-Advertisement-

బట్టి సావర్గాం వద్ద భగీరథ పైప్‌లైన్ లీకేజీ

బట్టి సావర్గాం వద్ద భగీరథ పైప్‌లైన్ లీకేజీ

మూడు మండలాల్లో రెండు రోజులు నీటి సరఫరా బంద్ 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు బట్టి సావర్గాం సమీపంలో భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో అధికారులు అత్యవసర మరమ్మతు పనులు చేపట్టారు. ఈ మరమ్మతుల కారణంగా నేటి నుంచి రెండు రోజుల పాటు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావం తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాలపై పడనుంది. ఈ మండలాల పరిధిలోని గ్రామాలకు రెండు రోజులు నీరు రాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి నీటిని పొదుపుగా వాడుకోవాలని, అధికారులకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments