Home Blog Page 140

తర్నం బ్రిడ్జిని నిర్మించండి _ఏఎంసీ మాజీ  వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్  

0

 తర్నం బ్రిడ్జిని నిర్మించండి _ఏఎంసీ మాజీ  వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్

 చిత్రం న్యూస్, భోరజ్ :ఆదిలాబాద్ జిల్లా భోరజ్  మండలంలోని  తర్నం బ్రిడ్జిని నిర్మించకపోవడంతో 353బీ జాతీయ రహదారిపై వెల్లె ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ మండల నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. కొద్దిపాటి వర్షానికి నూతనంగా నిర్మించిన వంతెనపై వరద నీరు ప్రవహిస్తోందన్నారు. దీంతో తెలంగాణ_ మహారాష్ట్ర ప్రజలకు రాకపోకలు నిలిచి ఇబ్బందులకు గురవుతున్నారని, భారీ వాహనాలు గంటల తరబడి వేచి ఉంటున్నాయని అన్నారు. బైకులు సైతం వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సిన ప్రజలు ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వి మీదుగా  తిరిగి వెళ్లాల్సి వస్తుందని, గతంలో ఉన్న పాత బ్రిడ్జిని కూల్చేసి మరింత ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు, బ్రిడ్జి పేరును వాడుకొని అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పటికైనా కొత్త బ్రిడ్జిని నిర్మించాలని భోరజ్ మండల నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఊ షన్న, జైనథ్ ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రభాకర్, మాజీ డైరెక్టర్ సతీష్, మాజీ ఎంపీటీసీలు మహేందర్, కోల భోజన్న, బీఆర్ఎస్ నాయకులు అశోక్ రెడ్డి, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం 

0

ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం

*విఠల్-రుక్మిణి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆఖరి పూజ అందుకున్న గణనాథుడు

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం  లక్ష్మీపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మంగళవారం గణనాథుడు ఆఖరి పూజలు అందుకున్నాడు. విఠల్-రుక్మిణి గణేష్  మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేషుడికి అగ్గ మనోజ్ యాదవ్ బిజెపి యువ నాయకులు, బుర్రి దత్తు పాల్గొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు రోజులుగా పూజలందుకున్న వినాయకుని నిమజ్జనోత్సవం ఘనంగా  నిర్వహించారు. అంతకు ముందు మండలి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. విఠల్ -రుక్మిణి గణేష్ మండప నిర్వాహకులు అక్షయ్ రెడ్డి ఆకాష్, అజయ్, సాయిరెడ్డి, విష్ణువర్ధన్, రామ్ రెడ్డి, వికాంత్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నాయకుల నిరసన

0

 బీజేపీ నాయకుల నిరసన

చిత్రం న్యూస్, నేరడిగొండ :ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ చౌక్ లో బీజేపీ నేతలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ చిత్రపటాలతో  రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఆకుల రాజశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో తీవ్రమైన నిరసనలు చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి, అడెపు రమేష్, సురేష్, ఉత్తమ్ సింగ్, ప్రధాన కార్యదర్శి రంజిత్, కార్యదర్శి భీం రావ్, మాజీ  ఎంపీటీసీ దుర్వ రాజు, శ్రీధర్ రెడ్డి,అంత్రం భీంరావ్, విలాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుడి కోసం దరఖాస్తులు ఆహ్వానం 

0

డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుడి కోసం దరఖాస్తులు ఆహ్వానం 

చిత్రం న్యూస్, భైంసా :నిర్మల్ జిల్లా భైంసా లోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గంటల ప్రాతిపదికన అతిథి అధ్యాపకుడి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆంగ్లం,కామర్స్ బోధించుటకు ఈనెల 5లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పీజీలో 55 శాతం మార్కులు ఉండాలని, పీహెచ్ డీతో పాటు బోధనలో అను భవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు.

బోరిగాంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం

0

బోరిగాంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం

చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఇంట్లో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తుగా నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధమైంది. స్థానికులు  కథనం ప్రకారం.. లక్ష్మి తన ఇంట్లో పూజ చేసేందుకు దీపం వెలిగించింది  . పని నిమిత్తం వేరే గ్రామానికి తరలివెళ్ళింది. అయితే ప్రమాదవశాత్తు ఆ దీపం ఇంటికి తగిలి మంటలు అంటుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బాధితురాలికి ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. మంటలు చుట్టుపక్కల వ్యాపించకుండా  స్థానికులు నీరు పోసి మంటలను ఆర్పి వేశారు. ఇంట్లో ఉన్న దుస్తులు, ఆహార ధాన్యాలు, రూ. 20 వేల నగదు కాలి బూడిద అయ్యాయని బాధితురాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐ నారాయణ పటేల్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సమక్షంలో పంచనామ నిర్వహించారు. సుమారు రూ.65 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత మహిళ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.

