-Advertisement-

తానూర్ లో ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవం 

 తానూర్ లో ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవం 

చిత్రం న్యూస్, బాసర: 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుష్ శాఖ, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా తానూర్ ప్రభుత్వ కళాశాలలో యోగా వాక్, యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డా.జి.లలిత విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ, వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి, ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆయుర్వేదం, యోగా, పోషకాహారం యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆయుర్వేదం ద్వారా ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ మరియు ఆరోగ్యకరమైన రేపటి కోసం పాటించాల్సిన జీవన విధానంపై వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు పోతన్న, విఠల్ , ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments