పిడుగుపాటుకు మూడు మూగజీవాలు మృతి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: మండలంలోని లోహార గ్రామ పంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లోహార గ్రామానికి చెందిన రైతు గైక్వాడ్ సునీల్‌కు చెందిన రెండు ఎడ్లు, ఒక ఆవుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు గురై మూడు మూగజీవాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు పశువులు మృతి చెందడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
