Home Blog Page 142

మరిడమ్మ దేవస్థానంలో పూర్వ విద్యార్థుల పులిహోర పంపిణి

0

మరిడమ్మ దేవస్థానంలో పూర్వ విద్యార్థుల పులిహోర పంపిణి

చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురంలోని మహారాణి డిగ్రీ కాలేజ్‌కి చెందిన 1988-91 B.Com (B) బ్యాచ్ పూర్వ విద్యార్థులు  శ్రీ మరిడమ్మ దేవస్థానంలో  భక్తులకు పులిహోర, వాటర్, చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని  ఆలయానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు  పూర్వ విద్యార్థులు తెలిపారు.  అమ్మవారి జాతరలో భాగస్వామ్యం కావడం  ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో శాంతి, సమృద్ధి, ఆరోగ్యం ఏర్పడాలని ఆకాంక్షించారు. సమాజానికి చిన్నపాటి సేవ చేయగలిగే ఈ అవకాశం  మరిదమ్మ అమ్మవారి ద్వారా కలిగిందన్నారు.  భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాబోలు సత్య ప్రసాద్, పైడా రామకృష్ణ, ఆర్వీ సత్యనారాయణ, ప్రతాప్ సింహా, కశిరెడ్డి శ్రీను, చి.వెంకటేశ్వరరావు, డీవీడీ సత్యనారాయణ, జగ్గారావు, వి.అప్పారావు, వసంతరావు, కర్రి వరలక్ష్మి, కె.సత్యనారాయణ, ఉమా మహేశ్, కామరాజు తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ

0

మంత్రి కొలుసు పార్థ సారధిని సన్మానిస్తున నాయకులు
*యాదవులకు చట్ట సభల్లో ప్రముఖ స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వం

చిత్రం న్యూస్, నూజివీడు: బీసీలకు అండగా నాడు, నేడు తెలుగుదేశం పార్టీ అండగా ఉందని, యాదవులకు చట్ట సభల్లో ప్రముఖ స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. కృష్ణా జిల్లా పోరంకి, సీతారామ గార్డెన్ లో యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. యాదవ సోదర కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకం అన్నారు. సోదరులంతా ఐక్యతతో ఉండి అటు వ్యాపారంలో ఇటు రాజకీయంగా ఎదగాలని సూచించారు. యాదవులు వ్యాపారానికి గొర్రెల, మేకల పెంపకానికి ప్రభుత్వం సుమారు రూ.1కోటి వరకు సబ్సిడీ రుణాలు అందిస్తుందని, దానికి సంబంధించిన సహాయ, సహకారాలు  ప్రభుత్వం తరపున అందిస్తానన్నారు.యాదవులంతా కలిసి ఉండి చట్ట సభల్లో ప్రముఖ స్థానం సంపాదించి తద్వారా మిగిలిన సోదరులకు చేయూత నివ్వాలని పేర్కొన్నారు. బీసీలు,  యాదవులు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖ అన్నారు.యాదవుల సంక్షేమానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెట్టాయని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.  బ్యాంక్ రుణాలు ఇప్పించడంలో బ్యాంకు వారితో మాట్లాడి త్వరగా అందించే బాధ్యత నాది అని ఎవరికి ఏ అవసరం వచ్చిన నన్ను నేరుగా సంప్రదించాలన్నారు. ఎన్ని ఎకరాలు ఉన్న దాన్ని బట్టి బ్యాంకు వారు సబ్సిడీ రుణాలు ఇచ్చి, తద్వారా పారిశ్రామికవేత్తలుగా. మంచి వ్యాపార వేత్తలుగా ఎదగడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. గొర్రెలు, మేకలు, గేదలు, ఫారంలు నిర్మించడానికి ఎన్నో పథకాలు ఉన్నాయని, బ్యాంకులు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని దాన్ని అంది పుచ్చుకొని ఆర్ధికంగా మన యాదవ సోదరులంతా ఎదగాలన్నారు. దానికి నా వంతు సహాయ,సహకారాలు అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి రావాలని  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు ఆహ్వానం

ఉచిత వైద్య శిబిరానికి రావాలని  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు ఆహ్వానం

చిత్రం న్యూస్ బోథ్:  బోథ్ మండల కేంద్రంలోని లోకమాన్య నగర్ లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి హాజరు కావాలని  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను లోకమాన్య యూత్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆహ్వాన పత్రికను  ఆయనకు అందజేశారు. బాలగంగాధర్ తిలక్  169 వ జయంతి సందర్భంగా ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు వేణు, విష్ణు, సంతోష్,  రాంసాగర్, కిరణ్, విజయ్, కుశల్ రెడ్డి. శశికాంత్, వినయ్ తదితరులు ఉన్నారు.

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలోని రామాలయంలో హిందూ ధర్మ జాగరణ మండలి  ఆధ్వర్యంలో డిసెంబర్ 2023 శనివారం రోజున ప్రారంభించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతోంది. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు సభ్యులతోపాటు భక్తులు, విద్యార్థులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్నారు. నేటికీ 83 వారాలను పూర్తి చేసుకున్నట్లు సభ్యులు తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం వలన భక్తిశ్రద్ధలు, ఏకాగ్రత, ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, మంచి భావాలు, ధైర్యం ,తేజస్సు మొదలైన గుణాలు పెంపొందుతాయని సభ్యులు పేర్కొన్నారు. ప్రతి వారం భగవద్గీత శ్లోకాల పఠనం కూడ చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు. వంద వారాల పాటు 2025 నవంబర్ వరకు సామూహిక హనుమన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని తెలిపారు.

బేల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత

బేల తహసీల్దార్ రఘునాథ్ రావ్ కు వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్

చిత్రం న్యూస్, బేల: జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలని కోరుతూ బేల మండల కేంద్రంలోని  తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ కమిటీ సభ్యులతో కలిసి తహసీల్దార్ రఘునాథ్ రావ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో ప్రభుత్వాలు తీసుకొచ్చినా జీవో నంబర్‌ 49 ద్వారా ఆదివాసీ గ్రామాలు కనుమరుగవు తాయని అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలకు తీవ్రఅన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం

బేడ బుడగ సంఘం కాలనీలో ఉచిత కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ శ్రీ సాయి

చిత్రం న్యూస్, బోథ్:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని బోథ్ ఎస్సై శ్రీ సాయి అన్నారు.  శనివారం సాయినగర్ లోని బుడగ సంఘం కాలనీలో నిర్వహించిన ఉచిత కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలో తమ ఆలోచన తో ముందుకు పోతున్నారన్నారు.  ప్రజలకు ఏమి అవసరమో  ఆలోచిస్తూ.. వైద్య శిబిరంలో  భాగంగా కళ్ళద్దాలు, కంటి ఆపరేషన్ లు ఇలా ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారన్నారు. మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ ..ఇప్పటి వరకు సొసైటీ తరుపున 100 మందికి కంటి ఆపరేషన్లు, 300 అద్దాలు వరకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. భవిషత్యు లో మెగా హెల్త్ క్యాంప్, ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బేడ బుడగ సంఘం అధ్యక్షుడు ఇర్నల రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెరుగు భోజన్న, కొట్టాల పోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు కొట్టాల రమేష్ రెడ్డి ,యూత్ సభ్యులు రమేష్, సంతోష్, ఉమేష్, విఠల్, కాలనీవాసులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేత ఏలేటి అశ్విన్ రెడ్డి ఉదారత

రిషికకు రూ.3.45 లక్షల విలువ గల వినికిడి యంత్రాన్ని అందజేస్తున్న కాంగ్రెస్ నేత ఏలేటి అశ్విన్ రెడ్డి ఉదారత

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన నవ్వ రిషిక కి కాంగ్రెస్ జిల్లా నేత ఏలేటి అశ్విన్ రెడ్డి రూ.3.45 లక్షల వినికిడి యంత్రాన్ని అందజేసి ఉదారత చాటారు. వినికిడి యంత్రం కావాలని గత కొన్ని రోజుల క్రితం అశ్విన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రిషిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని స్పందించి తప్పకుండ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. శనివారం రూ.3.45 లక్షల విలువైన వినికిడి యంత్రాన్ని నవ్వ రిషికకు అందచేశారు. అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తు లో రిషిక ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం సాధించాలని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రిషిక తండ్రి రాజు మాట్లాడుతూ.. నా కూతురికి వినికిడి యంత్రం వచ్చేలా కృషి చేసినందుకు అశ్విన్, అనీష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ సందర్భంగా అశ్విన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడాల అనీష్,  నాయకులు ప్రవీణ్, మహేష్, రామ్ లక్ష్మణ్ గౌడ్, భాశెట్టి శివ, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేదంలో ఘనంగా బోనాల జాతర

వేదంలో ఘనంగా బోనాల జాతర

చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ బోనాల జాతరలో అమ్మవారిని అలంకరించిన తీరు అందరిని ఆకర్షించింది. ఇంతే కాకుండా పిల్లలు ధరించిన అమ్మవారి, పోతురాజుల వేషధారణలు  ఆకట్టుకున్నాయి.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్. బోనాల జాతర మన సాంప్రదాయ పండగని అది ఆషాడమాసంలోనే ఎందుకు జరుపుకుంటామనే  విషయం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అమ్మవారి గీతాలను ఆలపించి వాటిపై నృత్యాలను చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని  అలరించాయి. ముఖ్యంగా విద్యార్థిని చేసిన అమ్మవారి పూనకం వచ్చినట్టు, భవిష్యవాణి చెప్పినట్టుగా చేసిన నాటకం అందరిని చాలా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

*కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్న మండల ప్రత్యేక అధికారి మనోహర్

*జూనోని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన 

చిత్రం న్యూస్, బేల: ప్రజలందరూ తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మనోహర్ ప్రజలకు సూచించారు. శుక్రవారం బేల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు మండలం లోని జునోని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ డ్రై డే, ప్రై డే కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ…వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాని సూచించారు.  గ్రామాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో మహేందర్ కుమార్, బేల పంచాయతీ సెక్రటరీ వేణు గోపాల్, అధికారులు తదితరులు ఉన్నారు.

విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఇచ్చోడ వీడిసి అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ లు అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వీడీసీ సభ్యులతో కలిసి సందర్శించారు. కళాశాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించడం చాలా అభినందనీయమన్నారు. కళాశాల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇతర అవసరమైన వసతుల గురించి ఆరో తీశారు.  వీడీసీ కమిటీ సలహా సభ్యులు అబ్దుల్ గఫార్, ఆశన్న, నరేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.