Home Blog Page 143

డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా

0

డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా

చిత్రం న్యూస్, పెద్దాపురం: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం పట్టణంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచినట్లు పెద్దాపురం ఎస్సై వి. మౌనిక తెలిపారు .ఈ మేరకు గురువారం పెద్దాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. ఈ గణపతి నవరాతరులు పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా చేపట్టినట్లు ఎస్సై వి. మౌనిక వెల్లడించారు.

బోథ్ సివిల్ కోర్టు జడ్జిగా న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్

0

బోథ్ సివిల్ కోర్టు జడ్జిగా న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్ కు న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బోథ్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, బోథ్ జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పంద్రం శంకర్ శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్ రావ్ దేశ్ పాండే, పీ పీ శ్రీధర్, ఏజీపీ పంద్రం శంకర్, ఉపాధ్యక్షులు దమ్మపాల్ అంగద్, ఆడెపు హరీష్, రూపేందర్ సింగ్, కుమ్మరి విజయ్ కుమార్, రాజు పాల్గొన్నారు

కల్లూర్–కుంటాల గ్రామాల నడుమ స్తంభించిన రాకపోకలు

0

కల్లూర్–కుంటాల గ్రామాల నడుమ స్తంభించిన రాకపోకలు

*పలుచోట్ల వరదకు కోతకు గురైన రోడ్లు

చిత్రం న్యూస్, భైంసా:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని కల్లూర్–కుంటాల రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో రహదారి మార్గంలోని అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడం మూలంగా అక్కడి ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంతో కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు అధిక భాగం కోతకు గురికావడం మూలంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, అదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్లే వాహనదారులకు నిర్మల్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి కామా రెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ సమీపంలోని కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమ వైపునకు తిరిగి యూటర్న్ తీసుకుని వెళ్లాలని సూచించారు. కొండాపూర్ నుంచి మామడ ఖానాపూర్ మెట్ పల్లి, జగిత్యాల, కరీంనగర్, మీదుగా హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.వర్షం పరిస్థితి ఇలాగే కొనసాగితే కల్లూర్–కుంటాల రోడ్డు మార్గంలో పూర్తి స్థాయిలో రవాణాకు ఆటంకం కలిగే పరిస్థితులున్నాయి. అంతే కాకుండా ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారీ వర్షం కురవడంతో వెంకూర్ లోవెల్ వంతెన సైతం ఉధృతంగా ప్రవహిస్తుంది. పంటలు నీట మునిగిపోయాయి. సోయా పత్తి, వరి  పంటలు నీట మునిగాయి. భారీ వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వాగులో  వ్యక్తి గల్లంతు..కాపాడిన అధికారులు, గ్రామస్తులు

0

వాగులో  వ్యక్తి గల్లంతు..కాపాడిన అధికారులు, గ్రామస్తులు

చిత్రం న్యూస్ నేరడిగొండ:  వాగులో చిక్కుకున్న వ్యక్తి గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి కుప్టి, కుమారి మధ్యలో గల చిన్న వాగుపై భారీగా వరద నీరు రావడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. పొదల్లో  ఇరుక్కున్న వ్యక్తిని గమనించిన ప్రజలు నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ కి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన మండల సిబ్బందిని తీసుకొని ప్రమాద స్థలానికి వచ్చి కుప్టి, కుమారి యువకులు గ్రామ మల్టీపర్పస్ వర్కర్స్ తో కలిసి తాడు సహాయంతో వ్యక్తిని కాపాడారు. వాగులో  కొట్టుకుపోయిన వ్యక్తి సారంగాపూర్ మండలం దుప్పనాయక్ తండాకు చెందిన జాదవ్ సంజుగా గుర్తించారు ఎమ్మార్వో కలీంతో కుప్టి కుమారి గ్రామస్తులు మాట్లాడుతూ.. చిన్న వర్షానికి రాకపోకలకు అంతరాయం కలగడంతో ఇబ్బందులకు గురవుతున్నామని బోథ్ ఎక్స్ రోడ్ ప్రాంతంలో గల ఫారెస్ట్ వారు పార్కు చుట్టుపక్కల నుండి వస్తున్నటువంటి నీటిని కాలువల ద్వారా ఈ ప్రదేశానికి నీటిని వదలడంతో నీరు ఎక్కువగా వస్తుందని.. ఇదివరకే ఇదే ప్రదేశంలో కుచులపూర్ కు చెందిన వ్యక్తి స్వామి మూడు సంవత్సరాల క్రితం మరణించాడని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం చిన్నపాటి వర్షానికి రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రజలం ఇబ్బందులకు గురవుతున్నామని, ఇకనైనా అధికారులు ఈ యొక్క కల్వర్టుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని గ్రామస్తులు కోరారు. ఇందులో ఎమ్మార్వో ఎండి కలీం ఎస్సై ఇమ్రాన్ ఖాన్ ఎంపీడీవో ఎస్. శేఖర్ ఆర్ఐ నాగోరావ్, కుమారి పంచాయతీ కార్యదర్శి  సిండే దత్తాద్రి, జూనియర్ అసిస్టెంట్,  కారోబార్ రాజు, కుప్టి కుమారి, యువకులు ఉన్నారు.

