అంబరాన్నంటిన నిమజ్జన వేడుకలు
కనుల పండువగా శోభాయాత్ర
అడుగడుగునా భక్తుల నీరాజనం
దారి పొడవునా నృత్యాల హోరు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్( కె) గ్రామంలో ఈ సంవత్సరం పెద్దలు వీడీసీ నిర్ణయంతో ఊరిలో ఒకే గణపతి కూర్చోబెట్టి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు రోజులు ఘనమైన పూజలందుకున్న గణప య్యకు ఆదివారం భక్తులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. రంగు రంగుల కాగి తాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహా లను ఉంచి కనుల పండువగా శోభాయాత్ర నిర్వహించారు. దారి పొడవునా డప్పు చప్పుళ్లు, నృత్యాల హోరుతో వైభవంగా సాగిన వినాయక నిమజ్జనంలో అడుగడుగునా గణపయ్యకు భక్తులు నీరాజనం పలికారు. జై గణపతి జై జై గణపతి, గణపతి బొప్ప మోరియా ఆదాలడ్డూ కాలియా అంటూ భక్తులు, యువతీ యువకుల నినాదాలు మిన్నంటగా ప్రత్యేక డీజే చప్పుళ్ల నడుమ అతివల కోలాటం, చిన్నారుల కేరింతల నడుమ విఘ్నేశుడిని వాగులు, చెరువులు, బావుల్లో నిమజ్జనం చేసి ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు.



పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు అందరూ కలిసి ఒకే తాటిపై నడిచి పాల్గొనడం పండుగకు మరింత అందాన్ని తెచ్చింది. ఊరంతా ఒకే వేదికపై ఏకమై పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తరోడ గ్రామంలో గణేష్ నిమజ్జనం జాతర వాతావరణాన్ని తలపించగా, అందరి ముఖాల్లో ఆనందం, భక్తి, ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. ఎస్సై బిట్ల పెర్సిస్ ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.




ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. బాలల గణేష్ మండలి వినాయకుడు భక్తుల జయ జయ ధ్వానాల నడుమ విశేషంగా పూజలందుకుంటున్నాడు. భక్తుల పూజలతో మండపంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి రోజూ వినాయకుని భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ రోజుకో కొత్త కార్యక్రమాన్ని నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. దీంతో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భారీగా కాలనీవాసులు పాల్గొన్నారు.


