ్యం తప్పనిసరి. RTO మరియు RTC అధికారులు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

కండక్టర్ (Conductor): కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి.ఈ నియామకాలు కేవలం సమ్మె కాలానికి మాత్రమే వర్తిస్తాయిని, ఆసక్తి గల అభ్యర్థులు తమ అసలు ధృవీకరణ పత్రాలతో (Original Certificates) సంబంధిత డిపో మేనేజర్లను వెంటనే సంప్రదించాలని ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments