గాంధీభవన్లో ఏఐసీసీ నేత కొప్పుల రాజుకు స్వాగతం పలికిన దుర్గం శేఖర్
* ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
చిత్రం న్యూస్ , హైదరాబాద్: గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, జార్ఖండ్ కాంగ్రెస్ ఇంఛార్జి కొప్పుల రాజు హాజరయ్యారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కొప్పుల రాజుకి ఘన స్వాగతం లభించింది. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లతో కలిసి ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, ఇతర నేతలు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ డిపార్ట్మెంట్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, సామాజిక న్యాయం సాధన, రాజ్యాంగ పరిరక్షణ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం, సామాజిక న్యాయం కోసం సమిష్టిగా పనిచేయడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
