బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
చిత్రం న్యూస్, బాసర : దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్బా జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి శుక్రవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకార పూజలను చేశారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తే ప్రయోజకులుగా మారుతారని భక్తుల నమ్మకం. అమ్మవారి దర్శనం కోసం ఉమ్మడి రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు బాసర పోలీస్ సిబ్బంది,తగిన ఏర్పాట్లు చేశారు.