ఘనంగా ముథోల్ ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలు

0

ఘనంగా ముథోల్ ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలు

*ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న నేతలు, రైతులు

చిత్రం న్యూస్, భైంసా: సిరాల ప్రాజెక్టు వద్ద ముథోల్ ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.  సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని మెప్పించి తొమ్మిది కోట్ల రూపాయల నిధులు తెచ్చి సిరాల ప్రాజెక్టు పూర్తి చేయించినందుకు కృతజ్ఞతా భావంగా ఎమ్మెల్యే జన్మదినోత్సవం సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఆయన చిత్రపటానికి ఆయకట్టుదారులు, రైతులు, బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పటేల్ మూలంగా ఎన్నో సంవత్సరాల కల నెరవేరిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు భూమేష్, నాయకులు కిష్టయ్య, చంద్రకాంత్ పటేల్, బాలాజీ పటేల్, ఎల్లప్ప, భోజరాం పటేల్, బండు పటేల్, గంగారాం, గంగాధర్ మహిళా నాయకులు శారదా, విజయ లక్ష్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

,

బోథ్ ఎమ్మెల్యే పరామర్శ

0

బోథ్ ఎమ్మెల్యే పరామర్శ

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన రాథోడ్ బిక్కు నాయక్  ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. బిక్కు నాయక్ మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వీరి వెంట మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ సర్పంచ్ పవన్,  నాయకులు నానక్ సింగ్, రవీందర్ రెడ్డి, రాథోడ్ సురేందర్, దేవేందర్ రెడ్డి, గులాబ్ తదితరులు ఉన్నారు.

ఆదిలాబాదు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు దారి మళ్లింపు

0

ఆదిలాబాదు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు దారి మళ్లింపు

చిత్రం న్యూస్, నేరడిగొండ :జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జల మయం అవ్వడం తో ఆదిలాబాద్ నుండి వయా కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ లోని కొండాపూర్ బ్రిడ్జి నుండి ఎడమ వైపు కి దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా.జి జానకి షర్మిల తెలిపారు. కొండాపూర్ నుండి వయా మామడ, ఖానాపూర్ మెట్ పల్లి, జగిత్యాల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్ళవచ్చని ఆమె తెలిపారు.

COLLECTARLATHO MANTRI JOOPALLY KRISHANARAO-వర్షాలపై కలెక్టర్లతో మంత్రి జూపల్లి  కృష్ణారావు సమీక్ష

0

COLLECTARLATHO MANTRI JOOPALLY KRISHANARAO-వర్షాలపై కలెక్టర్లతో మంత్రి జూపల్లి  కృష్ణారావు సమీక్ష

చిత్రం న్యూస్, నేరడిగొండ: వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఆసిఫాబాద్, నిర్మల్,  ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి? జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఒకవేళ అధిక వర్షాలు పడితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు రైతులకు యూరియా సరఫరా ఎలా చేస్తున్నారు? కొరత ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ , ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపు ల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

MUDHOLE MLA RAMARAO PATEL-భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0

MUDHOLE MLA RAMARAO PATEL-భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

చిత్రం న్యూస్, ముథోల్ : నిర్మల్ జిల్లాలో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇంటి బయటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల ప్రభావంతో కామారెడ్డి, నిర్మల్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని వాగుల పరివాహక ప్రాంత ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ సూచించారు.

BORANCHU SEEEKANTH REDDY-బోరంచు నివాసంలో గణనాథునికి పూజలు

0

BORANCHU SEEEKANTH REDDY-బోరంచు నివాసంలో గణనాథునికి పూజలు

చిత్రం న్యూస్, మావల: ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో కొలువు దీరిన వినాయకునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు రచన- శ్రీకాంత్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమంలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వినాయకుడికి ప్రీతి పాత్రమైన 21 రకాల కూరగాయలతో తయారు చేసిన వంటకాలతో, ఉండ్రాల పాయసంతో నైవేద్యాన్ని సమర్పించారు.భక్తి శ్రద్ధలతో లంభోదరుడున్ని కొలిచారు. అనంతరం మావలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాoతులతో ఉండాలన్నారు. రైతులకు తమ పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు నిర్వహించే వినాయకుని పూజలు మొదలుకొని నిమజ్జనం వరకు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు నిఖిత-ప్రశాంత్ రెడ్డి, సాయి చందన రెడ్డిలు పాల్గొన్నారు.