మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికిన దుర్గం శేఖర్
చిత్రం న్యూస్,ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు విచ్చేసిన రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ & దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ శ్రీ దుర్గం శేఖర్ శనివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, హక్కులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు అందజేశారు. జిల్లాలో దళిత వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దళితుల సమస్యలను మంత్రి సానుకూలంగా విని ప్రతి అంశాన్ని పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, దళితుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాజన్న, నక్క రామదాసు, భీంరావు, ఆదిలాబాద్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, ముక్కెర అశోక్ తదితరులు పాల్గొన్నారు.