రాహుల్ గాంధీ ఆశయాలు నెరవేరుతున్నాయి : బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్

0

చిత్రం న్యూస్, నేరడిగొండ :

రాహుల్ గాంధీ ఆశయాలు నెరవేరుతున్నాయి: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్

*సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

రిజర్వేషన్ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ క్షీరాభిషేకం చేశారు. సిరికొండ మండల కేంద్రంతో  పాటు పొన్న ఎక్స్ రోడ్డు వద్ద సంబరాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ..ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న ఈ చర్య పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు వారి వాటా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని మొదటి నుంచి ఆకాంక్షిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలు తెలంగాణలో నెరవేరబోతున్నాయని, ఇది చాలా మంచి పరిణామమని ఆడే గజేందర్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా తెలంగాణ నుండి అడుగులు పడతాయని, కాంగ్రెస్ పార్టీ దీని కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజాసేవ భవన్ లో వినాయక చవితి సందడి 

0

ప్రజాసేవ భవన్ లో వినాయక చవితి సందడి 

*విఘ్నేశ్వరుడికి కంది శ్రీనివాస రెడ్డి ప్రత్యేక పూజలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ లో భక్తుల సందడి నెలకొంది. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రజాసేవ భవన్ హాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి విఘ్నేశ్వరునికి వేద పండితుల శాస్త్రోక్త మంత్రాలతో తొలి పూజ నిర్వహించారు. ప్రజలందరూ సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని కంది శ్రీనివాస రెడ్డి వినాయకుడిని ప్రార్థించారు. పూజ అనంతరం లంబోదరునికి ఇష్టమైన ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులు, కంది శ్రీనివాస రెడ్డి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పూజలో పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

MLA PAYAL SHANKAR _ఖైరతాబాద్ గణనాథునికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూజలు

0

ఖైరతాబాద్ గణనాథునికి ఎమ్మెల్యే పాయల్ శంకర్  పూజలు

చిత్రం న్యూస్, ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన ఖైరతాబాద్ గణనాథునికి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం భారీ గణనాథున్ని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఎమ్మెల్యేలను శాలువా మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణనాథుడు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవడం మన హిందూ ధర్మ సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు. యువత హిందూ ధర్మ పరిరక్షణకై ఇలాంటి హైందవ ధర్మ కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుకు రావాలన్నారు.

బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయం- బోరంచు  శ్రీకాంత్ రెడ్డి  

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయం

*తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు  శ్రీకాంత్ రెడ్డి  

అసెంబ్లీ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల బిల్లు ఆమోదం పొందడంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన  కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి తొలుత నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు  జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసి రిజర్వేషన్లు అమలు చేసే ఘనత కాంగ్రెస్ పార్టీకె దక్కుతుందన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేసీఆర్ బీసీలను అణగదొక్కారని.. కేసీఆర్ చేసిన బీసి బిల్లు బీసిలకు మరణ శాసనం అయ్యిందన్నారు.  బీసి కుల గణన చేసి పకడ్బందీగా బీసి బిల్లు తెచ్చి బీసిలకు రాజకీయ సుస్థిర స్థానం కల్పిస్తున్న ఘనత, ప్రజా పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల ఆశయాల మేరకు ఎవరి జనాభా ప్రకారం వారి వాటా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి ఈ విషయాన్ని విస్తృతంగా తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకులకు ఆయన కృతజ్ఞతలు లిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మునిగెల నర్సింగ్, మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, మాజీ టౌన్ అధ్యక్షులు  ఎండీ వసీం, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, సీనియర్ నాయకులు తడిసెన వెంకట్ రెడ్డి, నలిమేల నవీన్ రెడ్డి, బండి దేవిదాస్ చారి, sk రాజ్ మహమ్మద్, కోరాటి ప్రభాకర్, మర్సకోల్ల గౌతమ్, రేండ్ల రాజన్న, పోచారం, ఎండీ అప్సర్, సమీ ఉల్లా ఖాన్, sk అలీమ్, ,sk ఫహీమ్, sk అజీజ్, ఎంఏ హర్షత్, వెంకటేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పత్తి చేనులో గంజాయి సాగు

0

 చిత్రం న్యూస్, నేరడిగొండ:

పత్తి చేనులో గంజాయి సాగు

*రూ.4 లక్షల విలువైన మొక్కలను స్వాధీనం చేసుకున్న  పోలీసులు

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం గోవిందుపూర్ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం మేరకు దాడులు నిర్వహించగా రూ.4 లక్షల విలువైన 80 మొక్కలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.ఎస్సై తెలిపిన ప్రకారం..నేరడిగొండ మండలం గోవిందు పూర్ గ్రామానికి చెందిన రాజు జాదవ్, విజేష్ రాథోడ్ చేనులో గంజాయి సాగు చేస్తున్నారు. రాజు జాదవ్ పత్తి పంట మధ్యలో 57 గంజాయి మొక్కలు, విజేష్ రాథోడ్ చేనులో 23 గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.